Upcoming smartphones
Upcoming smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఏప్రిల్ 2025లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. ఈ కొత్త ఫోన్ల కోసం టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఇప్పటికే అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించాయి. మోటో, పోకో వంటి మొబైల్ కంపెనీలు తమ లాంచ్ ప్లాన్‌లను ధృవీకరించాయి.
స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఆకర్షణీయమైన స్పెషిఫికేషన్లతో అందించనున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ఈ ఏప్రిల్ నెలలో రాబోయే స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో పోకో C71, మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, వివో T4 5G సహా ఇతర ఫోన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Read Also : Vivo T4x 5G : అబ్బా.. భలే డిస్కౌంట్.. రూ. 21వేల వివో 5G ఫోన్ కేవలం రూ. 15వేలు లోపే.. ఇలా కొన్నారంటే?
పోకో C71 :
పోకో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి పోకో C71తో కొత్త ఫోన్‌ను లాంచ్‌కు రెడీగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ TUV సర్టిఫికేషన్‌తో కలిపి 6.88-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రీమియం స్ప్లిట్ గ్రిడ్ డిజైన్‌తో రానుంది. ముఖ్యంగా, పోకో C71 భారత మార్కెట్లో ఏప్రిల్ 4, 2025న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.
మోటరోలా Edge 60 ఫ్యూజన్ :
మోటరోలా లేటెస్ట్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారత మార్కెట్లో ఏప్రిల్ 2, 2025న ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ల్యాండింగ్ పేజీ ప్రకారం.. రాబోయే మోటో ఎడ్జ్ 60 మోడల్ 1.5K ఆల్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ఉంటుంది.
కెమెరా పరంగా, మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 50MP సోనీ LYT 700 ప్రైమరీ సెన్సార్, 13MP సెకండరీ లెన్స్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లీకైన ఫొటోల్లో థర్డ్ మూడవ కెమెరాను సూచిస్తున్నాయి. అయితే, స్పెసిఫికేషన్లు ఇంకా తెలియలేదు. సెల్ఫీల కోసం హ్యాండ్‌సెట్‌లో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుందని భావిస్తున్నారు.
వివో T4 5G :
మార్చి 2024లో వచ్చిన వివో T3 5G ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా Vivo T4 5G ఫోన్ రాబోతుంది. భారత మార్కెట్లోకి ఈ 5G ఫోన్ ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో T4 5G అద్భుతమైన ఫీచర్లలో 6.67-అంగుళాల Full-HD+ అమోల్డ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. హుడ్ కింద స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుందని భావిస్తున్నారు.
ఐక్యూ Z10 5G ఫోన్ :
స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. ఐక్యూ Z10 రెండు స్టోరేజ్ వేరియంట్ (128GB, 256GB)లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999 నుంచి ఉండవచ్చు. రూ. 2వేలు బ్యాంక్ ఆఫర్‌తో లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 19,999కి తగ్గవచ్చు. ఐక్యూ Z10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు.
Read Also : iPhone 16 : బిగ్ డిస్కౌంట్.. రూ.80వేల ఐఫోన్ 16 కేవలం రూ.44వేలకే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు!
పోకో F7 అల్ట్రా :
పోకో లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ F7 అల్ట్రాను టాప్ రేంజ్ ప్రాసెసర్‌లు, IP68 రేటింగ్, 50MP ప్రైమరీ సెన్సార్‌తో గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసమే ప్రవేశపెట్టినప్పటికీ ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పోకో F7 అల్ట్రా లాంచ్ అయితే.. అది కూడా 6.67 అంగుళాల 2K 12-బిట్ అమోలెడ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటుంది. పోకో F7 అల్ట్రా గ్లోబల్ వేరియంట్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. భారత మార్కెట్లో కూడా ఇలాంటి చిప్‌సెట్‌తోనే పోకో F7 అల్ట్రా ఫోన్ వచ్చే అవకాశం ఉంది.