Upcoming Smartphones in July : కొత్త ఫోన్ కొంటున్నారా? జూలైలో రాబోయే సరికొత్త 5G ఫోన్లు ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!

Upcoming smartphones in July : జూలై 2023లో భారత మార్కెట్లో OnePlus Nord 3, Realme Narzo 60 సిరీస్, నథింగ్ ఫోన్ (2), శాంసంగ్ గెలాక్సీ M34, iQOO నియో 7 ప్రోతో సహా అనేక 5G ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Upcoming smartphones in India this July_ Nothing Phone (2), Samsung Galaxy M34, Realme Narzo 60 series and more

Upcoming smartphones in July : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే జూలైలో సరికొత్త 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత మార్కెట్లో OnePlus Nord 3, Realme Narzo 60 సిరీస్, iQOO నియో 7 ప్రోతో సహా అనేక 5G ఫోన్‌లను లాంచ్ కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ M34 ఫోన్ జూలై 7న లాంచ్ అవుతుందని శాంసంగ్ ధృవీకరించింది. అయితే, నథింగ్ ఫోన్ (2) జూలై 11న రానుంది. రాబోయే బెస్ట్ 5G ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోందాం..

వన్‌ప్లస్ నార్డ్ 3 సిరీస్ :
జూలై 2023లో (OnePlus) నుంచి OnePlus Nord 3ని లాంచ్ చేయనుంది. లీకైన నివేదికల ప్రకారం.. డివైజ్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. వన్‌ప్లస్ Nord 3 హై-ఎండ్ చిప్‌సెట్‌తో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 30వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి నార్జో 60 సిరీస్ :
రియల్‌మి నార్జో 60 సిరీస్ ఫోన్ 1TB స్టోరేజ్ కెపాసిటీతో రానుంది. ఈ కొత్త నార్జో ఫోన్‌ జూలై 2023లో లాంచ్ చేసేందుకు రియల్‌మి సన్నాహాలు చేస్తోందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు. ఈ 5G ఫోన్‌లో యూజర్లురూ. 2లక్షల 50వేల కన్నా ఎక్కువ ఫొటోలను స్టోర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని కంపెనీ పేర్కొంది. అయితే, డివైజ్‌కు సంబంధించిన నిర్దిష్ట వివరాలు ప్రస్తుతానికి తెలియవు.

Read Also : Itel A60s Smartphone : రూ. 7వేల లోపు ధరలో ఐటెల్ A60s ఫస్ట్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

నథింగ్ ఫోన్ (2) :
నథింగ్ ఫోన్ (2) లాంచ్ జూలై 2023లో లాంచ్ కానుంది. Qualcomm హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8+Gen 1 చిప్‌సెట్‌తో రానుంది. రాబోయే ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే, 4,700mAh బ్యాటరీ, కొత్త లైట్/సౌండ్ సిస్టమ్‌, ప్రత్యేకమైన బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ధర పరంగా చూస్తే.. నథింగ్ ఫోన్ (2) భారత మార్కెట్లో రూ. 40వేల నుంచి రూ. 45వేల పరిధిలో ఉంటుందని అంచనా.

Upcoming smartphones in India this July_ Nothing Phone (2), Samsung Galaxy M34, Realme Narzo 60 series and more

శాంసంగ్ గెలాక్సీ M34 :
శాంసంగ్ గెలాక్సీ M34ని జూలై 2023లో లాంచ్ చేయనున్నట్లు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. రాబోయే ఫోన్ 120Hz డిస్‌ప్లే, శక్తివంతమైన 6,000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ సెన్సార్‌తో రానుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని భావిస్తున్నారు. ముఖ్యంగా, కెమెరా మాడ్యూల్ స్టేబుల్ వీడియో రికార్డింగ్‌ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని, MediaTek Dimensity 1080 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుందని లీకైన నివేదికలు సూచిస్తున్నాయి.

ఐక్యూ నియో 7 ప్రో :
ఐక్యూ నియో (iQOO Neo 7 Pro) సిరీస్ ఫోన్ 6.78-అంగుళాల FHD+ Samsung E5 AMOLED డిస్‌ప్లేతో జూలై 2023లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించనుంది. పవర్‌ఫుల్ చిప్‌సెట్ కారణంగా ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. iQOO నియో 7 ప్రో శాంసంగ్ GN5 సెన్సార్‌ను ఉపయోగించి OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండవచ్చు. భారత మార్కెట్లో iQOO Neo 7 Pro ధర రూ. 40వేల లోపు ఉంటుందని అంచనా.

Read Also : MG Motor India : ఎంజీ డెవలపర్ ప్రోగ్రామ్ సీజన్ 4.0 విజేతలుగా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలు..!