Upcoming Phones 2026 : ఈ అక్టోబర్‌లో మీ ఫోన్ మార్చేస్తారా? వివో నుంచి మోటో వరకు రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..!
Upcoming Phones in October 2026 : స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఏయే ఫోన్లు రానున్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- September 30, 2026 / 04:18 PM IST
Upcoming Phones in October 2026
- అక్టోబర్‌లో వివో వి80, వివో S2 ఎఫ్ఈ, ఒప్పో ఎఫ్35 సిరీస్ ఫోన్లు
- చైనాలో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ లాంచ్ కానుంది
- మోటోరోలా ఎడ్జ్ 70 నియో కూడా వస్తుందని అంచనా
Upcoming Phones in October 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి పండగే.. వచ్చేది కూడా పండగ సీజన్.. ఈ అక్టోబర్ నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.
మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. భారీ బ్యాటరీలు, ఫాస్ట్ ప్రాసెసర్‌లు, మెరుగైన కెమెరాల వంటి ఫీచర్లు ఉండొచ్చు. కొన్ని కంపెనీలు తమ ఫోన్ల లాంచ్ తేదీలను కూడా ధృవీకరించాయి. అక్టోబర్‌లో ఏయే స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో V80 :
అక్టోబర్ 6న వివో వి80 2026 లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇందులో జైస్ (Zeiss) ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో షూటర్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయని భావిస్తున్నారు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ వివో ఫోన్ 7,200mAh బ్యాటరీ, 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది.
వివో S2 FE :
వివో S2 ఎఫ్ఈ కూడా వివో V80తో పాటు అక్టోబర్ 6, 2026న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 10,000mAh బ్యాటరీతో పాటు 44W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని అంచనా. ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300E ప్రాసెసర్ ఉంటుందని అంచనా.
ఒప్పో F35 ప్రో :
వచ్చే అక్టోబర్ నెలలో ఒప్పో F35 ప్రో ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ సంబంధించి అనేక లీకులు వినిపిస్తున్నాయి. గతంలో లీక్ ప్రకారం.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్, 10,000mAh బ్యాటరీ ఉండవచ్చు. అయితే, మరో లీక్ ప్రకారం.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్‌తో పాటు 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ షూటర్ ఉండవచ్చని తెలుస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 70 నియో :
మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్‌లో ఎడ్జ్ 70 నియో అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇంకా ఈ మోటోరోలా నియోపై అధికారికంగా రివీల్ చేయలేదు. లీకుల ప్రకారం.. అతి త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో 200MP ప్రైమరీ లెన్స్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా.
