Top 8 SEO Ranking Tips : గూగుల్‌లో ర్యాంకింగ్ కోసం వెబ్‌సైట్ పోస్టులను ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఈ 8 SEO టిప్స్ తప్పక పాటించండి!

Top 8 SEO Ranking Tips : మీ వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ ఎలా ఆప్టిమైజ్ చేయాలో తెలుసా? గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో మీ పోస్టులను తొందరగా ర్యాంకు చేయాలంటే ఈ 8 SEO టిప్స్ తప్పక పాటించండి.

Top 8 SEO Ranking Tips : గూగుల్ సెర్చ్‌లో ఏదైనా ఒక ఆర్టికల్ ర్యాంకు చేయాలంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) అనేది ప్రాపర్‌గా చేయాలి. అందులో ప్రధానంగా (On-Page) ఆప్టిమైజేషన్ తప్పనిసరిగా చేయాలి. అప్పుడే మీ ఆర్టికల్ గూగుల్ ఫస్ట్ పేజీలో ర్యాంకు అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ అల్గారిథమ్‌కు తగినట్టుగా వెబ్‌సైట్ పోస్టులను ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఒక వెబ్‌సైట్ లేదా బ్లాగ్ పోస్టులు తొందరగా ఇండెక్స్ అయి ర్యాంకు అయ్యేందుకు అనేక కారకాలు ఉంటాయి. అందులో కొన్ని అద్భుతమైన ( SEO Ranking Tips) మీకోసం అందిస్తున్నాం.. ఆర్టికల్ పోస్టు చేసే సమయంలో ఈ ఎస్ఈఓ టిప్స్ పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. అవేంటో ఓసారి వివరంగా పరిశీలిద్దాం.

1. కీవర్డ్ రీసెర్చ్ చేయండి (Keyword Research) :
సాధారణంగా గూగుల్ యూజర్లు ఎలాంటి కీవర్డులను సెర్చ్ చేస్తుంటారు అనేది తెలుసుకోవాలి. అదే.. ప్రైమరీ కీవర్డ్‌ను కంటెంట్‌లో వాడాలి. దీనికి కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. మీ వెబ్‌సైట్ లాంగ్వేజీ ఏదైనా దానికి అనుగుణంగా ఆర్టికల్ రాసేటప్పుడు కొన్ని టార్గెటెడ్ కీవర్డ్స్ ఎంచుకోండి. ఉదాహరణకు.. మీరు ఏదైనా కీవర్డు ఎంచుకుంటే దాని ‘సెర్చ్ వాల్యూమ్‘ ఎంత ఉంది? ‘కీవర్డ్ డెన్సిటీ‘ ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలి. సెర్చ్ వాల్యూమ్ (SV) ఎక్కువగా ఉండాలి.. కీవర్డ్ డెన్సిటీ (KW) తక్కువగా ఉండేలా చూడాలి. ఇలాంటి కీవర్డ్స్ టార్గెట్ చేసి వాటిపై ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది.

Read Also : Google Feedback Feature : గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీడ్‌బ్యాక్ ఫీచర్.. భారతీయ యూజర్లు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

2. ఆర్టికల్‌లో వర్డ్ కౌంట్ ఎంత ఉండాలి? :
ఆకర్షణీయమైన బ్లాగ్ పోస్ట్‌లో వర్డ్ కౌంట్ ఎంత ఉండాలి? గూగుల్ ఎంత ఉండాలని చెబుతుంది అనేది చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. యూజర్ కావాల్సిన సమాచారం ఉండేలా తగినంత కంటెంట్ ఉండాలి. అంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే.. 300 పదాల నుంచి 500 పదాల మధ్య ఉండాలి. కనిష్టంగా 500 పదాల వరకు గరిష్టంగా 1,200 పదాలు ఉండేలా చూసుకోవాలి. గూగుల్ లాంగ్ కంటెంట్ ఆర్టికల్స్ ఎక్కువగా ఇష్టపడుతుంది.

3. పోస్ట్ టైటిల్స్‌లో కీవర్డ్‌లను ఉపయోగించండి :
ఎస్ఈఓ-ఫ్రెండ్లీ పోస్ట్ టైటిల్ పేజీలను కలిగి ఉండాలి. మీ పోస్టు ఏ టాపిక్‌పై రాస్తున్నారు అనేది తెలిపే టార్గెటెడ్ ప్రైమరీ కీవర్డ్‌ (Primary Keyword)ని కలిగి ఉండాలి. కీవర్డ్ ప్లేస్‌మెంట్, ఆకర్షణీయైన టైటిల్ ట్యాగ్స్ ఉండేలా చూడాలని గూగుల్ సూచిస్తుంది. తద్వారా సెర్చ్ చేసే యూజర్లకు అవసరమైన సమాచారం సులభంగా కనిపిస్తుంది. మీ వెబ్‌సైట్ కోసం రాసే ఆర్టికల్స్‌లో  ఎస్ఈఓ టిప్స్ తప్పక పాటించాలి.

Top 8 SEO Ranking Tips

4. సబ్ హెడ్డింగ్స్ (H2) ఉపయోగించండి :

మీ వెబ్‌సైట్ పోస్టు కంటెంట్‌లో హెచ్ ట్యాగ్ సబ్ హెడ్డింగ్స్ ఉండేలా చూసుకోవాలి. గూగుల్ బాట్స్ మీ కంటెంట్ విజిట్ చేసినప్పుడు ఈజీగా అర్థం చేసుకునేందుకు వీలుంటుంది. లాంగ్ వర్డ్స్ ఆర్టికల్ ఉన్నప్పుడు తప్పకుండా ఆర్టికల్స్ పేరాగ్రాఫ్ సబ్ హెడ్డింగ్స్ ఉండాలి. అందులో (H2 నుంచి H6) వరకు ఏదైనా ఉండవచ్చు. పేరాగ్రాఫ్ సబ్ హెడ్డింగ్స్ పేజీ కంటెంట్‌ను డివైడ్ చేయడంలో సాయపడతాయి. ఏదైనా ఒక ట్యాగ్ ఒకసారి మాత్రమే వాడాలి. ఒకటి కన్నా ఎక్కువగా వాడరాదు.. అనవసరమైన, కీవర్డ్-స్టఫ్డ్ సబ్ హెడ్డింగ్స్ ఉండకూడదని గమనించాలి.

5. ఇంటర్నల్ లింక్స్ (Internal Links) తప్పక ఉండాలి :
ప్రతి ఆర్టికల్ కంటెంట్‌లో ఇంటర్నల్ లింక్స్ ఉండేలా చూసుకోవాలి. లింక్ బిల్డింగ్ ద్వారా ఒక వెబ్ పేజీ నుంచి మరో వెబ్ పేజీకి యూజర్ వెళ్లేందుకు సాయపడుతాయి. వివిధ పేజీలు, టాపిక్స్ మధ్య ఇంటర్ లింక్ తప్పక ఉండేలా చూసుకోవాలి. మీ సైట్‌ను నావిగేట్ చేయడంలో వినియోగదారులకు సులభంగా ఉంటుంది. తద్వారా యూజర్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది. అంతేకాదు.. బౌన్స్ రేట్ (Bounce Rate) కూడా తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ లింక్‌లు మీ కంటెంట్ విలువైనదని, ర్యాంకింగ్‌ చేయాలని గూగుల్‌కి సూచిస్తాయి. మీ కంటెంట్ మధ్యలో లేదా చివరిలో ఇంటర్నల్ లింక్‌లను తప్పక కలిగి ఉండాలి.

6. ఎక్స్‌ట్రనల్ లింక్స్ తప్పనిసరి :

వెబ్‌సైట్ కంటెంట్ ఎక్కువగా వ్యాపారపరమైన ఉత్పత్తులు, సేవలకు సంబంధించి ఎక్కువగా ర్యాంకు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి కంటెంట్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ రాసినప్పుడు ఆర్టికల్ మధ్యలో ఆయా లింకులను ఉద్దేశించి ఎక్స్‌ట్రనల్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఎస్ఈఓలో ఔట్ బౌండ్ లింక్ బిల్డింగ్ కూడా చాలా ముఖ్యం. అలాగే, ఎక్స్‌ట్రనల్ లింక్ (External links) ఒకటి కూడా ఉండేలా చూసుకోండి. అది కూడా తప్పనిసరిగా (nofollow)తో ఉండాలి. లేదంటే మీ కంటెంట్ క్రెడిట్ ఇతరుల సైట్లకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Top 8 SEO Ranking Tips for Your Post rank in google

7. ఎస్ఈఓ-ఆప్టిమైజ్డ్ మీడియాను ఉపయోగించండి :
ఫొటోలు, వీడియోలు పేజీ ఎంగేజ్‌మెంట్ పెంచడంలో సాయపడతాయి. ప్రతి ఇమేజ్‌కు టార్గెటెడ్ ప్రైమరీ కీవర్డ్, ఇమేజ్ ఆల్ట్‌ కీవర్డులు సరైన పరిమాణంలో ఉండాలి. మీడియా ఆప్టిమైజ్ చేయడం ద్వారా మీ కంటెంట్ గూగుల్ పేజీలో ర్యాంక్ అయ్యేందుకు వీలుంటుంది. ముఖ్యంగా ఇమేజ్ ఆప్టిమైజ్ చేయడం తప్పనిసరి.. ఇమేజ్ క్వాలిటీతో పాటు 1200 వైడ్ రేంజ్ ఫొటోలను హై రెజల్యుషన్ ఉండేలా చూసుకోవాలి. ఆర్టికల్ పేజీలో ఇమేజ్ లోడింగ్ ఇష్యూ లేకుండా ఆప్టిమైజ్ చేసుకోవాలి.

8. పోస్ట్ మెట్రిక్స్ తరచూ చెక్ చేస్తుండాలి :
మీ వెబ్‌సైట్ పోస్ట్‌లతో యూజర్లు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? అనేది తెలుసుకోవాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉపయోగించడం వలన యూజర్లు, ఇతర ఎంగేజ్‌మెంట్ మెట్రిక్‌లతో పాటు పోస్ట్‌ను, బౌన్స్ రేట్‌ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. (Rocks Digital) వంటి SEO సర్వీసులను అందించే కంపెనీలు గూగుల్ సెర్చ్ కన్సోల్ డేటాను (Google Analytics) డేటాను (semrush, Ahref వంటి ప్రీమియం టూల్స్‌తో) విశ్లేషించి ర్యాంక్ మెరుగుపర్చడానికి అవసరమైన కీవర్డులతో పాత పోస్ట్‌లను మళ్లీ అప్టిమైజ్ చేసేందుకు ప్రయోజనకరంగా ఉంటాయి. తద్వారా మీ వెబ్‌సైట్ తొందరగా గూగుల్ పేజీలో ర్యాంక్ అయ్యేందుకు సాయపడతాయి.

Read Also : Top SEO Ranking Factors 2023 : టాప్ 15 SEO ర్యాంకింగ్ టిప్స్.. మీ కొత్త వెబ్‌సైట్‌ను గూగుల్ ఫస్ట్ పేజీలో ఇలా ర్యాంక్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు