Twitter Safety Policy : ట్విట్టర్‌లో కొత్త నిబంధనలు..ఇకపై అలా చేస్తే కుదరదు

పబ్లిక్ ప్లేసుల్లో ఫొటోలు తీసి ట్విట్టర్ లో అనుమతులు లేకుండా పోస్టులు చేయాలంటివి ఘటనలు అమెరికాలో అత్యధికమౌతున్నాయి.

Twitter Policy

Twitter Safety Policy : సోషల్ మీడియాలో దిగ్గజం ట్విట్టర్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి తాట తీయనుంది. ఇప్పటికే ట్విట్టర్ లో కఠిన నిబంధనలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. కొత్త పాలసీ 2021, నవంబర్ 30వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. అవతలివాళ్ల  అనుమతి లేకుండా..ఫొటోలు, వీడియోలు..ఇతరత్రా సమాచారం పోస్టు చేయడానికి ఇక నుంచి వీల్లేదని ఖరాఖండిగా చెప్పింది. దీనిపై తమకు కంప్లైట్స్ వస్తే..ఆ పోస్టును వెంటనే తొలగించడం జరుగుతుందని తెలిపింది.

Read More : Tirumala Ghat Roads Damage : యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు-టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఫైనాన్షియల్ ట్రాన్స్ జాక్షన్ కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం ఉల్లంఘన కిందకు వస్తుందని, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, జీపీఎస్ లోకేషన్, ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈమెయిల్స్ ట్విట్టర్ లో షేర్ చేయడానికి వీల్లేదు. ప్రజాప్రయోజనాల కోసం ఇతరులకు సంబంధించి మీడియా షేర్ చేసే పోస్టులకు ఈ నిబంధన వర్తించదు. చర్యల్లో  భాగంగా…ఈ వ్యవహారం తీవ్రతను బట్టి…అకౌంట్ ను తాత్కాలికంగా బ్లాక్ చేయడం..లేదంటే..పర్మినెంట్ గా సస్పెండ్ చేయడమో జరుగుతుందని ట్విట్టర్ తెలిపింది.

Read More : WHO : ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దు..దక్షిణాఫ్రికాను శిక్షించొద్దు

పబ్లిక్ ప్లేసుల్లో ఫొటోలు తీసి ట్విట్టర్ లో అనుమతులు లేకుండా పోస్టులు చేయాలంటివి ఘటనలు అమెరికాలో అత్యధికమౌతున్నాయి. యూజర్ల వ్యక్తిగత భద్రతను కాపాడేందుకు ఆయా దేశాల చట్టాలను అనుసరించి  ఈ అప్ డేట్ తీసుకరావడం జరిగిందని ట్విట్టర్ వెల్లడించింది.