Samsung Phones
Samsung Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? రూ. 5వేల లోపు ధరలో టాప్ శాంసంగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ కాలింగ్, స్మార్ట్ ఫీచర్‌లను అందిస్తున్నాయి.
Read Also : PM Awas Yojana : కొత్త ఇంటి కోసం అప్లయ్ చేశారా? మీ పేరు ఉందో లేదో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!
బడ్జెట్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లకు దీటుగా బేసిక్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లు లాంగ్ బ్యాటరీ బ్యాకప్, టాప్ బ్రాండ్ నేమ్ కోరుకునే వినియోగదారులకు సరిపోతాయి.
బ్యాకప్ ఫోన్‌ల కోసం చూస్తుంటే ఈ సెగ్మెంట్‌లో అనేక మోడల్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఈ జాబితాలో టాప్ 5 శాంసంగ్ ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ M01 కోర్ :
శాంసంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను సరసమైన ధరకు అందిస్తుంది. 5.3-అంగుళాల PLS TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ v10 (గో ఎడిషన్) ఆధారంగా రూపొందించింది. మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్, 16GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.
8MP ప్రైమరీ, 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. 3,000mAh బ్యాటరీని కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి సరైనది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, LED ఫ్లాష్‌కు సపోర్టు ఇవ్వకపోయినా రోజువారీ స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సరైన ఫోన్ అని చెప్పొచ్చు.
శాంసంగ్ జెడ్ 2 :
శాంసంగ్ Z2 ఫోన్ అనేది 4-అంగుళాల TFT స్క్రీన్ కలిగిన బడ్జెట్ మినీ స్మార్ట్‌ఫోన్. Tizen v2.4 OS, Spreadtrum క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
5MP ప్రైమరీ కెమెరా, 0.3MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. 1GB ర్యామ్, 8GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. తేలికపాటి వినియోగానికి సరిపోతుంది. దీర్ఘకాలిక వినియోగానికి 1,500mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
శాంసంగ్ Guru మ్యూజిక్ 2 :
శాంసంగ్ గురు మ్యూజిక్ 2 అనేది బడ్జెట్ కాలింగ్, మ్యూజిక్ ఫీచర్ ఫోన్. 2-అంగుళాల TFT స్క్రీన్, 800mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది.
ఈ ఫోన్ FM రేడియోతో పాటు MP3 ప్లేబ్యాక్‌ను సపోర్ట్ చేస్తుంది. మ్యూజిక్ ప్రియులకు అనువైనది. శాంసంగ్ గురు మ్యూజిక్ ధర రూ. 1,059 సాధారణ వినియోగానికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.
శాంసంగ్ మెట్రో B313 :
శాంసంగ్ మెట్రో B313 అనేది 2-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, 0.3MP బ్యాక్ కెమెరా కలిగిన ఫీచర్ ఫోన్. ఈ శాంసంగ్ ఫోన్ 1,000mAh బ్యాటరీతో వస్తుంది.
8.2W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనపు టాక్ టైమ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 1,103 ఫోన్ కాలింగ్, టెక్స్టింగ్, ప్రాథమిక మల్టీమీడియా ఫీచర్లతో వస్తుంది.
శాంసంగ్ B310 :
శాంసంగ్ B310 అనేది 1.77-అంగుళాల స్క్రీన్‌తో సాధారణ ఫీచర్ ఫోన్. 4MB స్టోరేజీతో వస్తుంది. ప్రాథమిక కాల్, మెసేజింగ్ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ రూ. 1,049కి కొనుగోలు చేయవచ్చు. బేసిక్, నో-ఫ్రిల్స్ మొబైల్ ఫోన్ కోరుకునేవారికి బెస్ట్ ఫోన్.
శాంసంగ్ E1200 :
శాంసంగ్ E1200 చిన్న 1.5-అంగుళాల TFT స్క్రీన్, 800mAh బ్యాటరీతో వస్తుంది. స్టోరేజీ సామర్థ్యం కేవలం 100KB అయినప్పటికీ, కాలింగ్ ఫోన్ కోసం చూస్తున్న యూజర్లకు అద్భుతమైన ఆప్షన్. ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ. 1,199కు లభ్యమవుతుంది. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ స్టాక్ లేదని గమనించాలి.