WhatsApp Voice to Text Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ టెక్స్ట్‌లోకి మార్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Voice to Text Feature : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ వస్తోంది. వాట్సాప్ వాయిస్ నోట్‌‌ను ఈజీగా టెక్ట్స్ మెసేజ్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వాయిస్ నోట్ ప్లే చేయకుండానే మెసేజ్ మాదిరిగా చదువుకోవచ్చు.

WhatsApp Voice to Text Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ టెక్స్ట్‌లోకి మార్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp might soon let you convert voice messages into text

WhatsApp Voice to Text Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే అనేక సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం అతి త్వరలో అందుబాటులోకి తేనుంది. అదే.. వాయిస్ మెసేజ్ టు టెక్స్ట్ (Voice to Text) కన్వర్ట్ ఫీచర్. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ఉదాహరణకు.. మీ స్నేహితుడు మీకు వాట్సాప్‌లో వాయిస్ నోట్ పంపినప్పుడు మీరు ఏమి చేస్తారు.. వెంటనే ప్లే చేస్తారు. వాయిస్ ద్వారా విషయాన్ని తెలుసుకుంటారు.

Read Also : Whatsapp UPI Payments : యూపీఐ పేమెంట్ స్కాన్ : త్వరలో వాట్సాప్ చాట్స్ నుంచే నేరుగా యూపీఐ పేమెంట్లు!

అదే మీరు ఏదైనా అత్యవసరమైన పనిలో ఉన్నారు లేదా ఏదైనా ముఖ్యమైన సమావేశానికి హాజరవుతున్నారు? వాయిస్ నోట్ ముఖ్యమైనది అని మీకు తెలిసినప్పుడు.. ఎలా చదవడం.. అందుకే ఇలాంటి సందర్భాల్లో వాయిస్ నోట్ కూడా సింపుల్‌గా టెక్స్ట్ మెసేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ ‘వాయిస్ టు టెక్స్ట్ మెసేజ్ కన్వర్ట్’ ఫీచర్‌పై పనిచేస్తోంది.

ఇటీవలి నివేదిక ప్రకారం.. వాట్సాప్ త్వరలో వాయిస్ నోట్‌లను టెక్స్ట్‌గా మార్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. తద్వారా మీరు వాయిస్ నోట్‌లో ఉన్న వాటిని ప్లే చేయకుండానే ఈజీగా చదవవచ్చు. ఈ ఫీచర్ మొదట్లో ఐఓఎస్ యూజర్లకు అందించింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ఈ ఫీచర్‌కి యాక్సెస్ పొందవచ్చు.

టెస్టింగ్‌లో ఆండ్రాయిడ్ వెర్షన్ :
వాట్సాప్ (WABetaInfo) నివేదిక ప్రకారం.. వాయిస్ నోట్‌ ప్లే చేయడానికి వినియోగదారులకు వాట్సాప్ ఇటీవల ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఐఓఎస్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యూజర్లు వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మార్చడంలో సాయపడుతుంది. తద్వారా ఆడియో ప్లేబ్యాక్‌తో సవాళ్లను ఎదుర్కొనే లేదా టెక్స్ట్-ఆధారిత మెసేజ్‌లను ఇష్టపడే యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఐఓఎస్ వాట్సాప్‌లో ఈ ఫీచర్ సక్సెస్ అనంతరం వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అదే ఫీచర్ టెస్టింగ్ చేయడం ప్రారంభించిందని పేర్కొంది.

బీటా వెర్షన్‌లో ఫీచర్ :
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ (2.24.7.8)లో వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. తద్వారా వాయిస్ నోట్‌ను ప్లే చేయడంపై మాత్రమే ఆధారపడకుండా టెక్స్ట్ కంటెంట్‌ను చదవగలరు. యూజర్ల డివైజ్‌లో స్థానికంగా ట్రాన్స్‌క్రిప్ట్‌లను రూపొందించడానికి, ప్రైవసీ, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు ప్లాట్‌ఫారమ్ నిబద్ధతను కాపాడడానికి వాట్సాప్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని గమనించాలి.

150ఎంబీ స్టోరేజీ అవసరం :
ఈ ఫీచర్‌ ఉపయోగించడానికి, వాట్సాప్ యూజర్లు దాదాపు 150ఎంబీ అదనపు యాప్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి యూజర్లకు ఒక ప్రాంప్ట్ కూడా డిస్‌ప్లే అవుతుంది. ఫీచర్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అవుతుంది. కానీ, కొన్ని సందర్భాల్లో వినియోగదారులు ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి రావచ్చు.

కన్వర్టింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు కన్వర్ట్ చేయాలనుకునే మెసేజ్ కంటెంట్ ఎంచుకోండి. అప్పుడు ‘మీకు ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది’ అంటూ ఒక నోటిఫికేషన్ వస్తుంది. పరిమిత సంఖ్యలో బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉందని నివేదిక తెలిపింది. అయితే వాట్సాప్ త్వరలో ఈ ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లందరికి అందించనుంది.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒక నిమిషం వరకు వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌గా పెట్టుకోవచ్చు!