Vivo T4 Lite : కొత్త వివో T4 లైట్ ఫోన్ ఇదిగో.. అతి త్వరలో లాంచ్.. ఖతర్నాక్ ఫీచర్లు.. మీ బడ్జెట్ ధరలోనే..!

Vivo T4 Lite : కొత్త వివో T4 లైట్ వెర్షన్ ఈ నెలాఖరులో రానుంది. రూ. 10వేల లోపు ధరలో ఉండవచ్చు. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Vivo T4 Lite

Vivo T4 Lite : వివో ఫోన్ కొనేవారికి అదిరిపోయే న్యూస్.. వివో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో T4 లైట్ 5Gని త్వరలో లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ వివో T3 లైట్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రాబోతుంది.

Read Also : Samsung Galaxy M36 : కొత్త శాంసంగ్ గెలాక్సీ M36 వచ్చేస్తోందోచ్.. లాంచ్‌టైమ్, ధర వివరాలు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

గూగుల్ ప్లే కన్సోల్‌లో ఇప్పటికే ఫోన్ కనిపించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ వివో Y29s రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ వివో ఫోన్ లైట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 15, భారీ బ్యాటరీ, డైమెన్సిటీ చిప్‌సెట్‌తో రావచ్చునని లిస్టింగ్ పేర్కొంది.

వివో T4 లైట్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ వివో ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉండొచ్చు. ఈ మోడల్ నంబర్ V2446తో వివో T4 లైట్ పేరుతో లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ కలిగి ఉండవచ్చు. 2.4GHz హై సీపీయూ క్లాక్ స్పీడ్, స్పీడ్ GPU, బ్లూటూత్ 5.4 సపోర్ట్‌ను కలిగి ఉండొచ్చు.

నివేదికల ప్రకారం.. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్OS 15తో వస్తుంది. ఈ వివో ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ లాంచ్ ఎప్పుడు అనేది కంపెనీ ధృవీకరించలేదు. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : Waterproof Smartphones : నీళ్లలో తడిసినా నో వర్రీ.. iQOO వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

వివో T4 లైట్ ధర (అంచనా) :
వివో T4 లైట్ 5G ఫోన్ ధర దాదాపు రూ.10వేలు ఉంటుందని అంచనా. భారత మార్కెట్లో మరో సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌ వివో T3 లైట్ బేస్ ట్రిమ్ ధర రూ.10,499 కాగా, 6GB, 128GB ధర రూ.11,499కు లభిస్తోంది. రాబోయే రోజుల్లో వివో T4 ప్రో మోడల్ కూడా లాంచ్ చేయనుందని Xpertpick రిపోర్టు పేర్కొంది.