Samsung Galaxy M55 5G : శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే కలర్ ఆప్షన్లు లీక్..

Samsung Galaxy M55 5G : ఇప్పుడు ఈ కొత్త ఫోన్ లైవ్ ఫొటోలు లీక్ అయ్యాయి. చూస్తుంటే.. శాంసంగ్ కొత్త ఫోన్ కలర్ ఆప్షన్లు, బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. రాబోయే మోడల్‌ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లతో రానుందని లీక్ డేటా సూచిస్తోంది.

Samsung Galaxy M55 5G : శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే కలర్ ఆప్షన్లు లీక్..

Samsung Galaxy M55 5G May Launch in India Soon

Samsung Galaxy M55 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. అతి త్వరలో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M55 5జీ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, శాంసంగ్ కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌ను ధృవీకరించలేదు. కానీ, గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో చాలాసార్లు ఈ ఫోన్ కనిపించింది.

ఇప్పుడు టిప్‌స్టర్ ఈ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు సూచించింది. ఇప్పుడు ఈ కొత్త ఫోన్ లైవ్ ఫొటోలు లీక్ అయ్యాయి. చూస్తుంటే.. శాంసంగ్ కొత్త ఫోన్ కలర్ ఆప్షన్లు, బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. గతంలోనూ అనేక వెరిఫైడ్ సైట్‌లలో గుర్తించగా.. రాబోయే మోడల్‌ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లతో రానుందని లీక్ డేటా సూచిస్తోంది.

ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ :
టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ M55 5జీ ఫోన్ స్పెషల్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని పేర్కొన్నారు. రాబోయే ఈ 5జీ ఫోన్ బ్లూ, బ్లాక్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుందన్నారు.

Read Also : Realme Narzo 70 Pro : రియల్‌మి కొత్త నార్జో 70ప్రో వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు తెలుసా? ధర ఎంతంటే?

ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ సమయంలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. లీకైన ఫొటోలలో శాంసంగ్ గెలాక్సీ M55 5జీ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌ను చూడవచ్చు. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ మూడు వేర్వేరు వృత్తాకారాలలో కనిపిస్తోంది. కొద్దిగా పైకి లేచిన స్లాట్‌లు టాప్ లెఫ్ట్ కార్నర్‌లో వర్టికల్‌గా అమర్చి ఉంటాయి. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ మొదటి రెండు కట్‌అవుట్‌ల మధ్య కుడివైపు కొద్దిగా వంగి కనిపిస్తుంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ రైట్ ఎడ్జ్‌లో ఉన్నాయి.

డ్యూయల్ సిమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
శాంసంగ్ గెలాక్సీ M55 5జీ ఫోన్ ఇటీవలే డెక్రా సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించిందని ఓ నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ 4,855ఎంఎహెచ్ బ్యాటరీతో రానుందని లిస్టులో ఉంది. కానీ, సాధారణ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుందని ఇప్పటికే భావిస్తున్నారు. ఈ మోడల్ టీయూవీ ఎస్‌యూడీ సర్టిఫికేషన్ ఫోన్ 45డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్‌లో కూడా గుర్తించింది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీతో రానుంది.

నెమ్‌కో సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ (SM-M556E/DS)తో ఫోన్ కనిపించింది. ‘DS’ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో రానుందని నివేదిక పేర్కొంది. గతంలో శాంసంగ్ గెలాక్సీ M55 5జీ మోడల్ నంబర్ గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 SoC ద్వారా అడ్రినో (TM) 644 జీపీయూ, 8జీబీ ర్యామ్‌తో లిస్టింగ్ సూచించింది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐతో కూడా వచ్చే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M55 5జీ ఫోన్ మార్చి 2023లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M54 5జీ ఫోన్‌కు అప్‌గ్రేడ్‌గా రానుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో ఎక్సినోస్ 1380 ఎస్ఓసీ ద్వారా అందిస్తోంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే..
ఈ 5జీ ఫోన్‌లో 108ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8ఎంపీ సెన్సార్, బ్యాక్ సైడ్ 2ఎంపీ మాక్రో షూటర్, 32ఎంపీ సెన్సార్ ఉన్నాయి. ఫ్రండ్ సైడ్ ఈ హ్యాండ్‌సెట్‌కు 25డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంహెఎచ్ బ్యాటరీ కూడా ఉంది.

Read Also : CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు సెక్యూరిటీ వార్నింగ్.. మీ డివైజ్‌లను వెంటనే ప్రొటెక్ట్ చేసుకోండి!