Youtube Ad Blockers : యూట్యూబ్‌కు షాకిచ్చిన యూజర్లు.. వీడియోలు చూసేందుకు ఈ యాడ్ బ్లాకింగ్ టూల్స్ తెగ వాడుతున్నారు!

Youtube Ad Blockers : యాడ్-బ్లాకర్లపై యూట్యూబ్ ఇటీవలే కొత్త ఫీచర్ ఎనేబుల్ చేసింది. అదే అనేక మంది వినియోగదారులను యాడ్స్ నిరోధించడానికి కొత్త మార్గాలను వెతకడానికి దారితీసింది. కొందరు యాడ్-బ్లాకర్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయగా, మరికొందరు యాడ్-బ్లాకింగ్ ఆప్షన్లను ఉపయోగిస్తున్నారు.

Youtube Ad Blockers : యాడ్-బ్లాకర్లపై యూట్యూబ్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే యూజర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవలి యూట్యూబ్ తీసుకొచ్చిన ఫీచర్‌తో అనేక మంది వినియోగదారులను యాడ్స్ బ్లాక్ చేయడానికి కొత్త మార్గాలను వెతకడానికి దారితీసింది. యూట్యూబ్ ప్రయత్నాల కారణంగా కొందరు యాడ్-బ్లాకర్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయగా, మరికొందరు మరింత ప్రభావవంతమైన యాడ్-బ్లాకింగ్ ఆప్షన్లను ఉపయోగించడం ప్రారంభించారు.

యాడ్-బ్లాకర్లకు వ్యతిరేకంగా యూట్యూబ్ చిన్న క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచ ప్రయత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. నివేదిక ప్రకారం.. గత అక్టోబర్‌లో యూట్యూబ్ కఠినమైన వైఖరితో వందల వేల మంది వినియోగదారులు తమ యాడ్-బ్లాకర్లను బ్రౌజర్ నుంచి తొలగించారు. అదే సమయంలో, యూట్యూబ్ ఆపలేని యాడ్స్ బ్లాక్ చేసే అల్ట్రానేట్ టూల్స్ ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు.

Read Also : YouTube New Watch Page : యూట్యూబ్‌లో కొత్త న్యూస్ స్టోరీ ఫీచర్.. మీకు నచ్చిన కంటెంట్ ఈజీగా చదువుకోవచ్చు..!

30శాతం పెరిగిన యాడ్ బ్లాకింగ్ టూల్స్ :

ప్రముఖ క్రోమ్ (Google Chrome) యాడ్-బ్లాకర్ అయిన (Ghostery) గత నెలలో యూజర్‌లు ఇన్‌స్టాల్ చేయడం, అన్‌ఇన్‌స్టాల్ చేయడం 3 నుంచి 5 రెట్లు పెరిగింది. ఘోస్టరీని తీసివేసిన వారిలో 90శాతం మంది యూట్యూబ్‌లో సరిగ్గా పని చేయలేదని చెప్పారు. కానీ, వినియోగదారులు మెరుగైన ఆప్షన్లను కోరుకోవడంతో (Microsoft Edge)లో Ghostery ఇన్‌స్టాలేషన్‌లు 30శాతం పెరిగాయి.

మరో యాడ్-బ్లాకర్, (AdGuard), సాధారణంగా క్రోమ్‌లో దాదాపు 6వేల మంది యూజర్లు అన్‌ఇన్‌స్టాల్ చేశారు. కానీ, అక్టోబర్ 9 నెలాఖరు మధ్య రోజుల్లో ఈ సంఖ్య ప్రతిరోజూ 11వేలకి చేరుకుంది. అక్టోబర్ 18న గరిష్టంగా 52వేలకు చేరుకుంది. ఆసక్తికరంగా, యాడ్‌గార్డ్ పేమెంట్ వెర్షన్.. ఇప్పటికీ యూట్యూబ్‌కు వర్క్ అవుతుంది. అక్టోబర్ 18, అక్టోబర్ 27 తేదీలలో 60వేల క్రోమ్ యాడ్ బ్లాకర్ ఇన్‌స్టాలేషన్‌లతో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించింది.

YouTube ad-blocking tools

యాడ్-బ్లాకర్లపై యూట్యూబ్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వినియోగదారులు మెరుగైన ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు యాడ్స్ లేకుండా వీడియోలను చూపించే యూట్యూబ్ లాంటి వెబ్‌సైట్ న్యూపైప్ (Newpipe) వైపు మొగ్గు చూపారు. ఘోస్టరీకి చెందిన క్రిజ్‌టోఫ్ మోడ్రాస్ వంటి నిపుణులు యూట్యూబ్ చర్యలు మరింత సంక్లిష్టమైన యాడ్-బ్లాకింగ్ వ్యూహాలకు అనాలోచిత భద్రతా సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

యూట్యూబ్ యూజర్లకు ఇప్పటికే యాడ్ బ్లాకింగ్‌పై వార్నింగ్ మెసేజ్‌లను ప్రదర్శిస్తోంది. 3 వీడియోల వీక్షించిన తర్వాత వీడియో ప్లేయర్ బ్లాక్ అవుతుంది. వెంటనే.. మీరు యాడ్ బ్లాకర్‌ని ఉపయోగిస్తున్నట్లు స్ర్కీన్‌పై కనిపిస్తోంది. యూట్యూబ్ అనుమతించడం లేదా యాడ్ బ్లాకర్ డిసేబుల్ చేయడం చేస్తే వీడియో ప్లేబ్యాక్ బ్లాక్ అవుతుంది. ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న వినియోగదారుల కోసం (uBlock Origin) వంటి ఎక్స్‌టెన్షన్స్ ఇప్పటికీ (Mozilla Firefox)లో వర్క్ చేస్తాయి.

యాడ్ బ్లాకర్లతో కాదు.. యూట్యూబ్ ప్రీమియం బెస్ట్  : 
యాడ్‌బ్లాక్ ప్లస్ యూట్యూబ్ యాంటీ-యాడ్-బ్లాక్ చర్యలను పొందడానికి కొన్ని టిప్స్ కూడా అందించింది. యాడ్-ప్రీ ఎక్స్‌పీరియన్స్ కోసం వినియోగదారులు యూట్యూబ్ ప్రీమియంకు సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచిస్తోంది. యాడ్-బ్లాకర్లకు వ్యతిరేకంగా యూట్యూబ్ పోరాటం మరింత మంది వినియోగదారులు మెరుగైన యాడ్-బ్లాకింగ్ ఆప్షన్లను పొందడానికి కారణమైంది. వ్యూ ఎక్స్‌‌పీరియన్స్ కంట్రోల్ చేయడం, యూట్యూబ్ పరిమితులను అధిగమించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : YouTube Ad Blockers : ఆ యూజర్లకు షాకిచ్చిన యూట్యూబ్‌.. ఇలా చేస్తే వీడియోలను చూడలేరు.. వెంటనే బ్లాక్ చేస్తుంది జాగ్రత్త!

ట్రెండింగ్ వార్తలు