ప్రముఖ ఆన్‌లైన్ మీడియా యాప్ టిక్‌టాక్ యాప్‌ను తాత్కాలికంగా భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే టిక్‌టాక్ యాప్ నిషేధం విధించిన నాటి నుంచి రోజుకు రూ.4.5 కోట్లు నష్టపోయినట్లు టిక్‌టాక్ డెవలపర్ కంపెనీ బైటెడెన్స్ వెల్లడించింది. దేశంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడం వల్ల దేశంలో 250 ఉద్యోగాలు చిక్కుల్లో పడ్డాయని సదరు కంపెనీ తెలిపింది.
కోర్టు ఆదేశాలతో టిక్‌టాక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్ స్టోర్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు టిక్‌టాక్‌పై విధించిన తాత్కాలిక నిషేధంపై ఏప్రిల్ 24లోపు నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో నిషేధం ఎత్తివేస్తామని మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా దీనిపై సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్న లాయర్.. కంపెనీ ఆర్థిక మూలాలపై ఈ నిషేధం ఎఫెక్ట్ పడుతుందంట్లూ కోర్టుకు తెలిపారు.