SBI Customers Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఈ ఫోన్‌ నెంబర్స్‌తో జాగ్రత్త

మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే జాగ్రత్త.. ఈ ఫోన్ నెంబర్స్ తో కేర్ ఫుల్ గా ఉండాల్సిందే అని ఎస్బీఐ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.(SBI Customers Alert)

SBI Customers Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఈ ఫోన్‌ నెంబర్స్‌తో జాగ్రత్త

Sbi Customers Alert

SBI Customers Alert : మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే జాగ్రత్త.. ఈ ఫోన్ నెంబర్స్ తో కేర్ ఫుల్ గా ఉండాల్సిందే అని ఎస్బీఐ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులకు ఎస్బీఐ సూచించింది. ఎస్బీఐ కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడే పలు ఫోన్‌ నంబర్లను ట్విటర్‌లో తెలిపింది.

కేవైసీ అప్‌డేట్‌ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్‌, మెసేజ్స్‌ వస్తున్నాయని ఎస్బీఐ గుర్తించింది. ఈ ఫోన్‌ నెంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్ లు, లింకుల పట్ల జాగ్రత్త వహించాలని ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు స్పందించవద్దంది. లింక్స్ ను క్లిక్ చేయకూడదంది. అలాగే ఈ నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లను కూడా ఓపెన్‌ చేయకూడదని విన్నవించింది.(SBI Customers Alert)

Alert For SBI Customers : SBI కస్టమర్లకు హెచ్చరిక : అకౌంట్లో డబ్బులు పోతే.. బ్యాంకుకు సంబంధం లేదు!

ఈ నెంబర్ల ద్వారా కేటుగాళ్లు కస్టమర్ల అకౌంట్ల నుంచి డబ్బు కొట్టేస్తారని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొంది. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా కస్టమర్ల డబ్బులను కేటుగాళ్లు కొట్టేస్తున్న విషయాన్ని అసోం సీఐడీ అధికారులు గుర్తించా ట్విట్టర్ లో అలర్ట్ చేయగా, ఎస్బీఐ రీట్వీట్ చేసింది. అంతేకాకుండా ఖాతాదారులు తమ అకౌంట్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుకు సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవద్దని, గోప్యంగా ఉంచాలని తెలియజేసింది.(SBI Customers Alert)

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని త‌న ఖాతాదారుల‌ను ఎప్పటికప్పుడు హెచ్చ‌రిస్తూనే ఉంటుంది. తాజాగా నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది.(SBI Customers Alert)

Warning For SBI Cusotmers : ఈ విషయంలో జర జాగ్రత్త : SBI ఖాతాదారులా? మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత?

కొందరు మోస‌గాళ్లు ఎస్‌బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లతో కేటుగాళ్లు ఆయా ఖాతాదారుల అకౌంట్‌ నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారని హెచ్చరించింది.