Twitter Blue Verified Badge : లెగసీ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను తొలగించిన ట్విట్టర్.. ఎవరినీ వదల్లేదు.. ఎలన్ మస్క్ అన్నట్టే చేశాడుగా..!

Twitter Blue Verified Badge : ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లు ఒక్కసారిగా మాయమైపోయ్యాయి. ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్ల అకౌంట్లలో చాలామంది బ్లూ బ్యాడ్జ్‌లను ట్విట్టర్ తొలగించింది. సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లలో సైతం బ్లూ టిక్ అదృశ్యమైంది..

Twitter removes Blue Verified Badge of non-paying users _ Full story

Twitter Blue Verified Badge : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) బ్లూ సబ్‌స్క్రిప్షన్‌కు సభ్యత్వం లేని ప్రొఫైల్‌ల నుంచి లెగసీ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను (Twitter) తొలగించింది. ఏప్రిల్ ప్రారంభంలో కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) లెగసీ ట్విట్టర్ అకౌంట్లలో వెరిఫైడ్ బ్లూ టిక్ తొలగించనున్నట్టు ప్రకటించాడు. ఏప్రిల్ 20 అంటే.. (4/20) లోపు ఎవరైతే.. బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ చెల్లించరో ఆయా అకౌంట్లలో బ్లూ టిక్‌ను కోల్పోతారని మస్క్ స్పష్టం చేశాడు. ఈ నెల (ఏప్రిల్ 1 నుంచి) ప్రారంభంలోనే లెగసీ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను తొలగించినున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది.

అయితే, ఎంపిక చేసిన ట్విట్టర్ యూజర్లలో కొందరి ప్రొఫైల్ నుంచి మాత్రమే బ్లూ టిక్‌ను తొలగించింది. మరికొందరిలో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ చెల్లించనప్పటికీ.. ఎంపిక చేసిన ట్విట్టర్ యూజర్లు బ్లూ టిక్‌ను కలిగి ఉన్నారు. కానీ, చాలామంది సెలబ్రిటీల అకౌంట్లలోనూ బ్లూ టిక్ బ్యాడ్జ్ తొలగించింది ట్విట్టర్. ట్విట్టర్ మొదట్లో ఎలన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత గత ఏడాది చివరిలో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలను ప్రకటించింది. ట్విట్టర్ యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందినప్పటికీ.. మొబైల్ నంబర్‌ని వెరిఫైడ్ చేసిన యూజర్లు మాత్రమే ఆటోమాటిక్‌గా బ్లూ టిక్ మార్క్‌ని పొందవచ్చు.

ట్విట్టర్ పాత విధానం ప్రకారం.. అకౌంట్ పబ్లిక్ ఇంటరెస్ట్‌కు సంబంధించి ట్విట్టర్ ప్రొఫైల్‌లకు బ్లూ బ్యాడ్జ్‌లను అందిస్తుంది. వినియోగదారులు ఒక ఫారమ్‌ను నింపడం ద్వారా బ్యాడ్జ్‌ల కోసం అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ, పాత ధృవీకరణ వ్యవస్థ ఎల్లప్పుడూ సరసమైనది కాదు. ఈ ప్రక్రియ కొంతవరకు ఏకపక్షంగా ఉంటుంది. అందుకే, మస్క్ ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి పాత తరహా వెరిఫికేషన్ సిస్టమ్‌ను తొలగించాలని భావించారు. దానికి బదులుగా, యూజర్లు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్‌ని సులభంగా పొందాలని, సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించడం ద్వారా కొన్ని ప్రీమియం ఫీచర్‌లను పొందవచ్చునని మస్క్ నిర్ణయించాడు.

ట్విట్టర్ బ్యాడ్జ్ కోల్పోయిన ప్రముఖులు వీరే..
ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌తో బ్లూ కలర్ బ్యాడ్జ్‌ని అందించాలని మస్క్ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు, వార్తా సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. బ్లూ టిక్ ప్రారంభ సమయంలో, కొంతమంది యూజర్ల పేర్లు, మోసపూరిత ప్రొఫైల్ ఫొటోలతో అనేక అకౌంట్లు సైతం వెరిఫై అయ్యాయి. ఇలా వెరిఫై అయిన బ్యాడ్జ్‌ని ట్విట్టర్ బ్లూ, స్పామ్ వంటి అకౌంట్లకు వర్తిస్తుందని కొందరు భయపడుతున్నారు. ప్రస్తుత అప్‌డేట్‌కు ముందు.. లెగసీ బ్లూ టిక్‌ కలిగిన చాలామంది ట్విట్టర్ యూజర్లు.. ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్లను ఫాలో అయ్యారు.

Read Also : Twitter Tweet Limit : ట్విట్టర్‌లో ఇకపై 10వేల క్యారెక్టర్ల వరకు ట్వీట్ చేయొచ్చు.. వారికి మాత్రమే.. మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన మస్క్..!

ఇప్పటికే ట్విట్టర్‌లో నాలుగు లక్షల మంది వెరిఫైడ్ యూజర్లు ఉన్నారు. ఈ సమయంలో, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం తమ అకౌంట్లో బ్లూ టిక్‌ను కోల్పోయారు. ఇందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. సెలీనా గోమెజ్, కిమ్ కర్దాషియాన్, కైలీ జెన్నర్, లేడీ గాగాతో సహా యాక్టివ్ ట్విట్టర్ ప్రొఫైల్‌లతో అంతర్జాతీయ ప్రముఖులు కూడా తమ వెరిఫైడ్ స్టేటస్ కోల్పోయారు.

Twitter removes Blue Verified Badge of non-paying users

కొన్ని అకౌంట్లలో వెరిఫై స్టేటస్ తొలగించని మస్క్ :
అయితే, ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రయిబ్ చేయనప్పటికీ కొన్ని ట్విట్టర్ ప్రొఫైల్‌లు ఇప్పటికీ వెరిఫై స్టేటస్ కలిగి ఉన్నాయి. ఇందులో రచయిత స్టీఫెన్ కింగ్, NBA ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ ఉన్నారు. దీనిపై ఒక యూజర్ సూచిస్తూ.. ‘స్టీఫెన్ కింగ్, లెబ్రాన్ జేమ్స్‌లకు ట్విట్టర్ బ్లూ టిక్ అందించేందుకు ఎలన్ మస్క్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ట్విట్టర్ బ్లూ సబ్ స్ర్కిప్షన్ చెల్లించారని ఆయన తప్పుగా చెప్పారు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ తాము కచ్చితంగా బ్లూ టిక్ కోసం చెల్లించబోమని హై-ప్రొఫైల్ ట్వీట్లు చేశారని తెలియజేశాడు.

ప్రస్తుతం, రాజకీయ నేతలకు కూడా బ్లూ టిక్ లేదు. అయితే, ట్విట్టర్ అకౌంట్ స్టేటస్ యూజర్లకు తెలియజేసేందుకు ట్విట్టర్ ఇటీవల వారి ప్రొఫైల్‌లలో గ్రే టిక్‌ను చేర్చింది. గ్రే టిక్ ఇలా ఉంది, ‘ఈ అకౌంట్ వెరిఫై అయింది. ఎందుకంటే.. ప్రభుత్వ లేదా మల్టీ కంపెనీల అకౌంట్’ అని రాసి ఉంది. ఈ బ్యాడ్జ్ పీఎం నరేంద్ర మోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, యూకే పీఎం రిషి సునక్ వంటి మరిన్ని ప్రొఫైల్‌లకు గ్రే టిక్ యాడ్ చేసింది.

ఫోన్లలో నెలకు రూ. 900.. వెబ్‌లో రూ.650 చెల్లించాలి :   

ట్విట్టర్ యూజర్లలో తమ వెరిఫైడ్ స్టేటస్ కోరుకునే పాత యూజర్లు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ల ధర మార్కెట్‌ను బట్టి మారుతుంది. భారత మార్కెట్లో ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.900 ఉంటుంది. ట్విట్టర్ వెబ్‌సైట్‌లో ఖర్చు నెలకు రూ.650కి తగ్గుతుంది. వినియోగదారులు సాపేక్షంగా తక్కువ ఖర్చుతో కూడిన వార్షిక చందాను కూడా ఎంచుకోవచ్చు.

మీరు ట్విట్టర్ బ్లూ సభ్యత్వాన్ని పొందాలా వద్దా అనేది యూజర్‌ను బట్టి మారుతూ ఉంటుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్‌లకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వెరిఫైడ్ ప్రొఫైల్ నుంచి చేసిన ట్వీట్లు మరింత సెక్యూరిటీ కలిగి ఉంటాయి. ఇది ఫాలోవర్ల సంఖ్య పెరిగేందుకు సాయపడుతుంది. లేకపోతే, మీరు లాంగ్-ఫారమ్ ట్వీట్‌లు లేదా ట్వీట్‌లను ఎడిట్ చేయడం/క్యాన్సిల్ చేయడం వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్‌లను పొందవచ్చు. ట్విట్టర్ బ్లూ టైమ్‌లైన్ నుంచి యాడ్స్ మాత్రం కంపెనీ తొలగించలేదు. ట్విట్టర్‌లో యాడ్స్ తొలగించే ఫీచర్ అందుబాటులో లేదు.

Read Also : Twitter Blue Tick : ట్విట్టర్ లెగసీ అకౌంట్లలో బ్లూ టిక్‌‌‌కు ‘4/20’ లాస్ట్ డేట్.. ఈ తేదీనే మస్క్ ఎందుకు ఎంచుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!