రూ.25 వేలకే బోలెడన్ని ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌.. ఇక కెమెరా ఎలా ఉంటుందో తెలిస్తే..  

సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ కలర్లతో ఇది వస్తుంది.

వివో నుంచి భారత్‌లో వివో V50e విడుదల కానుంది. ఈ మోడల్‌ ఇప్పటికే బీఐఎస్‌ సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. రెండర్‌లు ఇప్పటికే దాని డిజైన్‌ గురించి వివరాలు వెల్లడించాయి. కెమెరా గురించి కూడా పలు వివరాలు తెలిశాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఆప్షన్ ఉంది.

వివో V50e కెమెరా
మైస్మార్ట్‌ప్రైస్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వివో V50e 50ఎంపీ సోనీ ఐఎమ్‌ఎక్స్‌882 సెన్సార్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్‌)కు సపోర్ట్‌ చేస్తుంది. కెమెరాలో 1x, 1.5x, 2x ఫోకల్ లెంగ్త్‌లతో సోనీ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్‌లు కూడా ఉంటాయి.

కెమెరాలో మన దేశంలోని యూజర్లను ఆకర్షించేందుకు వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్‌ను ఈ ఫోన్‌లో తీసుకొస్తున్నారు. ఈ కెమెరా సెటప్ వివో V50 5జీని పోలి ఉంది. తక్కు బడ్జెట్‌లో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్న వారిని వివో V50e ఫోన్‌ ఆకర్షిస్తుంది.

Also Read: iQOO జెడ్10 వచ్చేస్తోంది.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఫీచర్లు కెవ్వుకేక 

వివో V50e ఫీచర్లు
వివో V50e డిజైన్ ఇటీవల విడుదలైన Vivo V50 డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇది 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో దీన్ని విడుదల చేస్తున్నారు.

ఇందులో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో ప్రైమరీ 50ఎంపీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. వివో V50e 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కతోచ 5,600mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డస్ట్‌, వాటర్ రెసిస్టెన్స్‌ IP68+IP69 రేటింగ్‌తో దీన్ని విడుదల చేస్తున్నారు.

వివో V50e ధర రూ.25,000 నుంచి రూ. 30,000 మధ్యలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ కలర్లతో ఇది వస్తుంది. ఈ ఫోన్ ఏప్రిల్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.