Truecaller : గూగుల్ కొత్త రూల్.. కాల్ రికార్డింగ్ ఫీచర్ తొలగించిన ట్రూకాలర్ యాప్..!

Truecaller : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కొత్త రూల్స్ తీసుకొస్తోంది. మే 11 నుంచి గూగుల్ సర్వీసుల్లో ఒకటైన ప్లే స్టోర్ (Play Store)లో కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటిని బ్యాన్ చేయనుంది.

Truecaller : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కొత్త రూల్స్ తీసుకొస్తోంది. మే 11 నుంచి గూగుల్ సర్వీసుల్లో ఒకటైన ప్లే స్టోర్ (Play Store)లో కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటిని బ్యాన్ చేయనుంది. ఇప్పటివరకూ కాల్ రికార్డింగ్ ఫీచర్లను అందిస్తున్న అన్ని యాప్స్ అలర్ట్ అయ్యాయి. తమ యాప్‌లో ఆటోకాల్ రికార్డింగ్ ఫీచర్లను డిలీట్ చేస్తున్నాయి. కాల్ రికార్డింగ్ యాప్‌లను నిషేధిస్తున్నట్లు గూగుల్ వెల్లడించిన వెంటనే.. ప్రముఖ ట్రూకాలర్ యాప్ తన ప్లాట్‌ఫారమ్ నుంచి కాల్ రికార్డింగ్ (Call Recording) ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

మే 11 నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో అన్ని యాప్‌లను తొలగిస్తున్నట్టు గూగుల్ గురువారం ప్రకటించింది. దీనిపై Truecaller ప్రతినిధి మాట్లాడుతూ.. Google డెవలపర్ ప్రోగ్రామ్ విధానాలను అప్ డేట్ చేసిందని, గూగుల్ కొత్త రూల్ ప్రకారమే.. తమ యాప్‌లోనూ ఇకపై కాల్ రికార్డింగ్‌లను అందించలేమని తెలిపింది. ఇప్పటికే మీ ఫోన్ డివైజ్‌లో స్థానికంగా ఉన్న కాల్ రికార్డింగ్‌ ఆప్షన్‌పై ఎలాంటి ప్రభావితం చేయదు. ట్రూకాలర్‌లో యూజర్ల డిమాండ్ ఆధారంగా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం కాల్ రికార్డింగ్‌ను తీసుకొచ్చింది. ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్ అందరికీ ఉచితంగా అందిస్తోంది. Google యాక్సెసిబిలిటీ APIని ఉపయోగించి ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం జరిగిందని ట్రూకలర్ ప్రతినిధి తెలిపారు.

Truecaller Removes Call Recording Feature Following New Google Rule 

Google చాలా ఏళ్లుగా కాల్ రికార్డింగ్ యాప్ సర్వీసులను వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే.. కాల్ రికార్డింగ్ అనేది యూజర్ల ప్రైవసీని ఉల్లంఘించడమే అని కంపెనీ విశ్వసిస్తోంది. Google సొంత డయలర్ యాప్‌లోని కాల్ రికార్డింగ్ ఫీచర్ ఎనేబుల్ అయిన విషయం ముందే తెలుస్తుంది. ఈ కాల్ ఇప్పుడు రికార్డ్ అవుతుందంటూ వార్నింగ్ వస్తుంది. కాల్ రికార్డింగ్ ప్రారంభమయ్యే ముందు రెండు వైపులా వినబడుతుంది. రీకాల్ చేయడానికి Google Android6లో రియల్ టైం కాల్ రికార్డింగ్‌ని బ్లాక్ చేసింది. Android 10 డివైజ్‌ల్లో మైక్రోఫోన్‌లో కాల్ ఆడియో రికార్డింగ్‌ను తొలగించింది.

కొన్ని కాల్ రికార్డింగ్ యాప్‌లు ఆండ్రాయిడ్ 10 అంతకంటే ఎక్కువ వెర్షన్‌ డివైజ్‌లలో కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీని అందించే యాక్సెసిబిలిటీ సర్వీస్‌ను యాక్సెస్ చేసే వీలుంది. ఈ నేపథ్యంలోనే యాక్సెసిబిలిటీ API రూపొందించలేదంటూ రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ కు అనుమతి లేదని అప్‌డేట్ Play స్టోర్ పాలసీ సూచిస్తోంది. ఈ కొత్త రూల్ కేవలం థర్డ్-పార్టీ యాప్‌లపై మాత్రమే ప్రభావం చూపుతుందని గూగుల్ స్పష్టం చేసింది. మీ డివైజ్ Google డయలర్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటే అది పని చేస్తుంది. కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో ఏదైనా ప్రీలోడెడ్ డయలర్ యాప్‌లు ఉన్నా అవి కూడా పనిచేస్తాయని తెలిపింది. Google Play స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఇతర థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ మాత్రమే తొలగించినట్టు గూగుల్ తెలిపింది. కాల్‌లను రికార్డ్ చేసేందుకు యూజర్లను అనుమతించే ఏదైనా యాప్ సర్వీసులను మే 11న Play Storeలో బ్లాక్ చేయనుంది గూగుల్.

Read Also : Google Play Store : గూగుల్ అలర్ట్.. మే 11 నుంచి మీ ఫోన్లలో ఆ యాప్స్ పనిచేయవు..!

ట్రెండింగ్ వార్తలు