UIDAI Aadhaar App
UIDAI Aadhaar App : ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మీ ఐడెంటిటీకి సంబంధించి సరికొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైవసీ, సెక్యూరిటీని అందిస్తుంది. ఆండ్రాయిడ్, iOS ఐఫోన్లలో రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఆధార్ వినియోగదారులు తమ ఆధార్‌ను డిజిటల్‌గా స్టోర్ చేసుకోవచ్చు. ఏ వ్యక్తిగత వివరాలను షేర్ చేయాలో కంట్రోల్ చేయొచ్చు.
అదనపు ప్రొటెక్షన్ కోసం బయోమెట్రిక్ (Aadhaar App) డేటాను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయొచ్చు. సెలెక్టివ్ డేటా షేరింగ్ మల్టీ కార్డ్ స్టోరేజీ వంటి ఆప్షన్లతో ఈ యాప్ మీ డేటా ఎలా వాడుతున్నారు అనేదానిపై ఫుల్ కంట్రోలింగ్ అందిస్తుంది. మీ ఆధార్ ఎప్పుడు, ఎక్కడ వాడారో ట్రాక్ చేయొచ్చు. అన్ని కార్యకలాపాలపై క్లియర్ రికార్డును అందిస్తుంది. మీరు ఒకే యాప్‌లో మల్టీ ఫ్యామిలీ సభ్యుల కోసం ఆధార్ కార్డులను సేఫ్‌గా స్టోర్ చేయవచ్చు. డిజిటల్ ఐడెంటిటీ నిర్వహణకు సింగిల్-స్టాప్ హబ్‌గా మారుతుంది.
ఆధార్ యాప్ ఫీచర్లు :
ఈ యాప్ ద్వారా మీ ఆధార్‌ను సేఫ్ QR కోడ్‌తో డిజిటల్‌గా షేర్ చేసుకోవచ్చు. మీ ఐడీని షేర్ చేసేటప్పుడు మీ పేరు, ఫొటో లేదా పుట్టిన తేదీ వంటి ఏ డేటాను బహిర్గతం చేయాలో నిర్ణయించుకోవచ్చు. మీ అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలను ప్రైవసీగా ఉంచవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు బయోమెట్రిక్ డేటాను లాక్/అన్‌లాక్ చేసేందుకు ఆధార్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించారో చెక్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు సంబంధించి మల్టీ ఆధార్ కార్డులను ఇందులోనే స్టోర్ చేసుకోవచ్చు.
కొత్త ఆధార్ యాప్ డౌన్‌లోడ్, సెటప్ ఎలా? :
ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం, సెటప్ చేయడం చాలా ఈజీ. ఆధార్ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది. ఇన్‌స్టాల్ తర్వాత వినియోగదారులు యాప్ పర్మిషన్స్ కోసం Allow చేయాలి. అలాగే తమ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం..