New Twitter CEO : ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యక్కరినో.. తొలి మహిళా సీఈఓ ఈమెనే.. ఎలన్ మస్క్ క్లారిటీ..!

New Twitter CEO : ఎలన్ మస్క్ వైదొలిగితే.. ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరు వస్తారనే ఊహాగానాలకు ఎలన్ మస్క్ తెరదించాడు. కొత్త సీఈఓగా లిండా యక్కరినోనే నియమించాడు. వచ్చే ఆరు వారాల్లో ఆమె కంపెనీలో జాయిన్ అవుతారట..

New Twitter CEO : ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యక్కరినో.. తొలి మహిళా సీఈఓ ఈమెనే.. ఎలన్ మస్క్ క్లారిటీ..!

Elon Musk confirms Linda Yaccarino is the new Twitter CEO, she is joining in 6 weeks

New Twitter CEO Linda Yaccarino : ప్రపంచ బిలియనీర్, ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు. తన స్థానంలో కొత్త ట్విట్టర్ సీఈఓగా వచ్చేది ఎవరో మస్క్ క్లారిటీ ఇచ్చారు. తాను ఇది అధికారికంగా నియమించిన కొత్త ట్విట్టర్ సీఈఓ లిండా యక్కరినో అని మస్క్ ధృవీకరించారు.

యక్కరినో ప్రధానంగా వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెడుతుందని ఆయన తెలిపారు. తాను కంపెనీ ప్రొడక్టు డిజైన్, కొత్త టెక్నాలజీపై దృష్టి సారిస్తుందని మస్క్ వెల్లడించారు. ఆరు వారాల వ్యవధిలో అధికారికంగా ట్విట్టర్ సీఈఓగా ఆమె చేరనున్నారని మస్క్ గతంలోనే ధృవీకరించారు.

Read Also : Linda Yaccarino : 17 ఏళ్లలో ట్విట్టర్‌కు ఐదుగురు సీఈఓలు.. 6వ సీఈఓగా రానున్న లిండా యక్కరినో..!

తొలి మహిళా ట్విట్టర్ సీఈఓగా యక్కరినోనే :
మస్క్ శుక్రవారం సాయంత్రం కొత్త ట్విట్టర్ సీఈఓ పేరును అధికారికంగా ప్రకటించారు. ‘Linda Yaccarinoని ట్విట్టర్ కొత్త CEOగా స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. @LindaYacc ప్రధానంగా వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. నేను ప్రొడక్టు రూపకల్పన & కొత్త టెక్నాలజీపై దృష్టి సారిస్తాను. ఈ ప్లాట్‌ఫారమ్‌ను X, ప్రతిదీ యాప్‌గా మార్చడానికి లిండాతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని మస్క్ ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో మస్క్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి ట్విట్టర్‌కి కొత్త CEO వస్తారని, అప్పుడే తాను పదవీవిరమణ చేస్తానని చెప్పాడు.

Elon Musk confirms Linda Yaccarino is the new Twitter CEO, she is joining in 6 weeks

Elon Musk confirms Linda Yaccarino is the new Twitter CEO, she is joining in 6 weeks

కొత్త ట్విట్టర్ సీఈఓని తాను నియమించుకున్నానని ట్విట్టర్ బాస్ తెలిపారు. ఇప్పుడు, ప్రశ్న ఏమిటంటే.. లిండా యక్కరినో ఎవరు? తెలియనివారికి, ఆమె మీడియా పరిశ్రమలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా చెప్పవచ్చు. యక్కరినోనే (NBCUniversal)లో 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు. వివిధ రకాల పదవుల్లో బాధ్యతలను నిర్వర్తించారు.

ప్రస్తుతం, ఆమె (NBCUniversal) ఆల్ గ్లోబల్ అడ్వర్టైజింగ్, పార్టనర్ వ్యాపారాలకు బాధ్యత వహిస్తున్నారు. కొత్త ట్విట్టర్ సీఈఓ ఇప్పటి నుంచి 6 వారాల్లో కంపెనీలో చేరతారని మస్క్ గతంలో ధృవీకరించారు. యక్కరినోనే మొదటి మహిళా ట్విట్టర్ సీఈఓగా చెప్పవచ్చు. నాన్-టెక్ నేపథ్యం నుంచి వచ్చిన మొదటి మహిళా అని కూడా గమనించాలి. మాజీ-ట్విట్టర్ సీఈఓలు అందరూ కూడా సాంకేతిక నేపథ్యం నుంచి వచ్చినవారే ఉన్నారు. భవిష్యత్తులో యక్కరినోనే సారథ్యంలో ట్విట్టర్ ఎలాంటి ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుందో చూడాలి.

Read Also : Twitter New CEO : లిండా యక్కరినో ఎవరు? ట్విట్టర్ కొత్త సీఈఓగా వచ్చేది ఈమేనా? ఇంతకీ, మస్క్ ఎవరిని నియమించాడంటే?