MG Motor India : ఎంజీ డెవలపర్ ప్రోగ్రామ్ సీజన్ 4.0 విజేతలుగా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలు..!

MG Motor India : విద్యుత్ వాహన రంగంలో వినూత్నతను ప్రోత్సహిస్తోన్న ఎంజీ మోటర్ ఇండియా (MGDP 4.0) నిర్వహించిన కార్యక్రమంలో రెండు హైదరాబాద్ స్టార్ట్అప్స్ విజేతలుగా నిలిచాయి.

MG Motor India : ఎంజీ డెవలపర్ ప్రోగ్రామ్ సీజన్ 4.0 విజేతలుగా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలు..!

MG Motor India announces winners of MG Developer Program season 4.0

Updated On : June 29, 2023 / 6:53 PM IST

MG Motor India : 99ఏళ్ల వారసత్వంతో బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా, MG డెవలపర్ ప్రోగ్రామ్, (MGDP 4.0)లో తుది విజేతలను ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన రెండు స్టార్ట్అప్ సంస్థలు అద్భుతమైన ఐడియాలతో విజేతలుగా నిలిచాయి. అందులో ఒకటి సెంటార్ ఆటోమోటివ్ (Centaur Automotive) కాగా, మరొకటి ఆంప్లిఫై క్లీన్‌టెక్ సొల్యూషన్స్ (Amplify Cleantech Solutions) అనే స్టార్టప్ కంపెనీ విజేతగా నిలిచింది. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్నోవేట్ ఫర్ ఇండియా’ అనే థీమ్‌తో స్టార్ట్అప్స్, డెవలపర్లు, ఇన్నోవేటర్ల కోసం మెరుగైన ఇన్నోవేషన్ వేదికను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ఈ MGDP 4.0 కార్యక్రమంలో పాల్గొనేవారు విద్యార్థులు, ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు 250కి పైగా ఎంట్రీలను స్వీకరించారు. అందులో 88 ఎంట్రీలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. మే 17 నుంచి మే 18 తేదీల్లో జరిగిన వర్చువల్ జ్యూరీ రౌండ్‌లకు ఎంపిక అయిన టాప్ 14 జట్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ జట్లలో 6గురు విజేతలుగా నిలిచారు. ఇందులో, హైదరాబాద్ చెందిన రెండు స్టార్ట్అప్‌లతో పాటు, బెంగళూరు, గుర్గావ్, ముంబైకి చెందిన 4 స్టార్టప్ సంస్థలు ఉన్నాయి.

Read Also : Nothing Phone 2 Pre-order : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) ప్రీ-ఆర్డర్ మొదలైందోచ్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

ఎంజి మోటర్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. ఎంజీ మోటార్ ఇండియా ఒక బ్రాండ్‌గా గ్రీన్ మొబిలిటీపై దృష్టి సారిస్తూ వచ్చింది. MGDP 4.0 బ్రాండుగా వినూత్న ఆలోచలనలను ప్రోత్సహిస్తాం. ఈ సీజన్లో పాల్గొన్న బృందాలలో 30శాతానికి పైగా ఉండగా.. వారిలో కనీసం ఒక మహిళా వ్యవస్థాపకులు ఉండటం చాలా సంతోషకరమైన విషయం’ అని అన్నారు.

MG Motor India announces winners of MG Developer Program season 4.0

MG Motor India announces winners of MG Developer Program season 4.0

స్టార్టప్ ఇండియా అధినేత ఆస్థా గ్రోవర్ మాట్లాడుతూ.. ‘ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్ట్అప్ సంస్థలు తమ వినూత్నతను ప్రదర్శించడానికి సమస్యా పరిష్కారంలో కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఇలాంటి నిమగ్నతా కార్యక్రమాలు చాలా అవసరం. క్లీన్ ఎనర్జీ పట్ల నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌తో విద్యుత్ వాహనాలు ఈ రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అత్యాధునిక టెక్నాలజీలతో పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో స్టార్ట్అప్ సంస్థలు ముందవరుసలో నిలుస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

రాబోయే జనరేషన్ ఇన్వోవేటర్లు, ఔత్సాహికవేత్తలకు మద్దతుకై అనేక టాప్ సంస్థల సహకార సమన్వయంతో MGDP 4.0 ప్రారంభించారు. ఇందులో భాగంగా అనేకమంది డెవలపర్లు, ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థల సహకారంతో ఎంజి మోటర్, ఇన్వెస్ట్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ప్రధాన పరిశ్రమ సంస్థలు, Jio-BP, Exicom, Fortum, Attero, MapmyIndia, Bosch వంటి అగ్రగామి టెక్నాలజీ దిగ్గజాలతో చేతులు కలిపింది. ఈ కార్యక్రమంలో 4 ఛార్జింగ్ మౌలిక సదుపాయాల స్టార్ట్అప్ సంస్థలు, 2 EV OEM స్టార్ట్అప్ సంస్థలు, 8 సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) ప్రొవైడర్లు పాల్గొన్నారు.

Read Also : Itel A60s Smartphone : రూ. 7వేల లోపు ధరలో ఐటెల్ A60s ఫస్ట్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?