Twitter Blue subscribers can now upload videos of up to 2 hours, announces Elon Musk
Twitter CEO Elon Musk : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్ల కోసం కంపెనీ ప్రస్తుత సీఈఓ, బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) కొత్త ఆఫర్ ప్రకటించాడు. ట్విట్టర్ పోస్టుల్లో లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చునని మస్క్ ప్రకటించాడు. అంటే.. ట్విట్టర్ ప్లాట్‌ఫారంలో రెండు గంటలు లేదా 8GB వరకు నిడివి ఉన్న లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ట్విట్టర్ యూజర్లందరికి కాదండోయ్.. మస్క్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది.. మస్క్ ఏది అంత ఈజీగా ఇవ్వడు అనేదానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.. లాభం లేకుండా మస్క్ ఏ పని చేయడు. అందులో కచ్చితంగా ఏదో ఒక లాభం ఉండి తీరాల్సిందే..
ఇప్పుడు అదే చేశాడు.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు (Twitter Blue subscribers)కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందంటూ చివరిలో మస్క్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మేరకు మస్క్ ట్విట్టర్ వేదికగా ఇలా ట్వీట్ చేశాడు.. ‘ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు 2 గంటలు లేదా 8 GB వరకు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు’ అని ప్రకటించారు. అంటే.. నాన్-ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్ 140 సెకన్ల (2 నిమిషాలు, 20 సెకన్లు) వరకు మాత్రమే వీడియోలను అప్‌లోడ్ చేసుకునే వీలుంది.
Read Also : New Twitter CEO : ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యక్కరినో.. తొలి మహిళా సీఈఓ ఈమెనే.. ఎలన్ మస్క్ క్లారిటీ..!
ఏప్రిల్ 1వ తేదీన ఎలన్ మస్క్ ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ కోసం సబ్‌స్ర్కిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. గతంలో ఈ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా అందించేది. మస్క్ వచ్చిన తర్వాత పేమెంట్ సర్వీసుగా మారింది. ఇప్పుడు బ్లూ టిక్ మార్క్‌ని పొందాలంటే ట్విట్టర్ యూజర్లు నెలకు 8 డాలర్లు లేదా సంవత్సరానికి 84 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారతీయ ట్విట్టర్ యూజర్లు వెబ్‌సైట్, మొబైల్‌లో నెలకు రూ. 650, రూ. 900 చొప్పున బ్లూ బ్యాడ్జ్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.
30 నిమిషాల లోపు ట్వీట్ ఎడిట్ చేసుకోవచ్చు :
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు తమ ట్వీట్‌లను పోస్ట్ చేసిన 30 నిమిషాలలోపు 5 సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోలను కూడా పోస్ట్ చేయవచ్చు. 50 శాతం తక్కువ యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. ట్విట్టర్ అందించే కొత్త ఫీచర్‌లకు ముందస్తుగా యాక్సెస్‌ను పొందవచ్చు. బ్లూ టిక్ యూజర్ల పోస్టులకు కంపెనీ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. పాలసీల ప్రకారం, 90 రోజుల కన్నా ఎక్కువ పాత అకౌంట్ ఉన్న ట్విట్టర్ యూజర్లు టాప్ లెఫ్ట్ కార్నర్ వైపున ఉన్న ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయడం ద్వారా ట్విట్టర్ బ్లూ టిక్ యాక్సెస్ చేయవచ్చు.
Twitter CEO : Blue subscribers can now upload videos of up to 2 hours, announces Elon Musk
అమెరికా ఆధారిత టెక్ పోర్టల్ (TechCrunch) ప్రకారం.. ట్విట్టర్ పేమెంట్ ప్లాన్‌లో మార్పులు చేసింది. గత 60 నిమిషాల పరిమితిని 2 గంటలకు విస్తరించింది. అంతేకాదు.. ట్విట్టర్ బ్లూ పేజీని కూడా సవరించింది. పేమెంట్ యూజర్ల కోసం వీడియో ఫైల్ సైజు పరిమితిని ఇప్పుడు 2GB నుంచి 8GBకి పెంచినట్లు తెలిపింది. ఇంతకుముందు లాంగ్ వీడియో అప్‌లోడ్ వెబ్ నుంచి మాత్రమే అనుమతి ఉంది. ఇప్పుడు iOS యాప్ ద్వారా కూడా అప్ లోడ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఈ మార్పులు ఉన్నప్పటికీ, అప్‌లోడ్ మ్యాక్సిమమ్ క్వాలిటీ ఇప్పటికీ 1080pగానే ఉందని టెక్‌క్రంచ్ రిపోర్టు తెలిపింది.
Twitter Blue Verified subscribers can now upload 2 hour videos (8GB)!
— Elon Musk (@elonmusk) May 18, 2023
ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యక్కరినో :
ఇదిలా ఉండగా, మే 12న మాజీ NBC యూనివర్సల్ అడ్వర్టైజింగ్ చీఫ్ లిండా యక్కరినోను ట్విట్టర్ కొత్త సీఈఓగా ఎలన్ మస్క్ నియమించాడు. మస్క్ ప్రకారం, యక్కరినో ట్వి్ట్టర్ ‘బిజినెస్ కార్యకలాపాలపై’ దృష్టి సారించనున్నారు. గత ఏడాది 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ని మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వెరిఫైడ్ యూజర్లకు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసుకు ముందస్తు యాక్సెస్‌ను కలిగి ఉండేలా ట్విట్టర్‌కు మరో కొత్త ఆప్షన్ యాడ్ చేస్తున్నామని ఇటీవలే మస్క్ ప్రకటించారు. ఈ కొత్త అప్‌డేట్ ప్రస్తుతం వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.