ఈ విషయంలో జర జాగ్రత్త : SBI ఖాతాదారులా? మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? 

మీరు ఎస్బీఐ ఖాతాదారులా? ప్రత్యేకించి సేవింగ్స్ ఖాతాదారులు ఈ విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి. మీ అకౌంట్లలో బ్యాలెన్స్ ఉందా? ఎంత మొత్తంలో ఉంచుతున్నారు. ఓసారి చెక్ చేసుకోండి.

  • Published By: sreehari ,Published On : November 18, 2019 / 06:58 AM IST
ఈ విషయంలో జర జాగ్రత్త : SBI ఖాతాదారులా? మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? 

మీరు ఎస్బీఐ ఖాతాదారులా? ప్రత్యేకించి సేవింగ్స్ ఖాతాదారులు ఈ విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి. మీ అకౌంట్లలో బ్యాలెన్స్ ఉందా? ఎంత మొత్తంలో ఉంచుతున్నారు. ఓసారి చెక్ చేసుకోండి.

మీరు ఎస్బీఐ ఖాతాదారులా? ప్రత్యేకించి సేవింగ్స్ ఖాతాదారులు ఈ విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి. మీ అకౌంట్లలో బ్యాలెన్స్ ఉందా? ఎంత మొత్తంలో ఉంచుతున్నారు. ఓసారి చెక్ చేసుకోండి. లేదంటే భారీ పెనాల్టీలు చెల్లించక తప్పుదు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నవంబర్ 1, 2019 నుంచే బ్యాలెన్స్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. 

ఎస్బీఐ.. సేవింగ్స్ అకౌంట్లు మాత్రమే కాకుండా.. ఫిక్స్ డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD) అకౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఇటీవలే ఎస్బీఐ బ్యాంకు కనీస నగదు నిల్వలపై రూల్స్ మార్చేసింది. తమ బ్యాంకు అకౌంట్లలో తగినంత మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోతే కస్టమర్లపై భారీ పెనాల్టీలు విధిస్తోంది. 

సేవింగ్స్ అకౌంట్లలో రూ.లక్ష కంటే తక్కువ మొత్తాన్ని నిల్వ చేసే కస్టమర్ల డిపాజిట్లపై 3.25 శాతానికి వడ్డీ రేట్లను తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లలో నెలవారీ కనీస నగదు నిల్వలు (AMB)లను నాలుగు బ్రాంచులుగా విభజించింది.

ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఎస్బీఐ అకౌంట్ హోల్డర్.. ఇప్పుడు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB)  నిబంధనల్లో భాగంగా రూ.వెయ్యి నుంచి రూ.3వేలుగా ఫిక్స్ చేసింది. ఈ రూల్.. ఒక్కో సిటీలోని ఎస్బీఐ అకౌంటు కనీస నగదు నిల్వపై ఒక్కోలా ఉంటుంది. మెట్రో లేదా సెమీ అర్బన్ బ్రాంచుల్లో అకౌంట్లు ఉంటే ఆయా ఖాతాదారులు తమ ఖాతాల్లో నెలలో కనీస నగదు నిల్వ రూ.3వేలు ఉండాలి.

ఎవరైతే ఈ మొత్తాన్ని నిల్వ చేయారో వారికి భారీ పెనాల్టీలను ఎస్బీఐ విధించనుంది. అదే సెమీ అర్బన్ బ్రాంచుల్లో రూ.2వేలు తప్పక ఉండాలి. ఇక రూరల్ బ్రాంచ్ అకౌంట్లలో అయితే నెలవారీ మినిమం బ్యాలెన్స్ రూ. వెయ్యి ఉండాలి. లేదంటే వీరికి కూడా పెనాల్టీలు చెల్లించక తప్పదు. 

మెట్రో అర్బన్ బ్రాంచ్ MAB (రూ.3వేలు) :
* 50 శాతం లోపు : రూ.10+GST
* 50-75 శాతానికి పైగా : రూ.12+GST
* 75శాతం ఆపై : రూ.15+GST

సెమీ-అర్బన్ బ్రాంచ్ MAB (రూ.2వేలు)
* 50 శాతం లోపు  : రూ.7.50+GST
* 50-75 శాతానికి పైగా : రూ.10+GST
* 75శాతం ఆపై : రూ.12+GST

రూరల్ బ్రాంచ్ MAB (రూ. వెయ్యి)
* 50 శాతం లోపు : రూ.5+GST
* 50-75 శాతానికి పైగా : రూ.7.50+GST
* 75శాతం ఆపై : రూ.10+GST

గమనిక : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) శాలరీ అకౌంట్లు, చిన్నమొత్తాల్లో సేవింగ్స్ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ అకౌంట్లు, ప్రభుత్వ ఫైనాన్షియల్ స్కీమ్ లైన జన్ ధన్ స్కీమ్ సహా ఇతర పథకాలపై తెరిచిన అకౌంట్లపై ఎలాంటి ఛార్జీలు వర్తించవు.