Vivo T4 Pro : కొత్త వివో కొత్త T4 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర, ఆఫర్లు మీకోసం..!

Vivo T4 Pro : వివో T4 ప్రో మోడల్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ధర, ఫీచర్లు వివరాలపై ఓసారి లుక్కేయండి..

Vivo T4 Pro

Vivo T4 Pro : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి కొత్త వివో ఫోన్ వచ్చేసింది. కొత్త వివో T4 ప్రోతో అధికారికంగా విస్తరించింది. పర్ఫార్మెన్స్ పరంగా వివో T3 ప్రో కన్నా అద్భుతమైన అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. కర్వడ్ అమోల్డ్ ప్యానెల్, VC స్మార్ట్ కూలింగ్ సిస్టమ్, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, భారీ బ్యాటరీ వంటి అనేక AI ఫీచర్లను కూడా పొందుతుంది. ఈ వివో ఫోన్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఆగస్టు 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 ప్రో అందుబాటులో ఉంటుంది. వివో T4 ప్రో ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్లు మరిన్నింటిని ఓసారి పరిశీలిద్దాం..

వివో T4 ప్రో స్పెసిఫికేషన్లు :

వివో T4 ప్రో ఫోన్ 6.77-అంగుళాల FHD+ క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. HDR10+, డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Google Pixel 9 : సూపర్ ఆఫర్ భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. త్వరపడండి..!

హుడ్ కింద ఈ వివో ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (4nm) మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అడ్రినో 722 జీపీయూతో పవర్ పొందుతుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FunTouch OS 15పై రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీతో వస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ OISతో 50MP సోనీ IMX882 మెయిన్ సెన్సార్, 50MP IMX882 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2MP డెప్త్ సెన్సార్‌ను పొందుతుంది. ఆరా లైట్ కూడా లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ వివో ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 సర్టిఫికేషన్లతో వస్తుంది.

భారత్‌లో వివో T4 Pro ధర, ఆఫర్లు :

వివో T4 ప్రో మోడల్ 8GB, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB, 256GB ధర రూ.29,999, 12GB, 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.31,999కు పొందవచ్చు.

ఆసక్తిగల యూజర్లు HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.3వేలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే, రూ.3వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. వినియోగదారులు వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.