Google Pixel 6 Prices Leak : లాంచింగ్ ముందే లీక్.. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధర తెలిసిందోచ్!

Pixel 6, Pixel 6 Pro స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ధర లీక్ అయినట్టు నివేదికల్లో వెల్లడైంది. రిటైల్ యూనిట్ నుంచి ఒకరు Pixel 6 స్మార్ట్ ఫోన్ అన్ బాక్సింగ్ వీడియోను పోస్టు చేశాడు.

Google Pixel 6 Prices Leak : లాంచింగ్ ముందే లీక్.. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధర తెలిసిందోచ్!

Google Pixel 6 Prices Leak : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత ప్రొడక్ట్ పిక్సెల్ 6 సిరీస్ అక్టోబర్ 19న అధికారికంగా లాంచ్ చేసేందుకు రెడీ అయింది. కొన్ని గంటల్లో అధికారిక లాంచ్ ఉంది అనగా.. అంతలోనే గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధర లీక్ అయింది. Pixel 6, Pixel 6 Pro స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ధర లీక్ అయినట్టు నివేదికల్లో వెల్లడైంది. ఎవరో ఒకతను రిటైల్ యూనిట్ నుంచి Pixel 6 స్మార్ట్ ఫోన్ అన్ బాక్సింగ్ చేసిన వీడియోను పోస్టు చేశాడు.

కొద్దిసేపటి తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశాడు. అయితే ఆ డివైజ్ స్ర్కీన్ ఎలా ఉంటుందో యూజర్లకు మాత్రం అతడు చూపించలేదు. అయితే ఆ బాక్సుపై ఉన్న పిక్సెల్ 6 సిరీస్ అధికారిక ధర మాత్రం లీక్ అయింది. Christian Dimboiu అనే వ్యక్తి Google Pixel 6 Unboxing చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. TikTokలో Pixel రిటైల్ యూనిట్ నుంచి అన్‌బాక్సింగ్ చేశాడు.
Google Pixel 6 సిరీస్ రేపే లాంచ్.. అంతలోనే లీక్.. ధర ఎంతంటే?

‘Sorta Seafoam’ అనే ఆకుపచ్చ రంగులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్ బయటకు తీశాడు. అయితే ఫోన్ బ్యాక్ మాత్రమే చూపించాడు. ఫ్రంట్ స్ర్కీన్ డిస్ ప్లే ఎలా ఉంటుందో మాత్రం తాను చూపించలేదు. ఈ అన్ బాక్సింగ్ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేసిన వెంటనే డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఆ తర్వాత అందులోనూ డిలీట్ చేశాడు. అప్పటికే ఆ వీడియో వైరల్ అయింది. చాలామంది ట్విట్టర్ యూజర్లు వీడియోను రీఅప్ లోడ్ చేసేశారు.


నివేదికల ప్రకారం.. ఇతర స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే Pixel 6 సిరీస్ ఫోన్ కూడా లీక్ కాగా.. ఫోన్ పైన కిందిభాగం మాత్రమే వీడియోలో కనిపించింది. రియర్ కెమెరాలు ఉండగా.. ఛార్జింగ్ అడాప్టర్ మాత్రం బాక్సులో లేదు. Pixel 6 సిరీస్ ఫోన్ ధరపై ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అమెరికాలో ఈ Pixel 6, Pixel Pro మోడళ్ల ధరలు 599 డాలర్లు (రూ.44,877), రూ. 898 డాలర్లు (రూ.67,278)గా ఉన్నట్టు లీక్ డేటా తెలిపింది.

Google Pixel 6 series : లాంచింగ్ ముందే లీకైన కెమెరా ఫీచర్లు..