Top SEO Ranking Factors 2023 : టాప్ 15 SEO ర్యాంకింగ్ టిప్స్.. మీ కొత్త వెబ్‌సైట్‌ను గూగుల్ ఫస్ట్ పేజీలో ఇలా ర్యాంక్ చేయొచ్చు!

Top SEO Ranking Factors In 2023 : మీ వెబ్‌సైట్ ర్యాంకు పడిపోయిందా? గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వెబ్ పేజీలు ఎలా ర్యాంకు అవుతాయి? SEO అనేది ఎలా వర్క్ అవుతుంది? 2023లో టాప్ 15 SEO ర్యాంకింగ్ కారకాలు (Top SEO Ranking Factors) గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Top SEO Ranking Factors 2023 : టాప్ 15 SEO ర్యాంకింగ్ టిప్స్.. మీ కొత్త వెబ్‌సైట్‌ను గూగుల్ ఫస్ట్ పేజీలో ఇలా ర్యాంక్ చేయొచ్చు!

Top 15 most important SEO ranking factors In 2023 Website Rankings

Top SEO Ranking Factors In 2023 : మీ వెబ్‌సైట్ ర్యాంకు పడిపోయిందా? కంటెంట్ ఎంతగా పుష్ చేసినా వెబ్ పేజీలు గూగుల్‌లో ర్యాంక్ కావడం లేదా? ఆర్గానిక్ ట్రాఫిక్ పెరగడం (How to Boost Organic Traffic) లేదా?  ఒక వెబ్‌సైట్ ర్యాంకు చేయడానికి అనేక కారకాలు ఉంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వెబ్ పేజీలు ఎలా ర్యాంకు అవుతాయి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (Search engine optimization) SEO అనేది ఎలా వర్క్ అవుతుంది? 2023లో టాప్ 15 SEO ర్యాంకింగ్ కారకాలు (Top SEO Ranking Factors) గురించి పూర్తిగా తెలుసుకుందాం.

సాధారణంగా వెబ్‌సైట్ ర్యాంకు చేయాలి అనగానే అందరికి మొదటగా గుర్తొచ్చేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO).. చాలా వెబ్‌సైట్లు ఇదే ఫాలో అవుతుంటాయి. కానీ, కొద్దిమంది మాత్రమే ఇందులో పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే.. SEO అనేది లాంగ్ ప్రాసెస్.. ఓవర్‌నైట్లో జరిగేది కాదు.. చాప కింద నీరులా స్లోగా ఉంటుంది. కానీ, సరిగా (SEO Strategies) ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.

Read Also : Google Discover Feed : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఫీచర్.. భారతీయ యూజర్ల కోసం డెస్క్‌టాప్‌లో డిస్కవర్ ఫీడ్..!

వాస్తవానికి SEO అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒకరోజుతో అయ్యేది కాదు.. కంటిన్యూగా ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ ఆపేసినా మళ్లీ మొదటికే వస్తుందని గమనించాలి. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌(SERP)లో మీ వెబ్ పేజీలు కనిపించాలన్నా, తొందరగా వెబ్‌సైట్లను ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవలన్నా కచ్చితంగా SEO బేస్ స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా ఒక వెబ్‌సైట్ హై-ర్యాంకు చేయాలంటే.. ఎస్ఈఓ నిపుణులు (SEO Experts) వెబ్‌సైట్ వివిధ అంశాలను, అందులోని కంటెంట్‌ను ఆప్టిమైజ్ చేస్తుంటారు. వెబ్ పేజీ రిలవెన్స్, కంటెంట్ క్వాలిటీని నిర్ణయించడానికి సెర్చ్ ఇంజిన్‌లు ఉపయోగించే వందలాది ర్యాంకింగ్ కారకాలను పరిగణనలోకి తీసుకుంటారు. మీ వెబ్‌సైట్ ర్యాంకింగ్‌ తొందరగా మెరుగుపడేందుకు 2023లో టాప్ 15 అత్యంత ముఖ్యమైన SEO ర్యాంకింగ్ కారకాల ( Top SEO Ranking Factors In 2023) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2023లో టాప్ 15 SEO ర్యాంకింగ్ కారకాలివే :

1. కంటెంట్ క్వాలిటీ (Content Quality – Relevance) :
మీ వెబ్‌సైట్‌లోని కంటెంట్ క్వాలిటీగా ఉండాలి. అంతేకాదు.. కంటెంట్ రిలవెన్సీ (Content Relevance)గా కూడా ఉండాలి. డూప్లికేట్ కంటెంట్ (Duplicate Content) అసలు ఉండకూడదు. ఒకసారి గూగుల్ పేజీలో ఇండెక్స్ అయిన కంటెంట్ (Used Content) మళ్లీ వాడకూడదు. ఈ విషయంలో గూగుల్ ఆల్గారిథమ్‌ను మ్యానిపులేట్ చేయలేమని గమనించాలి. మీ వెబ్ సైట్లో పోస్టు చేసిన ప్రతి కంటెంట్, మీడియా, వీడియోలు అన్నింటిపై గూగుల్ కన్నేసి ఉంటుంది. ఎలాంటి జిమ్మిక్కులు చేసినా గూగుల్ అలాంటి వెబ్‌సైట్లను గూగుల్ సెర్చ్‌లో కనిపించకుండా పెనలైజ్ (Your Webiste Penalised by Google) చేసి బ్యాన్ చేస్తుంది. ఫలితంగా వెబ్‌సైట్ ర్యాంకు కాదు.. లో-వాల్యూ కంటెంట్ (Low-Value Content)ను గూగుల్ ఎప్పుడూ ఎంకరైజ్ చేయదని గమనించాలి.

Top 15 most important SEO ranking factors In 2023 for Website Rankings

Top 15 most important SEO ranking factors In 2023

ప్రతి వెబ్‌సైట్‌కు ఒక (Niche) ఉంటుంది. అలాగే, కంటెంట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ (USP) కూడా తప్పనిసరి. అప్పుడే మీ వెబ్‌సైట్ తొందరగా ర్యాంక్ అవుతుంది. కంటెంట్ రిలవెన్సీ అనేది కూడా అత్యంత కీలకమైన SEO ర్యాంకింగ్‌లో ఒకటిగా చెప్పవచ్చు. మీ వెబ్‌సైట్లో కంటెంట్ యూజర్లకు తగినట్టుగా ఉందో లేదో చూసుకోవాలి. సాధారణంగా సెర్చ్ ఇంజిన్‌లు సెర్చ్ చేసే యూజర్ల యాక్టివిటీకి అనుగుణంగా కంటెంట్‌ను అందించే వెబ్‌సైట్‌లను ఇష్టపడతాయి. చాలా వెబ్‌సైట్లలో పేలవమైన కంటెంట్ (Stale Content) ఎక్కువగా కనిపిస్తుంటుంది. లాంగ్ టైమ్ రీడబుల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ తరహాలో కంటెంట్ ఉంటేనే మీ వెబ్‌సైట్ తొందరగా ర్యాంకు అయ్యేందుకు వీలుంటుంది. అసలు యూజర్లు ఎలా కంటెంట్ కోసం చూస్తున్నారు అనేది కూడా కచ్చితంగా తెలిసి ఉండాలి. అలాంటి కంటెంట్ ఎక్కువగా పుష్ చేయడం ద్వారా మెరుగైన ర్యాంకు పొందవచ్చు.

2. యూజర్ ఎక్స్‌పీరియన్స్ (User experience – UX) :
SEO సంబంధించి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. సెర్చ్ ఇంజిన్స్ ర్యాంక్ ఇచ్చే వెబ్‌సైట్‌లకు పాజిటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా చూసుకోవాలి. మీ వెబ్ పేజీ లోడింగ్, వెబ్ పేజీ స్పీడ్, మొబైల్ రెస్పాన్స్, మొబైల్ ఫ్రెండ్లీ నావిగేషన్, రీడబిలిటీ వంటి యూజర్ ఎక్స్‌పీరియన్స్ ప్రభావితం చేస్తాయని గమనించాలి. కంటెంట్ మాత్రమే కాదు.. వెబ్‌సైట్‌ను యూజర్లు విజిట్ చేసినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చాలా ముఖ్యం. అప్పుడే యూజర్లు ఎక్కువ సమయం ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది.

3. ఆన్-పేజీ ఆప్టిమైజేషన్ (On-page optimization) :

ప్రతి ఆర్టికల్ పేజీలో ఆన్-పేజీ ఆప్టిమైజేషన్ అనేది చాలా ముఖ్యం. వెబ్ పేజీ స్పీడ్ ర్యాంకింగ్‌ మెరుగుపరడానికి ఆర్టికల్ ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా, టైటిల్ ట్యాగ్ (Title Tag), మెటా డిస్ర్కిప్షిన్ (Meta Discrpition), హెడర్ ట్యాగ్‌లు (Header Tags), ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్స్ (Image Alt+Tags), కీవర్డ్ డెన్సిటీ (keyword density) వంటివి తప్పనిసరిగా పాటించాలి. హెడర్ ట్యాగ్స్‌లో ఆర్టికల్‌కు టైటిల్ (H1) ట్యాగ్, సబ్ హెడ్డింగ్ ట్యాగ్స్‌లో (H2, H3, H4, H5, H6) వరకు ఉండవచ్చు.

ఆర్టికల్ పేజీలో ప్రతి 200 పదాల్లో తప్పనిసరిగా 5 సంబంధిత కీవర్డులు ఉండేలా చూసుకోవాలి. యాంకర్ ట్యాగ్స్ (Anchor Tags), ఇంటర్నల్ లింక్స్ (Internal Links), ఎక్స్‌ట్రనల్ లింక్స్ (External Links) అవసరమైన చోట ఉండేలా చూసుకోవాలి. ఇంటర్నల్ లింక్స్ అనేవి ఆర్టికల్ రిలేటెడ్ లింక్స్ (Related Links) ఇచ్చుకోవచ్చు. అలాగే, ఇతర సైట్లకు సంబంధించిన ఎక్స్‌ట్రనల్ లింకులను కూడా (nofollow)తో కనీసం ఒకటైన ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఆర్టికల్ 300 పదాల కన్నా ఎక్కువగా ఉండాలి. ఆర్టికల్ పేజీలో మిడిల్ పేరాగ్రాఫ్‌లో ఇమేజ్‌లను (Image Alt + Keywords) కూడా ఉండేలా చూసుకోవాలి.

4. బ్యాక్‌లింక్‌లు (Quality Backlinks) :
ప్రతి వెబ్‌సైట్‌కు బ్యాక్ లింకులు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే గూగుల్ ర్యాంకింగ్స్ సిగ్నల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందులోనూ హై-క్వాలిటీ బ్యాక్‌లింక్‌ (high quality backlinks)లను పొందడం అనేది అత్యంత ముఖ్యమైన SEO ర్యాంకింగ్ కారకాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇతర వెబ్‌సైట్‌లు మీ కంటెంట్‌ను విశ్వసించే (Trustworthiness) వాల్యుబల్ సెర్చ్ ఇంజిన్‌లకు సూచిస్తాయి. బ్యాక్‌లింక్‌ల క్వాలిటీ కూడా వెబ్ సైట్ కంటెంట్ కు రిలవెన్స్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఏది పడితే అది బ్యాక్ లింకులుగా ఇస్తే గూగుల్ పెనాలైజ్ చేసే రిస్క్ ఉందని మరవద్దు. పేలవమైన బ్యాక్ లింకులు (Poor Backlinks)తో వెబ్‌సైట్ ర్యాంకు పడిపోతుంది. కొంతమంది వెబ్ సైట్ ర్యాంక్ కోసం పెయిడ్ బ్యాక్ (Paid Backlinks) లింకులను వాడుతుంటారు. గూగుల్ ఇలాంటి బ్లాక్ హ్యాట్ SEO యాక్టివిటీని ఎప్పటికీ ఎంకరైజ్ చేయదు.

Top 15 most important SEO ranking factors In 2023 Website Rankings

SEO ranking factors

5. మొబైల్ ఫ్రెండ్లీ (Mobile-friendliness) :
ప్రస్తుతం మెజారీటీ ఇంటర్నెట్ యూజర్లు మొబైల్ (Mobile Users) ద్వారానే వెబ్‌సైట్లను యాక్సస్ చేస్తున్నారు. అందుకే ప్రతి వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా ఫుల్ రెస్పాన్స్‌వ్‌ (Fully Responsive)గా ఉండేలా చూసుకోవాలి. మొబైల్-ఫ్రెండ్లీ వెబ్‌సైట్లను గూగుల్ రికమండ్ చేస్తుంది. మొబైల్ డివైజ్ కోసం మీ వెబ్‌సైట్లను ఆప్టిమైజ్ చేసుకోవాలి. లేదంటే.. ఆయా (Non-Mobile Friendly) వెబ్‌సైట్‌లు సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలలో హై-ర్యాంక్ పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వెబ్‌సైట్ మొబైల్ యూజర్లు ఈజీగా నావిగేట్ చేసేలా ప్రతి మొబైల్ డివైజ్‌కు తగినట్టుగా డిజైన్ లేఔట్ (Layout) ఫిట్ అయ్యేలా చూసుకోవాలి.

6. పేజీ లోడ్ స్పీడ్ (Page Load Speed) :
మీ వెబ్‌సైట్ ఎంత స్పీడ్‌గా లోడ్ అవుతుందో చెక్ చేశారా? వేగంగా లోడ్ అయ్యే వెబ్ పేజీలు మాత్రమే గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజిల్ట్స్‌లో హై ర్యాంక్‌ను పొందే అవకాశాలు మెరుగవుతాయి. సెర్చ్ ఇంజిన్‌లు త్వరగా లోడ్ అయ్యే, సున్నితమైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించే వెబ్‌సైట్‌లను బాగా ఇష్టపడతాయి. కంటెంట్ బాగున్నప్పటికీ వెబ్ సైట్ స్పీడ్ లోడింగ్ ఇష్యూ (Check Your Website Speed Test) ఉంటే కూడా ర్యాంకు కాదని గమనించాలి. 4G, 3G కన్నా 2G నెట్‌వర్క్ ఉన్న యూజర్లకు కూడా మొబైల్‌లో వెబ్ పేజీ ఈజీగా లోడ్ అయ్యేలో ఉండాలి. ఎవరైనా విజిటర్ మీ వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు లోడింగ్ ఇష్యూ ఉంటే చూసేందుకు ఇష్టపడరు. పేజీ ర్యాంకు కూడా భారీగా పడిపోతుంది. ప్రతి వెబ్ సైట్ కు పేజీ ర్యాంకు (Page Rank)కు చాలా కీలకమని గమనించాలి.

Top 15 most important SEO ranking factors In 2023 Website Rankings

Top SEO ranking factors 2023

7. సోషల్ ట్రాఫిక్ సిగ్నల్స్ (Social Signals) :
ప్రస్తుత రోజుల్లో ప్రతి వెబ్‌సైట్ ట్రాఫిక్ పెంచుకోవడానికి ప్రధానంగా సోషల్ మీడియా ఒకటి. సోషల్ సిగ్నల్స్ ద్వారా వెబ్‌సైట్ ర్యాంకింగ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ కంటెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చేసే షేర్‌లు, లైక్స్, కామెంట్ల ఎంగేజ్ మెంట్ ఆధారంగా సోషల్ సిగ్నల్స్ సూచిస్తాయి. ఈ సిగ్నల్స్ మీ కంటెంట్ విలువైనది, రిలేటెడ్ కంటెంట్‌కు సంబంధించిందని గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లకు సూచిస్తాయి. తద్వారా గూగుల్ మీ కంటెంట్‌ను సోషల్ సిగ్నల్స్ ఆధారంగా సెర్చ్ రిజల్ట్స్‌లో ర్యాంకు అయ్యేలా చేస్తుంది. మీ కంటెంట్‌ను సాధ్యమైనంత ఎక్కువగా సోషల్ ప్లాట్‌ఫారాల్లో పోస్టు చేయడం ద్వారా ఈజీగా ట్రాఫిక్ పెంచుకోవచ్చు. దాంతో వెబ్ పేజీలు తొందరగా ర్యాంక్ అయ్యేందుకు వీలుంటుంది.

8. డొమైన్ ఏజ్ అథారిటీ (Domain age And Authority) :
మీ వెబ్‌సైట్ డొమైన్ క్రియేట్ చేసి ఎంతకాలం అయింది? ఎన్నాళ్లుగా సైట్ రన్ చేస్తున్నారు అనేది కూడా ర్యాంకింగ్ కారకాలుగా చెప్పవచ్చు. అందులో మీ డొమైన్ ఏజ్ మాత్రమే కాదు.. డొమైన్ అథారిటీ (Domain Authority) కూడా చాలా కీలకం. సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలలో ఇండెక్స్ అయిన అధికారిక వెబ్‌సైట్‌లు హై ర్యాంక్‌ని పొందే అవకాశం ఉంది. ఏదైనా డొమైన్ ఏజ్ కనీసం 6 నెలలు లేదా ఆపై ఉండాలి. అలాగే, డొమైన్ అథారిటీ అనేది 0 నుంచి 100 మధ్య ఉంటుంది. సాధారణంగా డొమైన్ అథారిటీ 50కిపైగా ఉంటే బెటర్ అని చెప్పవచ్చు. మీ డొమైన్ ఆథారిటీ (How to Check Domain Authority) ఎంతో ఉందో చెక్ చేసుకోండి.

9. సెక్యూరిటీ (HTTPS) :
మీ వెబ్‌సైట్‌కు (SSL) సర్టిఫికేట్ ఉందా? SSL అంటే.. (Secure Sockets Layer).. సాధారణంగా HTTP లేదా HTTPS ఎన్‌క్రిప్షన్‌తో సేఫ్ వెబ్‌సైట్‌ను సూచిస్తుంది. ఇది SEOకి చాలా ముఖ్యమైనది. సెర్చ్ ఇంజిన్‌లు సేఫ్ వెబ్‌సైట్‌లను మాత్రమే ఇష్టపడతాయి. సురక్షితమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఏదైనా వెబ్‌సైట్ విజిట్ చేసినప్పుడు అది సేఫ్ అని యూజర్లకు సూచిస్తుంది. ఇలా (http[s]) ఉన్న వెబ్‌సైట్లలో కంటెంట్ సురక్షితమని యూజర్లకు ఇండికేషన్ సూచిస్తుంది. ప్రతి వెబ్‌సైట్‌కు SSL తప్పనిసరిగా ఉండాలి. ఇది బ్రౌజర్ వెబ్ అడ్రస్ బార్‌లో Lock సింబల్‌తో గ్రీన్ లేదా గ్రే కలర్ కనిపిస్తుంది. అంటే.. ఆ వెబ్‌సైట్ సేఫ్ అని అర్థం. మీ వెబ్‌సైట్ SSL సర్టిఫికేట్ (How to Check SSL on Website) కలిగి ఉందో లేదో చెక్ చేసుకోండి.

10. డొమైన్ రిలవెన్స్ (Domain Relevancy) :
మీ కంటెంట్ రిలవెన్సీకి మీ డొమైన్ రిలవెన్సీ ఉండేలా చూసుకోవాలి. సెర్చ్ ఇంజిన్‌లు ర్యాంక్ చేస్తున్న కీవర్డ్స్ (Keywords) అంశాలకు సంబంధించిన వెబ్‌సైట్‌లను ఇష్టపడతాయి. మీ వెబ్ పేజీలలోని కంటెంట్ డొమైన్‌కు తగినట్టుగా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. కంటెంట్ రిలేటెడ్ డొమైన్లకు హై ర్యాంకింగ్ ఉండే అవకాశాలు ఎక్కువని చెప్పవచ్చు.

Top 15 most important SEO ranking factors In 2023 Website Rankings

SEO ranking factors on Google Search

11. Click-through rate (CTR) :
సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలలో మీ వెబ్‌సైట్ కనిపించినప్పుడు దానిపై క్లిక్ చేసే యూజర్ల శాతాన్ని క్లిక్-త్రూ రేట్ (CTR) సూచిస్తుంది. మీ కంటెంట్ వినియోగదారులకు అవసరమైనది. ఇన్ఫర్మేటివ్ అని సెర్చ్ ఇంజిన్‌లకు హై (High CTR)సిటీఆర్ సూచిస్తుంది. ఇండెక్స్ పేజీలలో ఎక్కువ శాతం CTR కలిగిన వెబ్ పేజీలకు మాత్రమే ఎక్కువగా ర్యాంక్ అయ్యేందుకు వీలుంటుంది.

12. కంటెంట్ ఫ్రెష్‌నెస్ – అప్‌డేట్ ఫ్రీక్వెన్సీ (Content freshness update frequency) :
సెర్చ్ ఇంజిన్‌లు లేటెస్ట్, రిలేటెడ్, లేటెస్ట్ కంటెంట్‌తో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తుండే వెబ్‌సైట్‌లను ఇష్టపడతాయి. తరచుగా అప్‌డేట్ అయ్యే వెబ్‌సైట్‌లు సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలలో హై ర్యాంక్ పొందే అవకాశం ఉంది. ఔట్ డేటెడ్ కంటెంట్‌ను గూగుల్ పరిగణనలోకి తీసుకోదని గమనించాలి. అలాంటి కంటెంట్ గుర్తించి అప్‌డేట్ చేస్తుండాలి. అప్పుడే గూగుల్ బాట్స్ మీ కంటెంట్ గుర్తించి ఫస్ట్ పేజీలో హై ర్యాంక్ పొందేలా సూచిస్తాయి. గతంలో పోస్టు చేసిన కంటెంట్‌కు కొత్తగా కొన్ని విషయాలతో అప్‌డేట్ చేసుకోవచ్చు.

13. స్ట్రక్చర్డ్ డేటా (Structured data) :
ప్రతి వెబ్‌సైట్‌కు స్ట్రక్చర్డ్ డేటా అనేది చాలా కీలకం.. సెర్చ్ ఇంజిన్‌లకు మీ కంటెంట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. స్ట్రక్చర్డ్ డేటాను ఉపయోగించే వెబ్‌సైట్‌లు సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజీలలో హై ర్యాంక్‌ను పొందే అవకాశం ఉంది. Structured Data ఒక వెబ్ పేజీ గురించి ఏంటి? కంటెంట్ విషయాన్ని తెలియజేస్తుంది. కంటెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్‌లు ఈజీగా అర్థం చేసుకోనేలా తెలియజేస్తుంది. మీ వెబ్‌సైట్లో స్ట్రక్చర్డ్ డేటా (How to Test website structured data) ఎలా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

14. లోకల్ (Local SEO) :
లోకల్ SEO అనేది ఫిజికల్ లొకేషన్ లేదా నిర్దిష్ట ప్రాంతంలో సర్వీసులను అందించే వ్యాపారాలకు కీలకమని చెప్పవచ్చు. లోకల్ SEO అనేది కూడా (Google My Business) ఆప్టిమైజేషన్, లోకల్ కీవర్డ్ టార్గెట్, లోకల్ బ్యాక్‌లింక్‌లు (Local Backlinks) వంటివి ఉన్నాయి. మీ లొకేషన్ ఆధారిత ర్యాంకింగ్ పెంచుకోవాలంటే లోకల్ SEO తప్పనిసరిగా చేయాలి. తద్వారా గూగుల్ ఫస్ట్ పేజీలో మీ వెబ్‌సైట్ టాప్ ర్యాంకులోకి రావచ్చు. సాధారణంగా గూగుల్ మ్యాప్స్  (Google Maps)ద్వారా లోకల్ లొకేషన్ ఆధారిత SEO (LSI Keywords) ర్యాంకింగ్స్ కోసం ఉపయోగించవచ్చు.

15. మల్టీ లాంగ్వేజీ కంటెంట్ (Multilingual Content) :
మీ వెబ్‌సైట్ టార్గెట్ ఆడియోన్స్ వరల్డ్ వైడ్ ఉంటే.. మీ వెబ్‌సైట్ ఒక భాషకు మాత్రమే పరిమితం కాకూడదు. మల్టీలాంగ్వేజీ కంటెంట్ ద్వారా ఎక్కువ ట్రాఫిక్ రావడంతో పాటు హై ర్యాంకింగ్ వేగంగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. మల్టీలాంగ్వేజీ కంటెంట్‌ను అందించడం చాలా కీలకం. సెర్చ్ ఇంజన్లు గ్లోబల్ ఆడియోన్స్ అవసరాలను తీర్చడానికి మల్టీ భాషల్లో కంటెంట్‌ను అందించే వెబ్‌సైట్‌లను ఎక్కువగా ఇష్టపడతాయి. చాలా వెబ్‌సైట్లలో ఎక్కువగా సక్సెస్ రేటు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు.

Read Also : Google Feedback Feature : గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీడ్‌బ్యాక్ ఫీచర్.. భారతీయ యూజర్లు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?