Vivo V30e Launch : ఈ వారమే కొత్త వివో V30e ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే స్పెషిఫికేషన్లు ఉండొచ్చుంటే?

ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మే 2న లాంచ్ కానుంది. మే రెండో వారంలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Vivo V30e Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త వివో వి30 సిరీస్ రాబోతోంది. భారత మార్కెట్లో ఇప్పటికే, వివో V30, వివో V30 ప్రో మోడల్స్ మార్చిలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, మరో వివో V30e ఫోన్ మార్కెట్లో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

Read Also : Nothing Phone 2a : బ్లూ వేరియంట్‌తో నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మే 2న లాంచ్ కానుంది. మే రెండో వారంలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. మలేషియా, ఇండోనేషియా వంటి ఇతర ఆసియా మార్కెట్లలో కూడా రానుంది. ఈ ప్రాంతాల్లో నిర్దిష్ట ప్రారంభ తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ధర విషయానికి వస్తే.. :
వివో వి30ఇ గత వెర్షన్ల ధరకు అనుగుణంగా రూ. 25వేల నుంచి రూ. 30వేల మధ్య ఉండే అవకాశం ఉంది. 128జీబీ లేదా 256జీబీ స్టోరేజీ ఆప్షన్‌తో 8జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్‌లలో ఉండవచ్చు. వివో వి30ఇ ఫోన్ ప్రామాణిక వివో వి30 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ వివో ఫోన్ 8జీబీ/128జీబీ మోడల్ ధర రూ. 33,999కు పొందవచ్చు. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. వివో వి30ఇ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్OS 14లో రన్ అవుతుందని భావిస్తున్నారు.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. :
వివో వి230ఇ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌తో రావచ్చు. వివో నుంచి ప్రమోషనల్ కంటెంట్, డిజైన్‌ కలిగి ఉంది. ప్రమోషనల్ టీజర్‌లో వివో ఫోన్ మాట్ ఫినిషింగ్, కాంట్రాస్టింగ్ గ్లోసీ స్ట్రిప్‌తో డీప్ వైన్ కలర్‌లో ఉండవచ్చు. ఈ డివైజ్ డ్యూయల్ లెన్స్‌లు, ఫ్లాష్‌తో కూడిన వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ వివో ఫోన్ భారత్‌లో వెల్వెట్ రెడ్, సిల్కీ బ్లూ అనే 2 కలర్ వేరియంట్‌లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. థర్డ్ ఆప్షన్, క్లౌడ్ వైట్ లాంచ్ సమయంలో భారత్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు.

ఈ కొత్త వివో ఫోన్ మందం 7.65 మిమీ మాత్రమే ఉంటుందని అంచనా. కెమెరా పరంగా ఫోన్‌లో 50ఎంపీ మెయిన్ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరా సెటప్ ఉండవచ్చు. దీనికి అదనంగా, వివో సైన్ ఆరా లైట్ మెరుగైన ఫొటో క్వాలిటీని అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 32ఎంపీ యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. వివో వి30ఇ ఫోన్ 5,500ఎంఎహెచ్ బ్యాటరీతో 44డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌తో వస్తుంది. అదనపు ఫీచర్లలో మల్టీఫేస్ కనెక్టివిటీకి ఎన్ఎఫ్‌సీ ప్రత్యేకమైన టఫ్ బాడీ ఆర్మర్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో వాటర్ వెట్ డిస్‌ప్లే కూడా ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Realme Narzo 70 Series : రియల్‌మి నార్జో 70 సిరీస్ ఫ్లాష్ సేల్ మొదలైందోచ్.. ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

ట్రెండింగ్ వార్తలు