చాలామంది వేలకు వేలు పెట్టి ఫోన్లు కొనుక్కోవడం.. కొన్న కొదిరోజులకే ఫోన్ లో సిగ్నల్ సరిగ్గా లేకపోయినా, నెట్ స్లోగా ఉన్నా, ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతున్నా టెన్షన్ అంతా ఇంతా ఉండదు. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో చాలా అలర్ట్‌గా ఉంటారు. ఏ స్మార్ట్‌ఫోన్ అయినా బ్యాటరీ ఒకరోజు మొత్తం వస్తే చాలు. బ్యాటరీ బాగానే ఉన్నట్టు. అలా కాకుండా కొన్ని గంటల్లోనే ఛార్జింగ్ ఖాళీ అవుతుందంటే సమస్య ఉన్నట్టే అని అనుకుంటారు. అయితే ఫోన్ బ్యాటరీ లైఫ్ టైం గురించి కొన్ని ముఖ్యమైన విషయలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ఫోన్ హీట్ ఎక్కడం వల్ల బ్యాటరీ త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి:
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ వేడెక్కినా, చల్లగా ఉన్నా బ్యాటరీ వేగంగా ఖాళీ అవడంతోపాటు లోపలి పరికరాలు పాడయ్యే ప్రమాదముంది. వీలైనంత వరకూ గది ఉష్ణోగ్రతలకు దగ్గరగా ఉంచేలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంతేకాదు ఎండాకాలంలో వాహనాల్లోపల మీ ఫోన్ వదిలేయడం అంతమంచిది కాదు. ఆ పరిస్థితుల్లో ఫోన్ ను వాడినా ఇబ్బందే. ఎందుకంటే ఆ వేడికి బ్యాటరీ త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.
* వైబ్రేషన్స్‌ను ఆపేయండి :
చాలామంది రింగ్‌టోన్లు ఇబ్బంది పెడుతున్నాయని ఎక్కువగా వైబ్రేషన్ మోడ్ లో పెడుతుంటారు. అయితే వైబ్రేషన్స్ తో బ్యాటరీ త్వరగా ఖాళీ అయ్యే అవకాశముంది. వైబ్రేషన్స్ ను పూర్తిగా తొలగించుకోవడం లేదా.. దాని తీవ్రతను తగ్గించుకోవడం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.
* పదేపదే ఛార్జింగ్ పెట్టకూడదు:
చాలా మందికి రాత్రి పడుకునే ముందు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి పడుకోవడం బాగా అలవాటు. ఇది ఫోన్ కి, బ్యాటరీకి చాలా ప్రమాదకరం. ఛార్జ్ బాగా తగ్గేంత వరకు ఉంచకుండా.. 30 నుంచి 40 శాతం లోపు రాగానే ఛార్జింగ్ పెట్టుకుంటే మంచిది. 30 శాతం తగ్గేంత వరకు ఛార్జింగ్ పెట్టకుండా ఉంటే బ్యాటరీ త్వరగా పాడైతోంది. అందుకే మీకు వీలైనప్పుడల్ల ఛార్జ్ చేస్తూ ఉండండి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుంది.
* వేరే ఛార్జర్స్, కేబుల్స్ వల్ల ఫోన్ కి డ్యామేజ్ అవ్వదు:
సాధారణంగా మన ఛార్జర్ పాడైనప్పడు పక్కన వాళ్ల ఛార్జర్ తీసుకుంటాం. కారు ఉన్న వాల్లైతే 10-15 వైర్లు ఉండే ఛార్జర్ తీసుకుని కేబుల్ తో మానేజ్ చేస్తుంటారు. అలా అని ఫోన్ బ్యాటరీకి ఏం ప్రమాదం ఉండదు. చాలామంది ఒకరి ఛార్జర్ మరొకరు వాడితే వారి ఫోన్ ఎక్కడ పాడైతుందో అని టెన్షన్ పడుతుంటారు. కానీ దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.