OnePlus 13R : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13R డీల్ అదిరింది బ్రో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!

OnePlus 13R : వన్‌ప్లస్ ఫోన్ అతి తక్కువ ధరకే వస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఇంతకీ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

OnePlus 13R : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13R డీల్ అదిరింది బ్రో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!

OnePlus 13R

Updated On : November 22, 2025 / 7:14 PM IST

OnePlus 13R : వన్‌ప్లస్ అభిమానులకు అదిరే ఆఫర్.. వన్‌ప్లస్ 15R లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ 13R ధర భారీగా తగ్గింది. చైనీస్ టెక్ దిగ్గజం మిడ్-రేంజ్ ఫోన్ వన్‌ప్లస్ 13R మోడల్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ ఫోన్ ఇప్పుడు రూ. 37వేల కన్నా తక్కువ (OnePlus 13R) ధరకు లభ్యమవుతోంది. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్. ఇలాంటి ఆఫర్‌లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 13R ఫ్లిప్‌కార్ట్ డీల్
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13R ఫోన్ రూ.42,999కి లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ రూ.38,540కి లిస్ట్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.3,525 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ధరను మరింత తగ్గించవచ్చు.

Read Also : PAN Aadhaar Link : డెడ్‌లైన్ దగ్గరపడుతోంది మిత్రమా.. అర్జెంట్‌గా మీ ఆధార్-పాన్ లింక్ చేసుకోండి.. సెప్ట్ బై స్టెప్ గైడ్..!

ఎందుకంటే.. ఈ ప్లాట్‌ఫామ్ అదనంగా రూ.1,927 తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్‌తో ధర రూ.36,613కి తగ్గుతుంది. మొత్తం రూ.6,386కి ఆదా అవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆప్షన్ పొందవచ్చు. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ కండిషన్, మోడల్‌ను బట్టి ఫైనల్ ధర తగ్గవచ్చు.

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13R ఫోన్ 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. 6000mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది.

80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP65 రేటింగ్‌ కూడా కలిగి ఉంది. వన్‌ప్లస్ 13Rలో కెమెరా ఫ్రంట్ సైడ్ 50MP మెయిన్ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో సెన్సార్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.