Vivo V50 5G Price : ఇది కదా డిస్కౌంట్.. వివో V50 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్..!
Vivo V50 5G Price : వివో V50 ఫోన్ ధర తగ్గింది. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Vivo V50 5G Price : వివో లవర్స్ మీకోసమే.. వివో 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. మీరు కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. అమెజాన్‌లో వివో V50 ఫోన్ ఇప్పుడు రూ.28,898కి అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ.34,999 నుంచి మొత్తం రూ.6వేలకు పైగా తగ్గింపు పొందింది.

120Hz ఫ్లూయిడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. అద్భుతమైన విజువల్స్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ వివో ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, మల్టీ టాస్కింగ్ కోసం వినియోగించుకోవచ్చు. లేటెస్ట్ యాప్‌లు, గేమ్‌లకు సపోర్టు ఇస్తుంది. రూ.30వేల కన్నా తక్కువ ధరలో వివో V50 ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో వివో V50 5G డీల్ : ప్రస్తుతం అమెజాన్‌లో వివో V50 ఫోన్ రూ.28,898కి లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర రూ.34,999 నుంచి రూ.6,101 తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ కార్డుల ఆధారంగా అమెజాన్ నెలకు రూ.1,401 నుంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా అందిస్తుంది. అమెజాన్ కొనుగోలుదారులు పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ కోసం వివో V50పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ కండిషన్ ఆధారంగా రూ.27,350 వరకు తగ్గింపు పొందవచ్చు.

వివో V50 స్పెసిఫికేషన్లు : వివో V50లో 6.77-అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. గరిష్ట ప్రకాశం 4,500 నిట్స్ వరకు అందిస్తుంది. స్క్రీన్ సూర్యకాంతిలో కూడా స్పష్టంగా ఉంటుంది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. యాప్‌లు, ఫొటోలు, వీడియోల కోసం తగినంత స్టోరేజీని కలిగి ఉంది. ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది.

వివో ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది. వివో V50లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ OISతో మరో 50MP వైడ్-యాంగిల్ షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. షార్ప్ సెల్ఫీల కోసం హై-క్వాలిటీ వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
