Vivo V70 Series
Vivo V70 Series : వివో ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఫోన్లు.. వివో ఇండియా భారత మార్కెట్లో రెండు కొత్త 5G ఫోన్లను లాంచ్ చేసింది. కంపెనీ వివో V70 సిరీస్ కింద ఈ రెండు కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ లైనప్‌లో 2 మోడళ్లు లాంచ్ అయ్యాయి. వివో V70, సరికొత్త వివో V70 ఎలైట్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
వివో V70 ఎలైట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో రాగా, స్టాండర్డ్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉంది. ఈ రెండు ఫోన్లలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS6తో అమర్చి ఉన్నాయి. ముందుగా ఈ రెండు ఫోన్లకు సంబంధించి ధర, ఇతర ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం..
SBI, HDFC, Yes బ్యాంక్ కార్డులపై కంపెనీ 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్లు ఫిబ్రవరి 10 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి వస్తుంది. వివో V70 ఎలైట్ అథెంటిక్ బ్లాక్, ప్యాషన్ రెడ్, సాండ్ బీజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, వివో V70 లెమన్ ఎల్లో, ప్యాషన్ రెడ్ షేడ్స్‌లో లభిస్తుంది.
వివో V70, వివో V70 ఎలైట్ స్పెసిఫికేషన్లు :
వివో V70 ఎలైట్, వివో 70 మోడల్ 6.59-అంగుళాల VM9 అమోల్డ్ డిస్‌ప్లేతో పొందవచ్చు. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తాయి. ఈ ఫోన్‌లు 5,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తాయి. ఈ వివో ఫోన్లలో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది. డ్యూయల్-సిమ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS6పై రన్ అవుతాయి. ఈ వివో ఫోన్లలో 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చునని కంపెనీ తెలిపింది.
వివో V70 ఎలైట్ క్వాల్కమ్ ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 3GHz వరకు టాప్ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు LPDDR5x ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజీతో కూడా వస్తుంది. మరోవైపు, స్టాండర్డ్ వివో V70 ఫోన్ 2.8GHz ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పవర్ అందిస్తుంది. 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
వివో V70, వివో V70 ఎలైట్ కెమెరా స్పెషిఫికేషన్లు :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో V70 ఎలైట్, వివో V70 ఫోన్లు మీ ఫోన్‌లో DSLR రేంజ్ ఫొటోలను అందిస్తాయి. జీస్ ట్యూన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP (f/1.88) ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో OISతో 50MP (f/2.65) సూపర్ టెలిఫోటో లెన్స్, 8MP (f/2.2) అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్లు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP(f/2.0) ఫ్రంట్ కెమెరాతో వస్తాయి. ఫ్రంట్ నుంచి 4K రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేయొచ్చు. వివో V70 ఎలైట్, వివో V70 ఫోన్లలో 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, 6,500mAh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.