Asian Games 2023 : బంగ్లాదేశ్‌పై విజ‌యం సాధించిన భార‌త్.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం

చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా గేమ్స్ (Asian Games) 2023లో భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు బోణీ కొట్టింది. గురువారం బంగ్లాదేశ్ (Bangladesh) పై 1-0 తేడాతో విజ‌యం సాధించింది.

Asian Games 2023 : బంగ్లాదేశ్‌పై విజ‌యం సాధించిన భార‌త్.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం

Indian Football Team

Asian Games : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా గేమ్స్ (Asian Games) 2023లో భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు బోణీ కొట్టింది. గురువారం బంగ్లాదేశ్ (Bangladesh) పై 1-0 తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా నాకౌట్ (రౌండ్ ఆఫ్ 16) ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. టీమ్ఇండియా త‌న మొద‌టి మ్యాచులో అతిథ్య చైనా చేతిలో 1-5 గోల్స్ తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. తాజా విజ‌యంతో టీమ్ఇండియా గ్రూప్‌-ఏలో చైనా, మ‌య‌న్మార్‌ల‌తో స‌మానంగా మూడు పాయింట్లతో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌య‌న్మార్‌తో సెప్టెంబ‌ర్ 24న జ‌రిగే మ్యాచ్‌లో గ‌నుక టీమ్ఇండియా ఎటువంటి స‌మీక‌ర‌ణాలు అవ‌స‌రం లేకుండా నాకౌట్‌కు చేరుకుంటుంది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆద్యంతం హోరాహోరీగా సాగింది. మొద‌టి అర్థ‌భాగంలో మూడు సార్లు భార‌త జ‌ట్టుకు గోల్స్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ బంగ్లా డిఫెండ‌ర్లు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకున్నాడు. దీంతో ఫ‌స్టాఫ్ 0-0 స్కోరుతో ముగిసింది. రెండో అర్థ‌భాగంలో ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు గోల్స్ చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే.. మ్యాచ్ మ‌రో ఏడు నిమిషాల్లో ముగుస్తుంద‌నగా భార‌త స్టార్ ఆట‌గాడు సునీల్ ఛెత్రీ (83వ నిమిష‌యంలో) గోల్ చేశాడు. దీంతో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. త‌రువాత బంగ్లా ఆట‌గాళ్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా అదే స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది.

Asian Games 2023 : చ‌రిత్ర సృష్టించిన ష‌ఫాలీ వ‌ర్మ‌.. సెమీస్ చేరిన భార‌త్‌