Vivo S50 Pro Mini
Vivo S50 Pro Mini : వివో అభిమానులు గెట్ రెడీ.. వివో నుంచి మరో సరికొత్త ఫోన్ రాబోతుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన వివో అతిత్వరలో వివో S50 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. వివో S50తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో వివో S50 ప్రో మినీ కూడా లాంచ్ చేయనుంది.
వివో S30 ప్రో మినీ స్థానంలో వివో S50 ప్రో మినీ రానుంది. ఇందులో LPDDR5x ర్యామ్ ఉంటుంది. వివో ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బాక్సియావో, వివో S50 ప్రో మినీలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉంటుందని చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ పేర్కొంది. అన్‌టుటు బెంచ్‌మార్కింగ్ టెస్టింగ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు 3 మిలియన్ పాయింట్లను అందుకుంది. వచ్చే నెలలో వివో S50 సిరీస్ చైనాలో లాంచ్ కానుంది.
వివో S50 ప్రో మినీ 512GB వరకు స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వివో S50 ప్రో మినీ 6.3-అంగుళాల ఫ్లాట్ స్క్రీన్ కలిగి ఉండవచ్చునని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ఆపిల్ నుంచి ఇటీవల లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ డిస్‌ప్లేతో వస్తుంది.
Read Also : OnePlus 13R : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13R డీల్ అదిరింది బ్రో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!
భారీ బ్యాటరీ, కెమెరా ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ మాదిరి కెమెరా మాడ్యూల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అవకాశం ఉంది. 50MP సోనీ IMX9 సిరీస్ ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా ఉండొచ్చు. వివో X300 FE ఈ స్మార్ట్‌ఫోన్ పేరుతో లాంచ్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. వివో S50 ప్రో మినీ బ్యాటరీ 6,500mAh కావచ్చు.
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండవచ్చు. వివో S50 ప్రో మినీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల OLED 1.5K స్క్రీన్ ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ట్రిపుల్ బ్యాక్ కెమెరా రేంజ్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. ఫొటోలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉండవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కలిగి ఉండవచ్చు. వివో S50లో 1.5K రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల OLED డిస్‌ప్లే ఉండొచ్చు. మూడో త్రైమాసికంలో వివో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ ప్లేసులో నిలిచింది. వరుసగా ఏడో త్రైమాసికంలో వివో అత్యధిక ఫోన్‌లను షిప్ చేసింది.
రాబోయే వివో S50 ప్రో మినీ ఫోన్ ఈ ఏడాది మేలో చైనాలో లాంచ్ అయిన వివో S30 ప్రో మినీ కన్నా భారీ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర CNY 3,499 ప్రారంభ ధర వద్ద
లభ్యమవుతుంది. భారత ధర రూ. 41,990 ఉంటుందని అంచనా.