Truecaller: మోసాల నివారణకు ట్రూకాలర్ ఏఐ రికగ్నైజేషన్ ఫీచర్.. ఓసారి కన్నేయండి

ఈ రిఫ్రెష్ చేయబడిన గుర్తింపులో ఒక భాగముగా ట్రూకాలర్ ఏఐ ఐడెంటిటి ఇంజన్ లో భాగంగా, ట్రూకాలర్ యూజర్లు సెర్చ్ కాంటెక్స్ట్ అనే ఒక శక్తివంతమైన మోసం-వ్యతిరేకమైన ఫీచర్ ను పొందుతారు

Truecaller: మోసాల నివారణకు ట్రూకాలర్ ఏఐ రికగ్నైజేషన్ ఫీచర్.. ఓసారి కన్నేయండి

AI Recognition Feature: ఈరోజుల్లో ట్రూకాలర్ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది ట్రూకాలర్ వాడుతుంటారు. అయితే ఇందులో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండేందుకు ట్రూకాలర్ తాజాగా ఏఐ రికగ్నైజేషన్ ఫీచర్ ను ప్రారంభించింది. ఇది గూగుల్ ప్లే, యాప్ స్టోరులో అప్డేట్ అందుబాటులో ఉంటుంది. దీని గురించి ట్రూకాలర్ సీఈఓ అలాన్ మామెడి స్పందిస్తూ.. “మా కొత్త బ్రాండ్ గుర్తింపును, లోగోను ఆవిష్కరించుటకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇది మా యూజర్ల పట్ల మాకు ఉన్న అంకితభావం, ప్రతిరోజు నిరంతరంగా అభివృద్ధి, మెరుగుపరచడానికి దృష్టి కేంద్రీకరించడాన్ని సూచిస్తుంది” అని అన్నారు.

Asian Games 2023 : బంగ్లాదేశ్‌పై విజ‌యం సాధించిన భార‌త్.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం

ఈ రిఫ్రెష్ చేయబడిన గుర్తింపులో ఒక భాగముగా ట్రూకాలర్ ఏఐ ఐడెంటిటి ఇంజన్ లో భాగంగా, ట్రూకాలర్ యూజర్లు సెర్చ్ కాంటెక్స్ట్ అనే ఒక శక్తివంతమైన మోసం-వ్యతిరేకమైన ఫీచర్ ను పొందుతారు. ఏ నంబరుకైనా సెర్చ్ ఫలితాలను చూడగానే, ట్రూకాలర్ యూజర్లు తక్షణమే ఆ నంబరు కొరకు ఉన్న పేరు ఇటీవల మార్చబడిందా లేదా తరచూ మార్చబడుతోందా అని సూచించబడతారు. ఈ సందర్భోచితమైన సందేశాన్ని ఈ యాప్ మూడు రంగుల వర్గాలుగా చూపిస్తుంది. నీలం, ఒక తటస్థ మార్పు కొరకు, పసుపుపచ్చ, గత 7 రోజులలో ఆ పేరు 3 కంటే ఎక్కువమార్లు మార్చబడి ఉంటే అది అనుమానాస్పదమైనదాని కొరకు, చివరిగా ఎరుపురంగు అనేకమార్లు తరచూ పేరు మార్పును, మోసపూరితమైన, స్కామర్ కార్యకలాపాన్ని సూచిస్తుంది. ఈ సందేశము ఆండ్రాయిడ్, ఐఫోన్, ట్రూకాలర్ వెబ్ లలో అన్ని సెర్చ్ ఫలితాలపై ట్రూకాలర్ యూజర్లు అందరికి చూపించబడుతుంది.