Tata Harrier EV : వారెవ్వా.. టాటా హారియర్ ఈవీ కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ రేంజ్.. ఫుల్ డిటెయిల్స్..!

Tata Harrier EV : టాటా హారియర్ ఈవీ కారు లాంచ్ కానుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 500కి.మీకు పైగా దూసుకెళ్లగలదు.

Tata Harrier EV : వారెవ్వా.. టాటా హారియర్ ఈవీ కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ రేంజ్.. ఫుల్ డిటెయిల్స్..!

Tata Harrier EV

Updated On : May 16, 2025 / 4:32 PM IST

Tata Harrier EV : కొత్త ఎలక్ట్రిక్ కారు వస్తోంది. టాటా మోటార్స్ మరోసారి ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త మోడళ్లను విస్తరించనుంది. ఈసారి హారియర్ EV కారును మార్కెట్లోకి దించనుంది.

Read Also : Post Office Schemes : పోస్టాఫీస్‌‌లో అద్భుతమైన స్కీమ్స్.. రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే.. వడ్డీ ఎంత వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్..

త్వరలో భారతీయ రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ కారు పరుగులు పెట్టనుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన విధంగా అద్భుతమైన ఫీచర్లు, ఇతర స్పెషిఫికేషన్లతో రానుంది. రాబోయే టాటా హారియర్ కారు ఏయే ఫీచర్లు, ధర, టాప్ స్పీడ్ వంటి పూర్తి వివరాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం.

టాటా హారియర్ EV లాంచ్ తేదీ :
లాంచ్ విషయానికి వస్తే.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ టాటా హారియర్ ఈవీ లాంచ్ చేయాల్సి ఉంది. కానీ, కంపెనీ ఈ కొత్త కారు కోసం మరికొంత సమయం తీసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి హారియర్ EV అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది.

టాటా హారియర్ EV డిజైన్ :
ఇప్పుడు డిజైన్ విషయానికి వస్తే.. హారియర్ EV ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రానిక్ ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. కొత్త డిజైన్‌లో ఇంటీరియర్, టెక్నాలజీ రెండింటితో సహా అనేక అప్‌డేట్స్ ఉన్నాయి.

టాటా హారియర్ EV రేంజ్ :
టాటా హారియర్ EV కారు రేంజ్ 500 కి.మీ కన్నా ఎక్కువగా ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో వందల కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. ఈ SUV డ్యూయల్-మోటార్ సెటప్‌ను పొందుతుంది. ఆల్-వీల్ డ్రైవ్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది.

టాటా హారియర్ EV పర్ఫార్మెన్స్ :
టాటా హారియర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. టాటా హారియర్ ఈవీ 500Nm వరకు టార్క్‌ను పొందుతుంది. వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 75kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇది మాత్రమే కాదు.. టాటా స్మాల్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చు. ధరలు కొంచెం తక్కువగా ఉండొచ్చు.

టాటా హారియర్ EV ఫీచర్లు :
హారియర్ EV పవర్, రేంజ్ పరంగానే కాకుండా టెక్నాలజీ పరంగా కూడా ముందుంటుంది. వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.

Read Also : Oppo Reno 14 Series : 50MP ట్రిపుల్ కెమెరాలతో ఒప్పో రెనో 14 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్లు కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

ఎక్స్‌టీరియర్ డివైజ్‌లను ఛార్జ్ చేయవచ్చు. మరో ఈవీకి కూడా పవర్ అందించొచ్చు. ఈ SUV టాటా జనరేషన్ 2 EV ప్లాట్‌ఫామ్‌పై రూపొందించాం. OMEGA ఆర్క్ ప్లాట్‌ఫామ్ అడ్వాన్స్ వెర్షన్ కలిగి ఉంది.