Realme Narzo 70 Pro : రియల్‌మి కొత్త నార్జో 70ప్రో వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు తెలుసా? ధర ఎంతంటే?

Realme Narzo 70 Pro Launch : రియల్‌మి లేటెస్ట్ నార్జో సిరీస్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ ఫోన్ నార్జో 60 ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్.

Realme Narzo 70 Pro : రియల్‌మి కొత్త నార్జో 70ప్రో వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు తెలుసా? ధర ఎంతంటే?

Realme Narzo 70 Pro launched in India, price effectively starts from Rs 18,999

Realme Narzo 70 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. రియల్‌మి లేటెస్ట్ నార్జో సిరీస్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ ఫోన్ నార్జో 60 ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్. బడ్జెట్ ఫోన్‌లో హై-ఎండ్ ఫీచర్‌లతో గత ఏడాది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రియల్‌మి నార్జో 70 ప్రోతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 కెమెరాను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 70 ప్రో భారత్ ధర ఎంతంటే? :
రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ ఫోన్ మొత్తం గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వంటి రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ ధర విషయానికి వస్తే.. రియల్‌మి ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 19,999 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంటుంది.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

అయితే, రియల్‌మి బేస్ వేరియంట్‌పై రూ. 1,000 ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. హై స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ ప్రారంభ ధర రూ. 18,999కు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ మార్చి 22న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్ ఈరోజు (మార్చి 19) సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమవుతుంది.

రియల్‌మి నార్జో 70 ప్రో : టాప్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి నార్జో 70 ప్రో ఫ్లాట్-స్క్రీన్ డిజైన్‌తో స్లిమ్ బెజెల్స్, హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ వినియోగదారులు హారిజోన్ గ్లాస్ డిజైన్‌ను పొందవచ్చు. ఇందులోని సున్నితత్వాన్ని అందిస్తుంది. ముందున్న రియల్‌మి నార్జో 60 ప్రో వృత్తాకార కెమెరా ఐలండ్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ వినియోగదారులు 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఫిజికల్ టచ్ లేకుండానే ఫోన్ ఆపరేట్ చేయొచ్చు :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7050 5జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-జీ68 జీపీయూతో గేమింగ్, మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 2ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఫోన్‌లో మాస్టర్‌షాట్ అల్గోరిథం కూడా ఉంది. సెల్ఫీలు, వీడియోలకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 5000ఎంఎహెచ్ బ్యాటరీతో పాటు 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జ్‌తో వస్తుంది. రియల్‌మి నార్జో 70 ప్రో కూడా ఎయిర్ గెస్చర్ కంట్రోలింగ్‌తో వస్తుంది. అంటే..వినియోగదారులు ఫిజికల్ టచ్ లేకుండానే ఫోన్‌ను ఆపరేట్ చేయొచ్చు. ఈ ఫోన్ 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. అధిక వినియోగంతో కూడా డివైజ్ చాలా కూల్‌గా చల్లగా ఉంటుంది.

Read Also : CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు సెక్యూరిటీ వార్నింగ్.. మీ డివైజ్‌లను వెంటనే ప్రొటెక్ట్ చేసుకోండి!