4k Video Smartphones : కంటెంట్ క్రియేటర్ల కోసం టాప్ 4k వీడియో స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కెమెరా ఫీచర్లు కిర్రాక్.. ఎంత ఖరీదైనా కొనాల్సిందే..!
4k Video Smartphones : హై రెజుల్యుషన్ 4K వీడియో అందించే ఖరీదైన కెమెరా ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం ఈ టాప్ 3 ఫోన్లను అందిస్తున్నాం.. ఏది కొంటారో మీ ఇష్టం..

4k Video Smartphones
4k Video Smartphones : కంటెంట్ క్రియేటర్ల కోసం అద్భుతమైన ఫోన్లు.. 4K వీడియో క్వాలిటీతో అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. సోషల్ మీడియాలో వీడియో కంటెంట్‌ను (4k Video Smartphones) క్రియేట్ చేసేందుకు ఈ 4K వీడియోలు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయొచ్చు.
బెస్ట్ కెమెరా ఫోన్లలో 4k వీడియో రికార్డింగ్ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇలాంటి ఫోన్లను కొనేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఇలాంటి 4K వీడియో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలంటే ఈ టాప్ 3 స్మార్ట్‌ఫోన్ల లిస్టును ఓసారి లుక్కేయండి..
ఒప్పో ఫైండ్ X8 సిరీస్ :
ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్ 4k ఫీచర్ కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. పవర్ విషయానికి వస్తే.. ఈ ఒప్పో 5500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ సిరీస్ ప్రో వేరియంట్ 6.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో 12GB ర్యామ్ కలిగి ఉంది. ఒప్పో ఫైండ్ X8 ధర రూ. 69,999 నుంచి లభ్యమవుతుంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ :
ఈ ఐఫోన్ మోడల్ 6.9-అంగుళాల డిస్‌ప్లేతో పాటు 4k వీడియో ఫీచర్‌తో వస్తుంది. టైటానియం ఫ్రేమ్‌తో కూడిన A18 ప్రో చిప్ ఉంది. మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్ ఫోన్. ఈ ఆపిల్ ఐఫోన్ ధర రూ. 112,900 నుంచి అందుబాటులో ఉంది. iOS 18 ఆధారంగా రన్ అవుతుంది. 48MP ప్రైమరీ కెమెరాతో పాటు ఫ్రంట్ సైడ్ 12 MP కెమెరా కూడా కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ :
గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌తో వస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ ధర రూ. 172,999కు లభ్యమవుతుంది. 6.3-అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 48MP ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 10MP కెమెరా కూడా ఉంది. పవర్ విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది.