×
Ad

Vi vs Jio vs Airtel : పండగ చేస్కోండి.. అత్యంత చౌకైన Vi, జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. చీపెస్ట్ బెస్ట్ ప్లాన్ ఏంటి? ఫుల్ డిటెయిల్స్..!

Vi vs Jio vs Airtel : రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ యూజర్ల కోసం అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

Vi vs Jio vs Airtel

Vi vs Jio vs Airtel : మొబైల్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. మీరు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్ అయితే ఇది మీకోసమే.. ఈ మూడు నెట్ వర్క్‌లలో ప్రస్తుతం వివిధ రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అత్యంత సరసమైన ధరకే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కాల్స్, SMS, క్లౌడ్ స్టోరేజ్, 5G కనెక్టివిటీ OTT సబ్‌స్క్రిప్షన్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ రీఛార్జ్ ప్లాన్లలో బెస్ట్ ప్లాన్‌ను ఏది కావాలో (Vi vs Jio vs Airtel) ఎంచుకోవడం కొద్దిగా కష్టమే. అయినప్పటికీ ఈ జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ. 349 :
రిలయన్స్ జియో ప్రైమరీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ధర రూ. 349కు పొందవచ్చు. 30GB రియల్ 5G డేటాను అందిస్తుంది. 100 SMS బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ అందిస్తుంది. 30GB లిమిట్ దాటిన తర్వాత డేటా 1GBకి రూ. 10 చొప్పున బిల్ అవుతుంది. మీరు ట్రూ 5G లొకేషన్‌లో ఉంటే జియో అన్‌లిమిటెడ్ 5G బ్యాండ్‌విడ్త్‌ ఫ్రీగా అందిస్తుంది.

తరచుగా ఇంటర్నెట్ ఉపయోగించే వారికి బెస్ట్ ప్లాన్. JioTV, JioAICloud, JioHotstarకి 3 నెలల సబ్‌స్క్రిప్షన్ అన్నీ ప్యాకేజీలో పొందవచ్చు. రూ. 35,100 ఖరీదు చేసే గూగుల్ జెమిని ప్రో ప్లాన్ 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల కస్టమర్లకు 18 నెలల పాటు ఉచితంగా అందిస్తుంది. జియో ప్లాన్‌ను యువ యూజర్లకు అత్యంత చౌకైన ప్లాన్ అని చెప్పొచ్చు.

Read Also : Sukanya Samriddhi Yojana : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. మీ పిల్లల చదువు, పెళ్లి నాటికి రూ. 72 లక్షలు సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే?

రూ. 449 ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ అందించే అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్. నెలకు రూ. 449 చెల్లించాలి. ప్రతిరోజూ 100 SMS, అన్‌లిమిటెడ్ లోకల్, STD రోమింగ్ కాల్స్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రతి నెలా 50GB 5G డేటాను అందిస్తుంది. వాడని ఏదైనా డేటాను తర్వాత నెలకు ఫార్వర్డ్ అవుతుంది.

ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ (Xstream Play) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఫొటోలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌ను చూడవచ్చు. అలాగే, ఫ్రీ హలో ట్యూన్స్, పెర్ప్లెక్సిటీ ప్రో యాక్సెస్, 100GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్‌ అందిస్తుంది. OTT క్లౌడ్ బ్యాకప్ కోరుకునే వారికి ఈ ప్యాకేజీ బెస్ట్ అని చెప్పొచ్చు.

రూ. 451కి Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా 3 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అత్యంత ఖరీదైనది. రూ. 451 వోడాఫోన్ ఐడియా (Vi Max) ప్యాకేజీ.. 50GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది. 5G డేటాను కూడా పొందవచ్చు. ఏడాది వరకు JioHotstar, SonyLiv మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఒక ఏడాది Norton మొబైల్ సెక్యూరిటీ, మూడు నెలల Vi మూవీస్, టీవీ (Zee5, SonyLiv JioHotstar) యాక్సెస్‌ చేయొచ్చు.