Whatsapp Tips And Tricks : వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపిన వారికి తెలియకుండా సీక్రెట్‌గా చదవడం ఎలా? ఇదిగో అదిరిపోయే ట్రిక్..!

Tips And Tricks : వాట్సాప్‌లో పంపిన వారికి తెలియకుండా వారి మెసేజ్‌లను చూడాలని అనుకుంటున్నారా? ఈ టెక్ టిప్స్ ఓసారి తెలుసుకోండి.

Whatsapp Tips And Tricks : వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపిన వారికి తెలియకుండా సీక్రెట్‌గా చదవడం ఎలా? ఇదిగో అదిరిపోయే ట్రిక్..!

How to read WhatsApp messages secretly without letting the sender know

Updated On : June 18, 2023 / 11:10 PM IST

Whatsapp Tips And Tricks : : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్ల ప్రైవసీ విషయంలో వాట్సాప్ ఎక్కడ తగ్గడం లేదు. యూజర్ల ప్రైవసీనే ప్రధానంగా ఫీచర్లను తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్లలో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కమ్యూనికేట్ అయ్యేలా ఉంటుంది. అలాంటి వాట్సాప్‌లో మీరు పంపిన మెసేజ్‌లను ఎవరికి తెలియకుండా చదవాలనుకుని అనుకుంటున్నారా? అయితే, వాట్సాప్ పంపినవారికి తెలియకుండా మెసేజ్‌లను అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

రీడ్ రీసిప్ట్ నిలిపివేయండి :
వాట్సాప్ ‘Read Receipts’ ఆప్షన్ ఉంది. పంపేవారికి వారి మెసేజ్ ఎప్పుడు చదివారో తెలియజేస్తుంది. ఈ ఫీచర్ నిలిపివేయడం ద్వారా మీరు మెసేజ్‌లను ప్రైవేట్‌గా చదవగలరు. ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ‘Account‘పై Tap చేయండి. ‘Privacy’ ఎంచుకోండి. ‘Read Receipts’ ఆప్షన్ నిలిపివేయండి. రీడ్ రీసిప్ట్ ఫీచర్ నిలిపివేయడం ద్వారా ఇతరులు మీ మెసేజ్‌లను కూడా చదివారో లేదో మీరు చూడలేరని గుర్తుంచుకోండి.

Read Also : WhatsApp Chat Lock : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. చాట్ లాక్ ఇదిగో.. మీ చాటింగ్ ఎవరూ చూడలేరు.. ఎలా ఎనేబుల్ చేయాలంటే?

వాట్సాప్ విడ్జెట్‌లను ఉపయోగించండి :
మీ స్మార్ట్‌ఫోన్ హోమ్ స్క్రీన్‌లోని విడ్జెట్‌లు యాప్‌ను ఓపెన్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్‌లను డిస్‌ప్లే చేయగలదు. మీ హోమ్ స్క్రీన్‌లోని ఖాళీ ప్రదేశంలో ఎక్కువసేపు (Long Press) నొక్కండి. మీ డివైజ్ బట్టి ‘విడ్జెట్‌లు’ లేదా ‘+’ ఐకాన్‌పై నొక్కండి. వాట్సాప్ విడ్జెట్ కోసం సెర్చ్ చేయండి. అది ఎక్కడ కావాలో ఆ లొకేషన్‌కు డ్రాగ్ చేయండి. అవసరమైన విధంగా విడ్జెట్ సైజును మార్చండి. ఇప్పుడు, మీరు వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేసి.. రీడ్ రీసిప్ట్‌లను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మెసేజ్‌లను చదవవచ్చు.

How to read WhatsApp messages secretly without letting the sender know

Whatsapp Tips And Tricks : How to read WhatsApp messages secretly without letting the sender know

ఎయిర్‌ప్లేన్ (Airplane) మోడ్‌ని ఉపయోగించండి :
మీ ఫోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఫీచర్‌ని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు వాట్సాప్‌లో పంపినవారికి తెలియకుండానే వాట్సాప్ మెసేజ్‌లను చదవడానికి ఈ పద్ధతి అనుమతిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో Airplane మోడ్‌ని ఎనేబుల్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి కావలసిన మెసేజ్‌లను చదవండి. వాట్సాప్ క్లోజ్ చేసి పూర్తిగా బయటకు వచ్చేయండి. నెట్‌వర్క్‌కి మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను నిలిపివేయండి. ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో మెసేజ్‌లను చదవడం ద్వారా పంపినవారు ఎలాంటి రీడ్ రీసిప్ట్‌లను స్వీకరించరు. మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేసే వరకు మీరు కొత్త మెసేజ్‌లను స్వీకరించలేరు. కొనసాగుతున్న చాట్ కాన్వరజేషన్ కోసం ఈ పద్ధతి వర్కౌట్ కాదని చెప్పాలి.

ఆన్‌లైన్‌లో వినియోగదారులు ప్రైవసీనే ఎక్కువగా కోరుకుంటారు. యూజర్ల ప్రైవసీ విషయంలో వాట్సాప్ కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. చాలామంది వినియోగదారులు తమ వాట్సాప్ లో పంపిన మెసేజ్‌లను ఇతరులకు తెలియకుండా ఉండాలని భావిస్తుంటారు. వాట్సాప్ మెసేజ్ చదివిన విషయం పంపినవారికి తెలియకూడదని అనుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. రీడ్ రీసిప్ట్‌ నిలిపివేయడం ద్వారా, వాట్సాప్ విడ్జెట్‌లను ఉపయోగించడం లేదా తాత్కాలికంగా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా మీరు పంపినవారికి తెలియజేయకుండా ప్రైవేట్‌గా మెసేజ్‌లను చదవవచ్చు.

Read Also : WhatsApp Multi Account : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది.. ఒకే డివైజ్‌లో మరో అకౌంట్‌కు ఈజీగా మారవచ్చు..!