Vivo T3 5G Launch : నార్జో 70ప్రో, ఐక్యూ z9కు పోటీగా కొత్త వివో T3 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Vivo T3 5G Launch : భారత మార్కెట్లోకి కొత్త వివో 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి నార్జో 70ప్రో 5జీ, ఐక్యూ జెడ్9 5జీలకు పోటీదారుగా మార్కెట్లోకి వచ్చింది.

Vivo T3 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఎట్టకేలకు భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ (Vivo T3) లాంచ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉన్న ఫోన్లలో ఇదే సరసమైన ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన హై-ఎండ్ వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో మోడల్స్ మాదిరిగానే ఫీచర్లు ఉన్నాయి.

మిడ్-టైర్ వివో వి30, వి30 ప్రో ఈ నెలలోనే లాంచ్ అయ్యాయి. వివో టీ3 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ చిప్‌సెట్, 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్822 ప్రైమరీ కెమెరా, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సహా ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది. వివో సెగ్మెంట్‌లో ఫాసెస్ట్ ఫోన్‌ ఇదే. వివో టీ3 ధర, స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Samsung Galaxy M55 5G : శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే కలర్ ఆప్షన్లు లీక్..

వివో టీ3 5జీ ధర వివరాలివే :
భారత మార్కెట్లో కొత్త వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్ (8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ) వేరియంట్‌ ప్రారంభ ధర రూ.19,999 వద్ద అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ హై స్టోరేజ్ వెర్షన్ ధర రూ.21,999కు కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ అనే 2 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ అధికారిక వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఈ 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు అదే మొత్తంలో అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్, 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

వివో టీ3 5జీ స్పెసిఫికేషన్లు :
వివో టీ3 5జీ ఫోన్ 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1800నిట్స్ గరిష్ట ప్రకాశం ఉంటుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7200 5జీ ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ డివైజ్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్822 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 4కె వీడియో రికార్డింగ్, 2ఎక్స్ పోర్ట్రెయిట్ జూమ్, ఫోటోగ్రఫీకి సూపర్ నైట్ మోడ్ ఉన్నాయి.

ఫొటో క్వాలిటీని పెంచడానికి 2ఎంపీ బోకె లెన్స్, ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. హై-రిజల్యూషన్ సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 44డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీతో 5000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ v14 ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది. వివో టీ3 5జీ స్పెసిఫికేషన్‌లలో భారీ బ్యాటరీ, హై-డెఫినిషన్ డిస్‌ప్లే, కెమెరా సిస్టమ్ ఉన్నాయి.

నార్జో 70ప్రో, ఐక్యూ జెడ్9 ఫోన్లకు పోటీగా :
అంతేకాదు.. వివో టీ3 5జీ ఫోన్ రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ, ఐక్యూ జెడ్9 5జీ ఫోన్లకు పోటీగా వస్తుంది. వివో సిస్టర్ కంపెనీ ఐక్యూ బ్రాండ్ ఫోన్ Z9 5జీ ఫోన్‌కు కూడా పోటీగా నిలుస్తోంది. ఈ రెండు డివైజ్‌ల ధర రూ. 19,999తో ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో మరో పోటీదారు ఇటీవలే లాంచ్ చేసిన రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్‌సెట్, ఎయిర్ గెచర్స్ కంట్రోల్, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది.

Read Also : WhatsApp Voice to Text Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ టెక్స్ట్‌లోకి మార్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు