Samsung Galaxy S25 FE : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం కొత్త ఫోన్.. గెలాక్సీ S25 FE వచ్చేస్తోంది.. ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే!

Samsung Galaxy S25 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ వచ్చేస్తోంది.

Samsung Galaxy S25 FE : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం కొత్త ఫోన్.. గెలాక్సీ S25 FE వచ్చేస్తోంది.. ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే!

Samsung Galaxy S25 FE

Updated On : May 16, 2025 / 5:44 PM IST

Samsung Galaxy S25 FE : శాంసంగ్ లవర్స్ కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్ అయిన తర్వాత శాంసంగ్ నెక్స్ట్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ గెలాక్సీ S25 FE ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మిడ్-ప్రీమియం ఫోన్, శాంసంగ్ గెలాక్సీ S24 FE అప్‌గ్రేడ్ వెర్షన్‌తో రానుంది.

Read Also : Tata Harrier EV : వారెవ్వా.. టాటా హారియర్ ఈవీ కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ రేంజ్.. ఫుల్ డిటెయిల్స్..!

ముఖ్యంగా కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే పరంగా భారీ అప్‌గ్రేడ్స్ ఉంటాయని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ S25 FE డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర గురించి వివరాలు రివీల్ చేయలేదు. ఇటీవలి నివేదికలను పరిశీలిస్తే.. లాంచ్ టైమ్‌లైన్, కీలక అప్‌గ్రేడ్‌లు వంటి వివరాలను ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ S25 FE లాంచ్ టైమ్‌లైన్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FEతో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. నివేదికల ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో లాంచ్ కావచ్చు. అయితే, కచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్ ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.

శాంసంగ్ గెలాక్సీ S25 FE స్పెసిఫికేషన్లు (అంచనా) :
టిప్‌స్టర్‌ల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S25 FE 120Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను పొందవచ్చు.

లేటెస్ట్ లీక్‌ల ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్ 8GB వరకు LPDDR5 256GB వరకు UFS 3.1 స్టోరేజీతో ఎక్సినోస్ 2400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందవచ్చు. 25W ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు.

ఆండ్రాయిడ్ 16-ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 8MP టెలిఫోటో లెన్స్‌ను పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు.

Read Also : PM Awas Yojana : కొత్త ఇంటి కోసం అప్లయ్ చేశారా? మీ పేరు ఉందో లేదో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ధర (అంచనా) :
భారత మార్కెట్లో రాబోయే గెలాక్సీ S25 FE ధరపై ప్రస్తుతానికి లీక్‌లు లేవు. అయితే, ఈ శాంసంగ్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 50వేలు నుంచి రూ. 55వేల మధ్య ఉండొచ్చు.