Vivo T4x 5G : రూ. 15వేల లోపు ధరలో వివో T4x 5జీ ఫోన్.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. ఈ నెల 12 నుంచే ఫస్ట్ సేల్.. డోంట్ మిస్!

Vivo T4x 5G : భారత మార్కెట్లోకి వివో T4x 5G ఫోన్ వచ్చేసింది. ఈ నెల 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

Vivo T4x 5G

Vivo T4x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ నెల (మార్చి 5న) వివో T4x 5G సిరీస్ లాంచ్‌ అయింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో భారీ కెపాసిటీ బ్యాటరీ, మీడియాటెక్ చిప్, డస్ట్, వాటర్ నుంచి ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి.

Read Also : Moto E50 Pro : ఫ్లిప్‌కార్ట్‌‌లో అదిరే ఆఫర్.. ఈ మోటో ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. లిమిటెడ్ టైమ్ అంట.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ టెక్స్ట్, సర్కిల్ టు సెర్చ్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ ఉన్నాయి. వివో T4x 5జీలో రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వివో T4 5జీ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

వివో T4x 5జీ ధర, వేరియంట్లు :

  • 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ : రూ. 13,999
  • 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 14,999
  • 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: రూ. 16,999

వివో T4x 5జీ ఆఫర్లు, లభ్యత :
వివో T4x 5జీ ఫోన్ మార్చి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే.. వివో T4x 5జీ కొనుగోలు చేసే వినియోగదారులు HDFC, SBI, Axis బ్యాంక్ నుంచి రూ.వెయ్యి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

వివో T4x 5జీ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
వివో టీ4ఎక్స్ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ 6.72-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. కంటి రక్షణ కోసం (TUV) రీన్‌ల్యాండ్ ద్వారా ధృవీకరించింది.

ఈ స్మార్ట్‌ఫోన్ 400 శాతం వాల్యూమ్ యాంప్లిఫికేషన్‌తో డ్యూయల్ స్టీరియో-స్పీకర్‌ను కలిగి ఉంది. MIL-STD-810H ప్రమాణాలకు అనుగుణంగా ఉందని వివో తెలిపింది. కంపెనీ ప్రకారం.. వివో T4x ఫోన్ 6,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్టు అందిస్తుంది. USB-C కనెక్షన్ ద్వారా రివర్స్ ఛార్జ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. వివో T4x 5జీ ఆటో-ఫోకస్‌తో 50ఎంపీ ఏఐ ఆధారిత ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 30fps వద్ద 4K వీడియోలను క్యాప్చర్ చేయగలదు. అవాంఛిత అంశాలను తొలగించేందుకు ఏఐ ఎరేస్, ఇమేజ్ క్వాలిటీని పెంచేందుకు ఏఐ ఫోటో ఎన్‌హాన్స్, టెక్స్ట్ స్కానింగ్ కోసం ఏఐ డాక్యుమెంట్ మోడ్, లో-లైటింగ్ ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకమైన నైట్ మోడ్ వంటి ఏఐ ఫీచర్లను అందిస్తుంది. వివో T4x 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై రన్ అవుతుంది.

Read Also : DA Hike 2025 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక.. డీఏ పెంపుపై భారీ ప్రకటన..? జీతం, పెన్షన్ ఎంత పెరుగుతుందో తెలుసా?

వివో T4x 5జీ ఫుల్ స్పెసిఫికేషన్లు :

  • డిస్‌ప్లే : 6.72-అంగుళాల LCD, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7300
  • ర్యామ్ : 8జీబీ వరకు ర్యామ్ సపోర్టు
  • స్టోరేజీ : 256జీబీ వరకు (UFS 3.1)
  • కెమెరా : 50ఎంపీ ప్రైమరీ కెమెరా (AF)
  • బ్యాటరీ : 6500mAh
  • ఛార్జింగ్ : 44W ఫ్లాష్ ఛార్జ్ (40 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్)
  • OS : ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15
  • ప్రొటెక్షన్ : MIL-STD-810H సర్టిఫికేషన్, ఐపీ64