Vivo T4 5G Launch Date
Vivo T4 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఈ నెలాఖరులో సరికొత్త వివో 5G ఫోన్ రాబోతుంది. వివో T4 5G ఫోన్ ఏప్రిల్ 22న లాంచ్ కానుంది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్, కలర్ ఆప్షన్లను కూడా టీజ్ చేసింది. ఈ ఫోన్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
మార్చి 2024లో దేశంలో ప్రవేశపెట్టిన వివో T3 5జీ కన్నా భారీ బ్యాటరీతో కూడా రానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వివో T4 5జీ ఫోన్ ధర కీలక ఫీచర్లు గతంలోనే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
వివో T4 5G భారత్ లాంచ్ :
భారత మార్కెట్లో వివో T4 5G ఫోన్ ఏప్రిల్ 22న లాంచ్ అవుతుందని కంపెనీ ఎక్స్ పోస్ట్‌లో ధృవీకరించింది. ప్రమోషనల్ పోస్టర్ సెంట్రలైజడ్, పెద్ద, వృత్తాకార బ్యాక్ కెమెరా మాడ్యూల్‌తో హ్యాండ్‌సెట్ డిజైన్‌ను సూచిస్తుంది.
ఈ రెండు కెమెరా సెన్సార్లు, ఎల్ఈడీ లైట్ యూనిట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఫోన్ గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. గత లీక్‌లలో వరుసగా ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే షేడ్స్‌గా మార్కెట్ చేయవచ్చునని సూచిస్తున్నాయి.
#GetSetTurbo and multitask in the blink of an eye with the new #vivoT4, coming in hot on 22nd April! #TurboLife is within your reach.
Know More – https://t.co/O732aX97oE#vivoT4 #GetSetTurbo #TurboLife #ComingSoon pic.twitter.com/pD5CV9CpnY
— vivo India (@Vivo_India) April 14, 2025
వివో T4 5G క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే చాలా సన్నని బెజెల్స్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా సెన్సార్ పైభాగంలో సెంట్రలైజడ్ హోల్-పంచ్ స్లాట్‌తో కనిపిస్తుంది. రైట్ ఎడ్జ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌ను కలిగి ఉంటుంది. ప్రమోషనల్ పోస్టర్‌లోని ఫైన్ ప్రింట్ వివో T4 5G దేశంలో ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ సహా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు. ఈ ఫోన్ కొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడా రానుంది.
వివో T4 5G ధర (అంచనా) :
గతంలో లీక్‌ల ప్రకారం.. భారత్‌లో వివో T4 5G ఫోన్ 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని సూచించింది. ఈ వివో ఫోన్ ధర రూ. 20వేల నుంచి రూ. 25వేల మధ్య ఉండవచ్చు.
వివో T4 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల Full-HD+ అమోల్డ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 SoC, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్ ఉంటాయని భావిస్తున్నారు.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో T4 5G ఫోన్ బ్యాక్ సైడ్ 2MP సెకండరీ సెన్సార్‌తో పాటు OISతో కూడిన 50MP సోనీ IMX882 మెయిన్ సెన్సార్, 32MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ బరువు 8.1mm సన్నగా ఉండి 195 గ్రాముల బరువు ఉండవచ్చు.