Google Play Store : గూగుల్ అలర్ట్.. మే 11 నుంచి మీ ఫోన్లలో ఆ యాప్స్ పనిచేయవు..!

Google Play Store : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ యాప్సఫ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం బ్యాన్ చేయనుంది.

Google Play Store : గూగుల్ అలర్ట్.. మే 11 నుంచి మీ ఫోన్లలో ఆ యాప్స్ పనిచేయవు..!

Google Play Store Google Banning All Call Recording Apps From Play Store Starting May 11

Google Play Store : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ యాప్స్‌ను సెర్చ్ ఇంజిన్ దిగ్గజం బ్యాన్ చేయనుంది. మే 11 నుంచి గూగుల్ ప్లే స్టోర్ (Google Paly Store) నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటిపై నిషేధం విధించనుంది. ఈ బ్యాన్ మే 11 నుంచి అమల్లోకి రానుంది. ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఆయా కాల్ రికార్డింగ్ ఫీచర్‌ అప్లికేషన్‌లను నిరోధించడానికి Google కఠినమైన చర్యలు చేపట్టింది. ఇకపై ప్లే స్టోర్‌లో రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్‌ వంటి యాప్స్ యాక్సస్ చేసుకోలేరు. ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లతో సహా Google డెవలపర్ విధానాలను అప్‌డేట్ చేసింది.

ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం Google కొత్త Play Store విధానాలలో మార్పులు చేస్తోంది. ప్లే స్టోర్ విధానాల్లో మార్పులు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో రిమోట్‌గా కాల్‌లను రికార్డ్ చేయడానికి ఏ యాప్‌ను గూగుల్ అనుమతించదని Reddit యూజర్ ఒకరు తెలిపారు. ఆండ్రాయిడ్‌లో కాల్ రికార్డింగ్‌ను నిలిపివేయాలని గూగుల్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది.

Google Play Store Google Banning All Call Recording Apps From Play Store Starting May 11 (1)

Google Play Store Google Banning All Call Recording Apps From Play Store Starting May 11

ఆండ్రాయిడ్ 6లో రియల్ టైం కాల్ రికార్డింగ్‌ను బ్లాక్ చేసింది. అలాగే ఆండ్రాయిడ్ 10తో మైక్రోఫోన్ ద్వారా గూగుల్ ఇన్-కాల్ ఆడియో రికార్డింగ్‌ను డిలీట్ చేసింది. కొన్ని యాప్‌ల్లో ఆండ్రాయిడ్ 10, అంతకంటే ఆపై వెర్షన్‌ డివైజ్‌లలో కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ యాక్సెసిబిలిటీ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకునే వీలుంది.

అమెరికాలో ఎవరిదైనా కాల్ రికార్డింగ్ చేయాలంటే వారి సమ్మతితో మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో అలాంటి చట్టం లేదు. కానీ, దీనిపై చాలావరకు ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే Truecaller వంటి యాప్‌లు ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 10తో Google విధించిన పరిమితులను అధిగమించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. కొత్త కాల్ రికార్డింగ్ పరిమితులు లేటెస్ట్ Android 12-పవర్డ్ ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తాయా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఒకవేళ Android 10, Android 11 డివైజ్‌ల్లో కూడా ఈ పరిమితులు వర్తిస్తాయా లేదో చూడాలి.

Read Also : SBI Customers Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఈ ఫోన్‌ నెంబర్స్‌తో జాగ్రత్త