Twitter Employees : ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. జాబ్ మానేస్తారా?.. పోతే పోండి.. డోంట్ కేర్ అంటున్న మస్క్..!

Twitter Employees : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ దిగ్గజం ట్విట్టర్‌ టేకోవర్ తర్వాత ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది.

Twitter Employees : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ దిగ్గజం ట్విట్టర్‌ టేకోవర్ తర్వాత ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. ఎక్కడ తమ ఉద్యోగాన్ని కోల్పోతామనే భయమే వారిని ఎక్కువగా వేధిస్తోంది. ట్విట్టర్ డీల్ పూర్తి అయిన తర్వాత తమను ఉద్యోగంలో నుంచి మస్క్ తీసేస్తాడనే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే అప్పటివరకూ ఉండేకంటే ముందుగానే మరో జాబ్ చూసుకోవాలని నిర్ణయించుకున్నారట.. అందుకోసం కొంతమంది ట్విట్టర్ ఉద్యోగులు ముందుగానే ప్లానింగ్ చేస్తున్నారని సమాచారం. ఎలాన్ మస్క్ గత నెలలో 44 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మస్క్ మొత్తం లిక్విడ్ క్యాష్ రూపంలోనే చెల్లిస్తానన్నాడు. ట్విట్టర్ డీల్ పూర్తయిన తర్వాత మస్క్ తీసుకొచ్చే కొత్త మార్పులపై ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మస్క్ నిర్ణయాలకు భయపడి.. కొంతమంది ట్విట్టర్ ఉద్యోగులు సంస్థ నుంచి నిష్క్రమించాలని ప్లాన్ చేస్తున్నారట.. ట్విట్టర్ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మానేస్తామన్నప్పటికీ బిలియనీర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదట..

ఇది స్వేచ్ఛా దేశం.. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. మస్క్
ట్విట్టర్ ఉద్యోగులు వెళ్లిపోతే వెళ్లిపోని అన్న ధోరణీలో ఉన్నట్టు కనిపిస్తున్నారు మస్క్. సోమవారం మెట్ గాలా (Met Gala)లో రెడ్ కార్పెట్‌పై ఉన్న ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలిగే అవకాశం ఉందని టెస్లా CEOని రాయిటర్స్ ప్రశ్నించింది. దానికి మస్క్ స్పందిస్తూ.. ట్విట్టర్ ఉద్యోగులు వైదొలగడంపై తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదన్నాడు. పైగా ఇది స్వేచ్ఛా దేశమంటూ చెప్పుకొచ్చాడు. కచ్చితంగా ఎవరైనా ఎప్పుడైనా తాము చేసే పనితో సంతృప్తిగా లేకుంటే తమ ఇష్టానుసారం వేరే చోటుకు వెళ్తారు… అది మంచిదే కదా అని మస్క్ అన్నాడు.. అంటే.. ప్రస్తుత ట్విట్టర్ ఉద్యోగులు వెళ్లిపోతామన్న మస్క్ పెద్దగా పట్టించుకోను అనేది ఆయన మాటల్లోనే వ్యక్తపరిచారు. ఇటీవల ట్విట్టర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు దాఖలు చేసిన ఫైలింగ్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ట్విట్టర్ యాజమాన్యం మార్పుతో చాలామంది ఉద్యోగులను కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చునని ట్విట్టర్ ఫైలింగ్ లో పేర్కొంది. మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటినుంచి ఆ సంస్థ ఉద్యోగుల్లో తమ ఉద్యోగ భద్రతపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.

Twitter Employees May Want To Quit After Elon Musk Takeover, But He Doesn’t Care

అసలేం జరుగుతుందో తెలియక, చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉన్నట్టా ఊడినట్టేనా అనే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. తమ ఉద్యోగాలపై స్పష్టత కోసం ఉద్యోగులంతా పదే పదే, CEO పరాగ్ అగర్వాల్ ఇతర ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదిస్తున్నారట.. ప్రస్తుతానికి ఉద్యోగుల తొలగింపు లేదని అగర్వాల్ హామీ ఇచ్చినప్పటికీ.. టెస్లా సీఈఓ మస్క్.. ప్రస్తుత సంస్థ యాజమాన్యంతో పాటు బోర్డుతో సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. కంపెనీ ఛైర్మన్ బ్రెట్ టేలర్‌‌తో మస్క్ మాట్లాడుతూ.. కంపెనీ నిర్వహణపై తనకు నమ్మకం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుత కంపెనీ CEO పరాగ్ అగర్వాల్‌ను కూడా తొలగించే యోచనలో మస్క్ ఉన్నారంటూ కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ట్విటర్‌లో అగర్వాల్ స్పందిస్తూ.. తన ఉద్యోగం పోతుందనే ఆందోళన తనకు లేదని చెప్పారు. కంపెనీ భవిష్యత్తుపై తనకు మరింత దృష్టిపెట్టినట్టు తెలిపారు. బోర్డు ఒత్తిడి మేరకు జాక్ డోర్సే రాజీనామా చేయడంతో గత నవంబర్‌లో అగర్వాల్ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

Read Also : Twitter CEO Parag : మస్క్ మైండ్ గేమ్.. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌‌ను తొలగిస్తాడా? అతడికి ఎలాన్ ఎంత చెల్లించాలంటే?

ట్రెండింగ్ వార్తలు