iPhone 18 Pro Launch : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. అన్ని ఫీచర్లు లీక్..!

iPhone 18 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది. ఐఫోన్ 17 ప్రో తర్వాత అతి త్వరలో ఐఫోన్ 18 ప్రో కూడా లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఐఫోన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

iPhone 18 Pro Launch : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. అన్ని ఫీచర్లు లీక్..!

iPhone 18 Pro Launch

Updated On : November 5, 2025 / 3:26 PM IST

iPhone 18 Pro Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది. ఇటీవలే ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఐఫోన్ ప్రియులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కాస్మిక్ ఆరెంజ్ షేడ్ మోడల్ భారత్ సహా అన్ని దేశాల్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వచ్చే ఏడాది లైనప్ కోసం పుకార్లు కూడా మొదలయ్యాయి.

ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ రాబోతుందనే వార్త (iPhone 18 Pro Launch) సంచలనం సృష్టిస్తోంది. లాంచ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఆన్‌లైన్‌లో ఆపిల్ లీక్ అయిన కలర్ స్వాచ్‌ల నుంచి డిజైన్ ట్వీక్‌ల వరకు రాబోయే ఐఫోన్ 18 ప్రో గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ 18 ప్రో డిజైన్, డిస్‌ప్లే :
ముందస్తు రిపోర్టుల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఛాసిస్ కెమెరా ఐలాండ్‌తో వస్తుందని భావిస్తున్నారు. స్క్రీన్ సైజులు కూడా 6.3 అంగుళాలు, 6.9 అంగుళాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

ఇందులో ప్రోమోషన్ OLED ప్యానెల్‌లు ఉంటాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (వీబో ద్వారా) ఆపిల్ కలర్ లైనప్‌ను రిఫ్రెష్ చేయవచ్చని చెబుతోంది. లీక్‌లు కచ్చితమైనవి అయితే బ్రౌన్ (కాఫీ), పర్పుల్ బర్గుండి, వైన్ రెడ్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Read Also : Google Pixel 9 Pro XL : కొత్త ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

కెమెరా కంట్రోల్ బటన్ రూపంలో మరో మార్పు రావచ్చు. కెపాసిటివ్ ప్రెజర్ సెన్సార్లను మార్చేయొచ్చు. ఫోకస్, జూమ్ షట్టర్ వంటి అన్ని ప్రస్తుత ఫంక్షన్లను తగ్గించే అవకాశం ఉంది. పూర్తిగా ఫుల్ స్క్రీన్ ఐఫోన్ ఇంకా జనరేషన్ దూరంలో ఉన్నప్పటికీ చిన్న డైనమిక్ ఐలాండ్ గురించి పుకార్లు కూడా సూచిస్తున్నాయి.

ఐఫోన్ 18 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

ఆపిల్ ఐఫోన్ 18 ప్రో A20 ప్రో చిప్, భారీ సీపీయూ, జీపీయూ జంప్‌ల కన్నా ఆపిల్ ఏఐ ఫీచర్లతో రావొచ్చునని లీక్‌లు సూచిస్తున్నాయి. ఈ చిప్ న్యూరల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసం CoWoS ప్యాకేజింగ్ టెక్నాలజీని అందించనుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల కూడా ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. క్వాల్‌కామ్ మోడెమ్ స్థానంలో ఆపిల్ C2 మోడెమ్‌ నెట్‌వర్కింగ్ ఉండొచ్చు.

అదే నిజమైతే, వినియోగదారులు అద్భుతమైన 5G పర్ఫార్మెన్స్ పొందవచ్చు. కెమెరా ఫ్రంట్ సైడ్ ఆపిల్ కొత్త శాంసంగ్ త్రీ-లేయర్ స్టాక్డ్ సెన్సార్‌ ప్రవేశపెట్టవచ్చు. మెయిన్ 48MP కెమెరా కూడా వేరియబుల్ ఎపర్చర్‌ ఉండొచ్చు. ఫొటోగ్రాఫర్లకు క్రియేటివిటీకి మరింత అద్భుతంగా ఉంటుంది.

భారత్‌లో ఐఫోన్ 18 ప్రో లాంచ్ తేదీ, ధర (అంచనా) :
ఆపిల్ లాంచ్ రోడ్ మ్యాప్‌ కూడా మార్చనుందని పుకార్లు ఉన్నాయి. ముందస్తు నివేదికల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026 రెండో వారంలో ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు రావచ్చు. స్టాండర్డ్ ఐఫోన్ 18, ఐఫోన్ 18e 2027లో లాంచ్ కావచ్చు. భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో రూ.1,34,999 నుంచి ప్రారంభమవుతుంది.