Google Pixel 6 series : లాంచింగ్ ముందే లీకైన కెమెరా ఫీచర్లు..

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి పిక్సల్ 6 సిరీస్ మార్కెట్లోకి వస్తోంది. అక్టోబర్ 19 మార్కెట్లోకి లాంచ్ కావాల్సి ఉంది. గూగుల్ పిక్సల్ 6 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.

Google Pixel 6 series : లాంచింగ్ ముందే లీకైన కెమెరా ఫీచర్లు..

Google Pixel 6 Series Cameras Leak In Full Glory Ahead Of October 19 Launch

Google Pixel 6 series cameras leak : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి పిక్సల్ 6 సిరీస్ మార్కెట్లోకి వస్తోంది. అక్టోబర్ 19 మార్కెట్లోకి లాంచ్ కావాల్సి ఉంది. ఇంతలోనే గూగుల్ పిక్సల్ 6 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. లాంచింగ్ ముందే కెమెరా ఫీచర్లు లీకయ్యాయి. గూగుల్ పిక్సల్ 6 సిరీస్ రెండు వేరియంట్లలో వస్తోంది. Pixel 6, Pixel Pro రెండు మోడళ్లు ఒకేరకమైన ప్రాసెసర్, టెన్సార్ స్లిప్ ఉన్నాయి. గూగుల్ పిక్సల్ 6, పిక్సల్ 6 ప్రో ఫోన్ కు సంబంధించి టిపస్టర్ ఈవెన్ బ్లాస్ తమ వెబ్ సైట్లో ఈ ఫోటోను షేర్ చేసింది. Google Pixel 6 ఫోన్ కంపెనీ కొత్త కస్టమ్ బుల్ట్ చిప్ గూగుల్ సెన్సార్ (Google Pixel 6)తో వచ్చింది.
Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్‌లు ఇవే!

స్మార్ట్ ఫోన్ వేగవంతంగా పనిచేస్తుంది. మెసేజ్ లను ట్రాన్స్ లేట్ చేయడంతో పాటు ఇంటర్నెట్ లేకుండా వీడియూలను వీక్షించవచ్చు. ఈ టెన్సార్ చిప్.. 80శాతం వరకు ఫాస్ట్ ఫర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. తద్వారా ఫోన్ లోని యాప్స్ త్వరగా ఓపెన్ అవుతాయి. గేమింగ్ 3ప్లస్ రెస్పాన్సివ్ తో వచ్చింది. ఇది మీ ఫోన్ బ్యాటరీని సేవ్ చేస్తుంది. ఎక్కువ కాలం బ్యాటరీ మన్నిక ఉంటుంది. గూగుల్ పిక్సల్ ఫోన్ లో అదనపు సెక్యూరిటీ ఫీచర్ గా ఆల్ న్యూ చిప్ యాడ్ చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. లీకైన కెమెరాల విషయానికి వస్తే.. అతిపెద్ద సెన్సార్లు కలిగి ఉంది. ఈ టెన్సార్ నెక్స్ట్ జనరేషన్ టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ సైబర్ ఎటాక్స్ నుంచి రక్షిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP కెమెరాతో అతిపెద్ద సెన్సార్లు వస్తున్నాయి. Pixel 5 కన్నా ఈ సెన్నార్ల ద్వారా 150 కంటే ఎక్కువగా తక్కువ బరువు ఉంటుంది. కెమెరాలో Magic Eraser ఒకటి ఆకర్షణీయంగా ఉంది. అలాగే మోషన్ మోడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. Motion Mode ఫీచర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. గూగుల్ కచ్చితమైన బ్యాటరీ ఫీచర్లను ఎంచుకోలేదు. Pixel 6లో Adaptive Batteryతో వస్తోంది. దీనిద్వారా తొందరగా ఓపెన్ అవుతుంది. ఇందులో సేవింగ్ మోడ్ కూడా ఉంది. అదే.. Extreme Battery Saver. ఈ ఆప్షన్ ఎంచుకుంటే 48 గంటల వరకు వస్తుంది. Google Pixel 6 ఫోన్‌ 6.4 అంగుళాల స్మూత్ డిస్ ప్లే అమర్చారు. హైరీఫ్రెష్ రేటు, వివిధ రకాల మోడల్స్ అందుబుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సల్ ఫోన్ స్ర్కీన్ కార్నింగ్ గొర్లిల్లా గ్లాస్ విక్టస్ పొందవచ్చు.
OnePlus 9RT: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 9RT మోడల్.. అద్భుతమైన కెమెరాతో!!