Jio Vs Vi Vs Airtel : పండగ చేస్కోండి.. రోజుకు 2GB డేటాతో జియో, ఎయిర్‌టెల్, Vi బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు.. ఏ ప్లాన్ తీసుకుంటే బెటర్..?
Jio Vs Vi Vs Airtel : రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ యూజర్ల కోసం రోజుకు 2జీబీ డేటాతో బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ఏ ప్లాన్ కావాలో ఎంచుకోండి.
Jio Vs Vi Vs Airtel
Jio Vs Vi Vs Airtel : మీరు వాడే నెట్‌వర్క్ ఏంటి? జియో లేదా వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్.. ఈ మూడింటిలో ఏది వాడుతున్నారు? మీ నెట్‌వర్క్ ఏదైనా సరే.. ప్రస్తుతం మొబైల్ యూజర్ల కోసం మార్కెట్లో అనేక రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దేశీయ టెలికాం దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి.
జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సహా (Jio Vs Vi Vs Airtel) కస్టమర్లను ఆకర్షించేందుకు మరిన్ని రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. కనీస ఛార్జీలతో అద్భుతమైన బెనిఫిట్స్ కోసం అందిస్తున్నాయి. మీరు కూడా బెస్ట్ 2GB రోజువారీ డేటా ప్లాన్‌ల కోసం చూసే వ్యక్తి అయితే ఇది మీకోసమే.. టెలికాం దిగ్గజాలు అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బెస్ట్ 2GB రోజువారీ డేటా ప్లాన్లు :
జియోతో మొదలై 90 రోజుల వ్యాలిడిటీని అందించే రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. దాంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB 4G డేటా, ట్రూ 5జీ కనెక్టివిటీతో పాటు జియోహాట్‌స్టార్ (JioHotStar) 3 నెలల సబ్‌స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ లేదా రోజుకు కనీసం 2GB రోజువారీ డేటాను అందించే ఏదైనా ప్లాన్‌తో మొత్తం 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ విషయానికి వస్తే.. రూ. 979 ప్లాన్ 2GB రోజువారీ డేటాతో పాటు 84 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటా యాక్సెస్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ప్లాన్ పెర్ప్లెక్సిటీ ప్రో వార్షిక సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది.
వోడాఫోన్ ఐడియా విషయానికొస్తే.. రూ.996 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 2GB డేటాను అందిస్తుంది. ఇతర బెనిఫిట్స్ కోసం రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ మొదలైనవి ఉన్నాయి. రూ.799తో అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సభ్యత్వాన్ని ఫ్రీగా పొందవచ్చు. అన్నింటికన్నా జియో ప్లాన్ అత్యధిక బెనిఫిట్స్ కలిగి ఉంది. ఖర్చుతో కూడుకున్నది కూడా. మీరు పోర్ట్ చేయాలనుకుంటే జియో మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
