బ్లూ టూత్ మీ ఫోన్లో ఛార్జింగ్ ఎంతవరకూ ఖర్చు చేస్తుంది..

బ్లూ టూత్ మీ ఫోన్లో ఛార్జింగ్ ఎంతవరకూ ఖర్చు చేస్తుంది..

Updated On : August 31, 2020 / 10:06 AM IST

బ్లూ టూత్ మీ బ్యాటరీని పాడుచేస్తుందా.. వైర్‌లెస్ టెక్నాలజీకి కచ్చితంగా పవర్ అవసరం.. కానీ, అసలు అవి ఎంతవరకూ అనేద యానెక్డోట్స్, థియరీస్ ఏం చెప్తున్నాయి. బ్లూటూత్ టెక్నాలజీ కారణంగా ఇదొక కామన్ నమ్మకమైపోయింది. కావాలంటే ట్రై చేసి చూడండి బ్లూ టూత్ ఆఫ్ చేస్తే మీ ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుదా లేదా అని.



మోడరన్ ఏజ్ లోని స్మార్ట్ టెక్నాలజీ నిత్యవసరం అయిపోయింది. వాడకపోయినా.. బ్లూ టూత్ ఆన్ చేసి ఉంచితే ఎంత మేర డిశ్చార్జ్ అవుతుందని టెస్టు చేశారా. బ్లూ టూత్ నుంచి మ్యూజిక్ విందామని ప్రయత్నించారా.. వైర్‌డ్ హెడ్‌ఫోన్స్ వాడినప్పుడు ఇంకా తక్కువ బ్యాటరీ వాడగలిగారా అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది.
https://10tv.in/widow-woman-phc-man-shamed-paraded-in-up-village-residents-filmed-it/
ఈ టెస్టు కోసం ఐదు డిఫరెంట్ స్మార్ట్‌ఫోన్లను తీసుకున్నారు. Samsung Galaxy S20 Plus, Huawei P40 Pro, ZTE Axon 11, Xiaomi Poco F2 Pro, Realme X3 Superzoomలపై టెస్టులు జరిగాయి. వాటిని రెండు పద్ధతుల ద్వారా రన్ చేశారు. టెస్టింగ్ సాఫ్ట్‌వేర్ తో వాటి పనితీరును రికార్డ్ చేశారు.



మొదటి ప్రోసెస్‌లో బ్లూటూత్ ఆఫ్ చేసి బ్యాటరీ సేవ్ చేశారు. దీని కోసం రెండు సెట్ల టెస్టులు చేశాం. బ్లూటూత్ ఆన్ చేసి వేరే డివైజ్ ఏదీ కనెక్ట్ అవకుండా ఉంచాం. ఈ సమయంలో 90నిమిషాల పాటు వెబ్ బ్రౌజింగ, 90 నిమిషాల స్లీప్ మోడ్, 90 నిమిషాల బ్రౌజింగ్ చేశాం. సెకండ్ సైకిల్ లో ఫోన్లను 16గంటల పాటు రెస్ట్ లో ఉంచాం. మళ్లీ ఫస్ట్ సైకిల్ లో థర్డ్ సైకిల్ ప్రోసెస్ అప్లై చేశాం.

రెండో సెట్ లో బ్లూటూత్ ఆన్ చేసి వేరే డివైజ్ కు కనెక్ట్ చేశారు. నేరుగా ఓ 4గంటల పాటు మాత్రమే వాడగలిగారు. బ్లూ టూత్ ఆన్, ఆఫ్ వల్ల వచ్చే బ్యాటరీ లైఫ్ ను ఇలానే అర్థం చేసుకోగలిగారు.



దీనిని బట్టే అర్థమైందేంటంటే.. బ్లూ టైత్ ఆన్ చేసి ఉంచినా.. ఆఫ్ చేసి ఉంచినా.. ఒకటే స్థాయి డిశ్ఛార్జింగ్ అవుతుందన్నమాట. వేరే ఇతర ఏ డివైజ్ అయినా కనెక్ట్ అయితే మాత్రమే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఫోన్ లో ఉన్న బ్యాటరీ కెపాసిటీలో 6.6శాతం బ్లూటూత్ కే ఖర్చు అయిపోతుంది. ఈ మొబైల్లలో ఏది ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని అంటే ఈ ఐదింటిలో కొద్దిపాటి గ్యాప్ మాత్రమే ఉందని తెలిసింది.