Vivo T2 5G Launch : ఏప్రిల్ 11న వివో T2 5G ఫోన్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు అదుర్స్, ధర ఎంత ఉండొచ్చుంటే?
Vivo T2 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి సరికొత్త 5G మోడల్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 11న (మంగళవారం) అధికారికంగా భారత మార్కెట్లో Vivo T2 5G ఫోన్ లాంచ్ కానుంది. 64MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఇక 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo T2 5G Confirmed to Launch With 64-Megapixel Main Camera, Check Full Details
Vivo T2 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త Vivo T2 5G ఫోన్ వస్తోంది. ఈ 5G ఫోన్ ఏప్రిల్ 11న అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే 64MP మెయిన్ కెమెరా ఉందని లీక్ అయింది. రాబోయే (Vivo T2) లైనప్‌తో T-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ విస్తరిస్తోంది.
ఈ ఫోన్ కోసం ల్యాండింగ్ పేజీ ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ డిస్ప్లేతో పాటు కెమెరా స్పెసిఫికేషన్‌ల వంటి కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. రాబోయే 5G ఫోన్.. గత ఏడాది (2022) ఫిబ్రవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయిన Vivo T1 5G ఫోన్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. Vivo T2 5G ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేతో పాటు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.
Read Also : Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
ఫ్లిప్‌కార్ట్ ల్యాండింగ్ పేజీలో షేర్ చేసిన వివరాల ప్రకారం.. వివో T2 5G భారత మార్కెట్లో ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే వివో T2 5G ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్‌లతో పాటు ఇతర వివరాలు ల్యాండింగ్ పేజీ ద్వారా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ OIS సపోర్టుతో 64-MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 2MP బోకె కెమెరా కూడా ఉంటుంది.

Vivo T2 5G Confirmed to Launch With 64-Megapixel Main Camera, Check Full Details
అదనంగా, (Flipkart) ల్యాండింగ్ పేజీ కూడా ఫోన్ 1300nits పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 6000000:1 కాంట్రాస్ట్ రేషియోతో పాటు Full-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని వెల్లడించింది. వివో T2 5G స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా అందించనుంది. ఈ ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ V2240తో కనిపించింది.
సింగిల్-కోర్‌లో ఫోన్ 678 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టుల్లో 1,933 పాయింట్లను స్కోర్ చేసిందని లిస్టింగ్ సూచించింది. 5.33GB RAMతో కనిపించింది. ఈ ఫోన 6GBకి వరకు విస్తరించుకోవచ్చు. వివో T2 5G పైన కస్టమ్ UIతో ఆండ్రాయిడ్ 13 రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ఉండగా, 8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. వివో T1 5G ఫోన్ 6.58-అంగుళాల Full-HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. 50-MP మెయిన్ బ్యాక్ కెమెరాను కూడా కలిగి ఉంది.
Read Also : Vivo T2 5G Series : భారత్‌కు వివో T2 5G సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!