Twitter New CEO : లిండా యక్కరినో ఎవరు? ట్విట్టర్ కొత్త సీఈఓగా వచ్చేది ఈమేనా? ఇంతకీ, మస్క్ ఎవరిని నియమించాడంటే?

Twitter New CEO Linda Yaccarino : ట్విట్టర్ కొత్త సీఈఓని నియమించానని, ఆరు వారాల్లో ట్విట్టర్ తదుపరి సీఈఓగా బాధ్యతలు ఆమె చేపడతారని ఎలోన్ మస్క్ హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఎవరు? అనేది మస్క్ రివీల్ చేయలేదు. లిండా యక్కరినో పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

Twitter New CEO : లిండా యక్కరినో ఎవరు? ట్విట్టర్ కొత్త సీఈఓగా వచ్చేది ఈమేనా? ఇంతకీ, మస్క్ ఎవరిని నియమించాడంటే?

Who is Linda Yaccarino_ Know everything about Twitter's possible new CEO Linda Yaccarino

Twitter New CEO Linda Yaccarino : ప్రపంచ బిలియనీర్, ట్విట్టర్ బాస్, ప్రస్తుత సీఈఓ ఎలోన్ మస్క్ (Twitter CEO Elon Musk) వైదొలగనున్నాడు. త్వరలో కంపెనీ కొత్త సీఈఓ ఎవరు అనేది ఆయన ప్రకటించారు. మరో ఆరు వారాల్లో ట్విట్టర్ కొత్త సీఈఓ పగ్గాలు అందుకుంటారని మస్క్ హింట్ ఇచ్చాడు. అయితే, వచ్చే ఆ వ్యక్తి పేరును మాత్రం మస్క్ వెల్లడించలేదు. ఆమె అని మాత్రం మస్క్ రివీల్ చేశాడు. అప్పటినుంచి ఆమె ఎవరు అనేది ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కాబోయే ట్విట్టర్ కొత్త సీఈఓ అంటూ ఒక పేరు బయటకు వచ్చింది. దాదాపు ఆమెనే సీఈఓ అంటూ నిర్ధారణకు వచ్చేశారు. ఇంతకీ ఆమె ఎవరంటే? లిండా యక్కరినో (Linda Yaccarino). ట్విట్టర్ కొత్త (Twitter CEO) అయ్యే అవకాశం ఈమెకే ఎక్కువ అవకాశం ఉందట. అసలు ఈ లిండా ఎవరు? అని చాలా మంది ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు..

కంపెనీకి తన తర్వాత బెస్ట్ సీఈఓగా లిండానే సమర్థురాలని మస్క్ భావిస్తున్నారట. ఇప్పటివరకూ ట్విట్టర్ సీఈఓలు అందరూ సాంకేతిక నేపథ్యం నుంచే వారు ఉన్నారు. కానీ, లిండా యక్కరినో మాత్రం అందుకు భిన్నమైన రంగం.. లిండా ఈ రోల్ స్వీకరిస్తే.. నాన్-టెక్ ఇండస్ట్రీ నుంచి ఎంపిక అయిన మొదటి ట్విట్టర్ సీఈఓ అవుతారు. యక్కరినో మీడియా రంగానికి చెందిన వ్యక్తి. ఆమె 20 ఏళ్లకు పైగా NBC యూనివర్సల్‌లో పనిచేస్తున్నారు. అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆమె (NBCUniversal) అన్ని గ్లోబల్ అడ్వర్టైజింగ్, భాగస్వామ్య వ్యాపారాలకు బాధ్యత వహిస్తున్నారు.

Who is Linda Yaccarino_ Know everything about Twitter's possible new CEO Linda Yaccarino

Who is Linda Yaccarino_ Know everything about Twitter’s possible new CEO Linda Yaccarino

లిండా విద్యాభ్యాసం, NBCలో రోల్ ఏంటి? :
యక్కరినో పెన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె లిబరల్ ఆర్ట్స్, టెలికమ్యూనికేషన్స్ అభ్యసించారు. టర్నర్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్‌లో ఆమె వృత్తిని ప్రారంభించారు. అక్కడ ఆమె వివిధ రకాల సేల్స్, మార్కెటింగ్ స్థానాల్లో పనిచేశారు. 1999లో లిండా NBC యూనివర్సల్‌లో చేరారు. అక్కడి నుంచి ఆమె అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగారు. 2007లో యక్కరినో NBC యూనివర్సల్‌లో ఎంటర్ టైన్మెంట్ యాడ్స్ సేల్స్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. బ్రాడ్‌క్యాస్ట్, కేబుల్, డిజిటల్‌తో సహా అనేక ఎంటర్‌టైన్మెంట్ ప్రొగ్రామ్స్ కోసం పనిచేశారు. కంపెనీ అన్ని యాడ్స్ సేల్స్‌కు ఆమె బాధ్యత వహించారు. కొత్త అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్‌లు, ప్లాట్‌ఫారమ్‌లను డెవలప్ చేసేందుకు కూడా ఆమె బాధ్యత వహించారు.

ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా లిండాను నియమించుకునే అవకాశం ఉంది. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి సాంప్రదాయ సోషల్ మీడియా కంపెనీ కన్నా సాధారణ మీడియా కంపెనీకి దగ్గరగా ఉండే ట్విట్టర్ వ్యాపార, ప్రకటనల వైపు యక్కరినో వెళ్లే ఆలోచన కనిపిస్తోంది. అయితే, ట్విట్టర్ ప్రొడక్టు, ఇంజినీరింగ్ వైపు మస్క్ కంపెనీ టీంను ముందుకు నడిపించనున్నాడు. 2011లో, యక్కరినో (NBCUniversal)లో గ్లోబల్ అడ్వర్టైజింగ్, భాగస్వామ్యాల ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఇందులో బ్రాడ్‌క్యాస్ట్ కేబుల్, డిజిటల్, అంతర్జాతీయంతో సహా సంస్థ అన్ని యాడ్స్, భాగస్వామ్య వ్యాపారాలకు ఆమె బాధ్యత వహిస్తున్నారు. కొత్త యాడ్స్ ప్రొడక్టులు, ప్లాట్‌ఫారమ్‌ అభివృద్ధికి కూడా ఆమె బాధ్యత వహించారు.

Who is Linda Yaccarino_ Know everything about Twitter's possible new CEO Linda Yaccarino

Who is Linda Yaccarino_ Know everything about Twitter’s possible new CEO 

డొనాల్డ్ ట్రంప్‌తో యక్కరినో స్నేహం :
లిండా యక్కరినోను ట్విట్టర్ సీఈఓగా మస్క్ నియమించాలనుకోవడానికి మరో కారణం.. డొనాల్డ్ ట్రంప్‌తో యక్కరినో స్నేహమే.. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌కు లిండా రైట్ హ్యాండ్ అని చెప్పవచ్చు. మస్క్ ఇటీవలి నెలల్లో అమెరికాలోని రైట్ వింగ్, రిపబ్లికన్‌లను కలిశారు. ఇదే సమయంలో డోనాల్డ్ ట్రంప్‌తో మస్క్ మాట్లాడారు. అప్పుడే లిండాతో మస్క్ పరిచయం ఏర్పడిందట.. ట్విట్టర్ సీఈఓగా లిండా సరిగా సరిపోతారని మస్క్ నిర్ణయానికి వచ్చారట.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మంచి స్నేహితురాలిగా యాకారినోకు పేరుంది. ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్‌లో రెండేళ్లపాటు లిండా సేవలందించారు. ఇందులో ట్రంప్ సూచించిన వ్యక్తుల్లో లిండా కూడా ఉన్నారు.

NBCతో ఎలోన్ మస్క్ కనెక్షన్ :
ఎన్‌బీసీ (NBCUniversal) MMA మయామి ఈవెంట్‌లో మస్క్ లిండా యక్కరినోతో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోవడం కనిపించింది. ట్విట్టర్‌లో మార్కెటింగ్ భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యక్కరినో మస్క్‌ను ప్రశంసించారు. యక్కరినో ట్విట్టర్‌లో అంతగా యాక్టివ్‌గా ఉండరు. కనీసం ఎలన్ మస్క్ ఎలా ఉంటాడో కూడా ఆమెకు తెలియదట.. ట్విట్టర్ సీఈఓగా ఆమె నియామకం గురించి పుకార్లు ఇంటర్నెట్‌లో రావడానికి ముందు.. ఆమెకు ట్విట్టర్ అకౌంట్లో 7వేల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఆమె చాలా రోజులుగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. బహుశా ఆమె ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆమె ప్రస్తుత చీఫ్ ట్విట్ మాదిరిగానే ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందో లేదో చూడాలి.

Read Also : Twitter CEO : నేను దిగిపోతున్నా.. ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరంటే..? మరో 6 వారాల్లో మీరే చూస్తారు.. ఎలన్ మస్క్!