Linda Yaccarino : 17 ఏళ్లలో ట్విట్టర్‌కు ఐదుగురు సీఈఓలు.. 6వ సీఈఓగా రానున్న లిండా యక్కరినో..!

Linda Yaccarino : ట్విట్టర్ కంపెనీ (Twitter) 2006లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదుగురు సీఈఓలు ఉన్నారు. 44 బిలియన్ల ఒప్పందంలో ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే ఎలన్ మస్క్.. గత ఏడాది అక్టోబర్ 22న కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు.

Linda Yaccarino : 17 ఏళ్లలో ట్విట్టర్‌కు ఐదుగురు సీఈఓలు.. 6వ సీఈఓగా రానున్న లిండా యక్కరినో..!

Twitter has had 5 CEOs in 17 years, Linda Yaccarino may be company’s 6th CEO

Linda Yaccarino : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) కంపెనీ ప్రస్తుత సీఈఓ, ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) రాబోయే కొత్త సీఈఓ ఎవరు అనేది చెప్పకనే చెప్పేశారు. ఆరు వారాల వ్యవధిలో ఎట్టకేలకు ట్విట్టర్‌కి కొత్త CEO వస్తారని మస్క్ ధృవీకరించారు. కంపెనీ తదుపరి సీఈఓ ఎవరనేది మస్క్ నేరుగా వెల్లడించనప్పటికీ.. (NBCUniversal)లో పనిచేస్తున్న లిండా యక్కరినో (Linda Yaccarino) సీఈఓ రోల్ చేపట్టనున్నట్లు ఇంటర్నెట్‌లో ఊహాగానాలు వినిపించాయి. లిండా యక్కరినో (NBCUniversal)తో 20 ఏళ్ల అనుబంధం కలిగి ఉన్నారు. ఆమె మీడియా, యాడ్స్‌లలో అనేక బాధ్యతలను చేపట్టారు. ఇప్పుడు ఆమె ఈ పదవిని చేపడితే.. ట్విట్టర్‌కి ఆరో సీఈఓ అవుతారు.

ట్విట్టర్‌లో 2006 నుంచి ఐదుగురు సీఈఓలు :
ట్విట్టర్ 2006లో ప్రారంభమైనప్పటి నుంచి ఐదుగురు సీఈఓలు ఉన్నారు. 44 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసిన వెంటనే పరాగ్ అగర్వాల్‌ను మస్క్ అక్టోబర్ 22న తొలగించారు. ట్విట్టర్ కంపెనీ మొదటి సీఈఓ ఇవాన్ విలియమ్స్ కాగా.. ఆయన 2006లో ట్విట్టర్‌ని స్థాపించాడు. 2008లో విలియమ్స్ సీఈఓ పదవి నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో డిక్ కాస్టోలో సీఈఓగా నియమితులయ్యారు. కాస్టోలో కంపెనీకి 5ఏళ్ల పాటు నాయకత్వం వహించారు. అదే సమయంలో ట్విట్టర్ గణనీయమైన వృద్ధిని సాధించింది. అప్పడే కాస్టోలోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే క్రమంలో డిక్ కాస్టోలో 2015లో తన పదవికి రాజీనామా చేశాడు.

Read Also : Twitter CEO : నేను దిగిపోతున్నా.. ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరంటే..? మరో 6 వారాల్లో మీరే చూస్తారు.. ఎలన్ మస్క్!

కాస్టోలో స్థానంలో జాక్ డోర్సే సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో 2006 నుంచి 2008 వరకు ట్విట్టర్ సీఈఓగా పనిచేశారు. సీఈఓగా డోర్సే పని విధానాల్లో కొత్త మార్పులు తీసుకురావడం వివాదానికి దారితీసింది. కంపెనీ మోడరేషన్ విధానాలను నిర్వహించడంలో విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాదు.. అనేక కుంభకోణాలలో కూడా అతని ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. 2022లో, డోర్సే మళ్లీ సీఈఓ పదవి నుంచి వైదొలిగాడు. ఈసారి తన ఇతర కంపెనీ స్క్వేర్‌పై దృష్టి పెట్టాడు. తన రాజీనామాను ప్రకటించిన సమయంలో డోర్సే ట్విట్టర్ వ్యవస్థాపకుల నుంచి ముందుకు సాగడానికి ఇదే సమయమని తెలిపాడు. తన వారసుడిగా పేరుపొందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా నియమించాడు. ట్విట్టర్‌ను సమర్థవంతంగా నడపగలడనే నమ్మకం పరాగ్‌పై ఉందని చెప్పాడు.

Twitter has had 5 CEOs in 17 years, Linda Yaccarino may be company’s 6th CEO

Twitter has had 5 CEOs in 17 years, Linda Yaccarino may be company’s 6th CEO

పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన మస్క్ :
అప్పడే.. డోర్సీ స్థానంలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. అగర్వాల్ 2011లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ట్విట్టర్‌లో చేరారు. తన పనితీరుతో అనతికాలంలోనే టాప్ ర్యాంక్‌లకు చేరుకున్నాడు. చివరికి 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందాడు. ట్విట్టర్ ఇంజనీరింగ్, ప్రొడక్టుల బృందాలను పర్యవేక్షించే బాధ్యతను తీసుకున్నాడు. అప్పుడే 280-అక్షరాల ట్వీట్, లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ వంటి కొత్త ఫీచర్ల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. సెక్యూరిటీ, సెక్యూరిటీ ఫీచర్లను మెరుగుపరచడానికి ట్విట్టర్ ప్రయత్నాలకు కూడా అగర్వాల్ పూర్తి నాయకత్వం వహించాడు.

ఆరవ సీఈవోగా రానున్న లిండా :
సీఈవోగా అగర్వాల్ పదవీకాలం స్వల్పకాలికమే.. ఎందుకంటే.. నవంబర్ 2022లో, ట్విట్టర్ కంపెనీలో మెజారిటీ వాటాను పొందిన ఎలన్ మస్క్ అతన్ని తొలగించాడు. ప్రస్తుతం, ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఐదో సీఈఓగా కొనసాగుతున్నారు. తాను కూడా తాత్కాలిక సీఈఓను మాత్రమేనని, కంపెనీకి కొత్త సీఈఓ కోసం వెతుకుతున్నానని గతంలోనే మస్క్ చెప్పాడు. చివరకు లిండా యక్కరినోను ట్విట్టర్ ఆరో సీఈఓగా నియమించనున్నాడు. మరో ఆరు వారాల్లో ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరు అనేది ఫుల్ క్లారిటీ రానుంది.

Read Also : Twitter New CEO : లిండా యక్కరినో ఎవరు? ట్విట్టర్ కొత్త సీఈఓగా వచ్చేది ఈమేనా? ఇంతకీ, మస్క్ ఎవరిని నియమించాడంటే?