Google Feedback Feature : గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీడ్‌బ్యాక్ ఫీచర్.. భారతీయ యూజర్లు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

Google Feedback Feature : గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. భారతీయ యూజర్లు ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజీ నేర్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్లు రాబోయే కొద్ది రోజుల్లో సపోర్టు ఉన్న దేశాలలో అందుబాటులోకి వస్తాయి.

Google Feedback Feature : గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీడ్‌బ్యాక్ ఫీచర్.. భారతీయ యూజర్లు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

learn English with new ‘personalized feedback’ feature

Google Feedback Feature : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) నుంచి సరికొత్త ఫీచర్ వస్తోంది. ఇంగ్లీష్ ల్వాంగేజీ నేర్చుకోవడానికి వీలుగా ‘పర్సనలైజడ్ ఫీడ్‌బ్యాక్’  (Google personalized Feedback Feature) అనే ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ ప్రవేశపెడుతోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో గూగుల్ యూజర్లు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

ఇప్పుడు భారత్, ఇండోనేషియా, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో లేదా వెనిజులాలోని యూజర్లకు ‘పర్సనలైజడ్ ఫీడ్‌బ్యాక్’ ఫీచర్‌తో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సాయపడుతుంది. ఈ కొత్త ఫీచర్.. ఒక భాష నేర్చుకోనే వ్యక్తి జీవితంలో కొత్త అవకాశాలను అందిస్తుందని, విభిన్న సంస్కృతులకు చెందిన వారితో కనెక్ట్ అయ్యేందుకు సాయపడుతుందని బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది.

Read Also : Apple iPhone 12 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

అంతేకాదు.. ప్రపంచాన్ని పర్యటించడానికి, వారి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సాయపడుతుందని తెలిపింది. అయినప్పటికీ, కొత్త భాషలో నైపుణ్యం సాధించడం కష్టమే.. చాలా మంది అభ్యాసకులు నేర్చుకుని అనర్గళంగా భాష మాట్లాడటమనేది కొంచెం అవరోధంగా చెప్పవచ్చు. భాషావేత్తలు, ఉపాధ్యాయులు, ESL/EFL టీచింగ్ నిపుణులతో భాగస్వామ్యం కలిగి ప్రభావవంతమైన లెర్నింగ్ ఎక్స‌ర్‌సైజులను అభ్యాసకులు ప్రామాణికమైన సందర్భాలలో నేర్చుకోవచ్చు. మెటీరియల్ డైనమిక్ వ్యవధిలో అప్‌డేట్ అవుతుంది. అభ్యాసకులు అనర్గళంగా భాష మాట్లాడటంలో సాయపడుతుంది.

Google Search will help users

Google Search will help users

కొత్త ‘పర్సనలైజడ్ ఫీడ్‌బ్యాక్ ఫీచర్’ ఎలా పని చేస్తుందంటే? :
ఈ ఫీడ్‌బ్యాక్ ఫీచర్ యూజర్లకు వారి మాట్లాడే నైపుణ్యాలపై సెమాంటిక్ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది. ప్రశ్నకు వారి సమాధానాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉందా లేదా అనే ఆలోచనను అందిస్తుంది. ఇందుకోసం, గూగుల్ ఫీడ్‌బ్యాక్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారుల 3-5 నిమిషాల ప్రాక్టీస్ సెషన్‌ల ఆధారంగా వినియోగదారులకు పర్సనలైజడ్ ఫీడ్‌బ్యాక్ అందిస్తుంది. రోజువారీ రిమైండర్‌ల కోసం కూడా ఒక ఆప్షన్‌తో వస్తుంది.

ఆంగ్ల అభ్యాస ప్రక్రియను మెరుగుపరచడానికి గూగుల్ ఒక టెక్స్ట్ కోసం సందర్భోచిత అనువాదాన్ని పొందడానికి యూజర్లను కూడా అనుమతిస్తుంది. ట్రైనింగ్ సమయంలో వినియోగదారులు నిర్దిష్ట పదాన్ని ట్యాప్ చేసి.. సందర్భం ఆధారంగా పదాల అర్థాన్ని అర్థం చేసుకోవచ్చు.

గూగుల్ కొత్త ఇంగ్లీష్ లెర్నింగ్ ఫీచర్‌లు (Google Translate) బృందంతో కలిసి అభివృద్ధి చేసిన (Deep Aligner) అనే కొత్త డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా అందిస్తాయి. ఈ కొత్త ఫీచర్లు రాబోయే కొద్ది రోజుల్లో సపోర్టు ఉన్న దేశాల్లోని యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. ఇతర దేశాలకు త్వరలో మరిన్ని భాషలు సపోర్టు చేస్తాయని సెర్చ్ దిగ్గజం హామీ ఇచ్చింది.

Read Also : WhatsApp Hide Lock Chats : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. మీ లాక్ చాట్స్ ఈజీగా హైడ్ చేసుకోవచ్చు తెలుసా?